Monday 20 November 2017

కవిత నెం :310(జీవన మంత్రం)

కవిత నెం :310

*జీవన మంత్రం *

కోపమొస్తే సహించు
మౌనమొస్తే వహించు
భాదవస్తే భరించు
భాద్యతగా ప్రవర్తించు

కష్టమొస్తే కృషించు
సుఖాలను అనుభవించు
కన్నీళ్లొస్తే విలపించు
ఆనందమైతే హర్షించు

మంచిని ప్రోత్సహించు
చెడుని వ్యతిరేకించు
ప్రేమను చూపించు
బంధాలను బ్రతికించు

ధైర్యాన్ని ప్రదర్శించు
భయాన్ని విస్మరించు
స్నేహాన్ని వ్యక్తపరుచు
అహాన్ని విసర్జించు

పెద్దలను గౌరవించు
పిల్లలను ప్రేమించు
క్రమశిక్షణ పాటించు
అన్వేషణ కొనసాగించు

విషయాన్ని వివరించు
సలహాన్ని  సూచించు
దైవాన్ని ఆరాధించు
నీ దేశాన్ని కీర్తించు

ప్రశ్నని సందించు
జవాబు కోసం ప్రతీక్షించు
సమయపాలన గావించు
సన్మార్గాన్ని అనుసరించు


 - గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు





కవిత నెం :309( అక్షర సత్యాలు)

కవిత నెం :309

అక్షర సత్యాలు


పంతాలు -పైత్యాలు
కోపాలు -తాపాలు
పుణ్యాలు -పాపాలు
అవి మనిషన్నవానికి మామూలు

కష్టాలు -కన్నీళ్లు
వస్తే తట్టుకోలేరు
సుఖాలు -సంతోషాలు
ఎదుటివారిలో చూడలేరు

అహాలు -ఆవేశాలు
అవి మనకు అక్కర్లేదు
కుళ్లు -కుతంత్రాలు
నీవు చేయనక్కర్లేదు

హక్కులు -అర్హతలు
అవి అందరికోర్కెలు
ఇచ్చుకోలు -పుచ్చుకోలు
అందులో మంచి ఉంటే చాలు
అవునన్నా -కాదన్నా
ఇవి అక్షర సత్యాలు

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు