Wednesday 13 January 2016

కవిత నెం 213(ఎదురుచూపుల సంక్రాంతి )

కవిత నెం :213

ఎదురుచూపుల సంక్రాంతి 

ఎంతమంది నానమ్మ ,తాతయ్యల ఎదురుచూపులో 
ఈ సంక్రాంతి పండుగకైనా తమ మనువడు వస్తాడని 

ఎంతమంది అమ్మా ,నాన్నల మమకార చూపులో 
ఈ సంక్రాంతి పండుగకైనా తమ కొడుకు వస్తాడని 

ఎంతమంది అత్తా ,మామల ఆత్మీయ పిలుపులో 
ఈ సంక్రాంతి పండుగకైనా తమ అల్లుడు వస్తాడని 

ఎంతమంది కొత్త అల్లుళ్ల కోరికల చిట్టాలో 
ఈ సంక్రాంతి పండుగకి అత్తింట వారి కానుకుల కోసం 

ఎంతమంది అక్కల అనురాగచూపులో 
ఈ సంక్రాంతి పండుగకైనా తమ్ముడు చెంతకు చేరతాడని 

ఎంతమంది మరదళ్ల ఎడబాటు చూపులో 
ఈ సంక్రాంతి పండుగకైనా తమ భావ వస్తాడని 

ఎంతమంది స్నేహితుల ఎదురుచూపులో 
ఈ సంక్రాంతి పండుగకి తమ స్నేహితుడు తమను కలుస్తాడని 

ఏ ఊరు బిక్కుమని ఆశగా ఎదురుచూస్తుందో 
ఈ సంక్రాంతి పండుగకైనా సొంతవారు తమ గూడు చేరతారని 

ఏ పల్లె ఆవేదన నేడు తీరనుందో 
ఈ సంక్రాంతి పండుగకైనా తాను గుర్తొస్తున్నానని 

ఏ సొంత కొంపకి సంతోషం దరిచేరనుందో 
ఈ సంక్రాంతి పండుగకి బంధువుల రాకతో వెలుగు వస్తుందని 

ఏ పట్నం తన  మనసులో భాద తీర్చుకోనుందో 
ఈ సంక్రాంతి పండుగకైనా పుట్టిన్తివారిని ఒకటిచేస్తున్నానని 

కొన్ని హృదయాలు చలిస్తాయి - ఈ సంక్రాంతి పండుగకి 
కొన్ని స్నేహాలు పలకరించుకుంటాయి - ఈ సంక్రాంతి పండుగకి 
కొన్ని బంధాలు బిగుస్తాయి - ఈ సంక్రాంతి పండుగకి 
కొన్ని ప్రేమలు చిగురిస్తాయి - ఈ సంక్రాంతి పండుగకి