Saturday 2 January 2021

కవిత నెం 346(నా స్వప్నం (

నా స్వప్నం గెలిచింది
నిజజీవితంలో చేయలేనివాటిని సాధించమని
ఎన్నో  మైళ్ల దూరంలో మిగిలిపోయే ఆశల్ని
గుర్తుచేస్తూ, గమ్యం చేరమంటుంది *నా స్వప్నం*

ఒంటరిగా మొదలైన నా అడుగులో
నాకో లక్షాన్ని చేర్చి -నా లక్షణాన్ని మార్చింది * *నా స్వప్నం*.
స్వప్నిస్తూ స్వప్నిస్తూ నన్ను నేను చూసుకున్నాను.

అవమానల్ని -అవకాశంగా చేసుకోమంది నాస్వప్నం
ఆకలికేకల్ని ఆశయంగా మలిచింది నా స్వప్నం
అపజయాన్ని చూసి కృంగవద్దంది నా స్వప్నం
రూపాయి విలువ తెలుసుకోమంది నా స్వప్నం
పాపాయిల రోధించవద్దంది నా స్వప్నం

బయపడి పరిగెత్తవద్దంది నా స్వప్నం
బ్రతిమాలి ఎదగవద్దంది నా స్వప్నం
పసిపిల్లల నవ్వులో స్వచ్ఛత నా స్వప్నం
ఆనాధలుగా కాదు