Thursday 31 December 2015

కవిత నెం 212:వీడ్కోలు 2015- స్వాగతం 2016

కవిత నెం :212

వీడ్కోలు 2015- స్వాగతం 2016

గతాన్ని విడనాడాలి కాని గత సృతులు కాదు
కష్టాల్ని మరువాలి కాని కష్టపడటం కాదు
చెడు నుంచి నేర్చుకోవాలి కాని చెడిపోకూడదు
ఆనందాన్ని ఆహ్వానించాలి కాని అందరికీ అది పంచాలి

ఎన్నో చూసాం పాత సంవత్సరంలో
కష్టాలు - కన్నీళ్లు
నేరాలు -ఘోరాలు
అన్యాయాలు - అక్రమాలు
చోరీలు - కబ్జాలు
మాన భంగాలు - అత్యా చారలు
భూకంపాలు - వరదలు
చావులు - ఆత్మ హత్యలు


ఎన్నో చూసాం పాత సంవత్సరంలో

మంచి - మంచితనం
సంతోషం -సంబరం
ఉల్లాసం - ఉత్సాహం
స్నేహాలు - మంచి బంధాలు
ప్రేమలు - ఆప్యాయతలు
అదృష్టం - దురదృష్టం


ఏది ఏమైనా పాత సంవత్సరం
365 రోజులు మనతో చేసిన కాపురం
ఒక కాలెండర్ జీవిత కాలం
చెడు - మంచిల సంగమం
తీపి - చేదుల మిశ్రమం

ఏడిపించినా - నవ్వించినా
ఆశలు రేపించినా - గమ్యం చేర్చినా
వింత వింత సంఘటనలు చూపించినా
ఒక స్నేహానుబంధమే ఈ 2015

కాబట్టి పాత సంవత్సారానికి
సరదాగా
సంతోషంగా
వీడ్కోలు పలుకుతూ

రాబోవు నూతన 2016 సంవత్సరంకు
అదే నూతన ఉత్సాహంతో
అదే నూతన ఆశల కెరటాలతో
అదే నూతన సంతోష ప్లకార్డ్ లతో

స్వాగతాన్ని పలకండి
మీ నిండు మనస్సుతో
నాకు - మీకు
మన అందరికీ
కీడు లేని  మేలు తేవాలని
భాద లేని సంతోషం తేవాలని
మన జీవితపు దారులలో
మనం చెప్పుకోదగ్గ ,గర్వంగా చూపుకోదగ్గ
మధురమైన మంచి రోజులు రావాలని

సుస్వాగతం చెబుతూ
అందరికీ
''నూతన సంవత్సర శుభాకాంక్షలు ''


Tuesday 22 December 2015

కవిత నెం 211:నిజం అబద్దంల నిజం

కవిత నెం :211

నిజం అబద్దంల నిజం  

నిజమెప్పుడూ లోపలే దాగుంటుంది 
ఎందుకంటే అబద్దం అందంగా ఉంటుంది కాబట్టి 

నీకు తెలిసింది కాబట్టి అది నిజమనుకుంటే 
తెలియకుండా దాగున్న విషయం మాటేమిటి ?

నిజమెప్పుడూ నిప్పులా మండుతూ కనిపిస్తుంది 
అబద్దం ఆవలింపులా నీతోనే ఉంటుంది 

ఒక్కసారి నిజం చెబితే ,చరిత్ర మారుతుంది 
కాని అబద్దం అలవాటైతే ,చరిత్రనే దహిస్తుంది 

కనపడకుండా పోయేది ''నిజం '' నేటి కాలంలో 
కనిపిస్తూ ,కవ్విస్తూ ఉండేది ''అబద్దం '' ఈ కలికాలంలో 

నిజాన్ని నమ్మలేని జనాలున్న కాలంలో 
అబద్దాన్ని నిజం చేసే మహాత్ములు ఎందరో 

మనం జీవిస్తున్నది నిజంలోనా ? అబద్దంలోనా ?
మనం చూస్తున్నదంతా నిజమా ? అబద్దమా ?

మీరు చెప్పగలరా ? చూపించగలరా ?
అలా చేయగల్గితే మీరు మాట్లాడేది ఒక్కటే ఉండాలి 
అది నిజమా (లేక ) అబద్దమా ?

మనిషి పుట్టుక ఒక నిజం 
మనిషి చావు ఒక నిజం 
మధ్యలో జరిగే జీవితం ఒక ''కల్పితం ''
ఇది ఎక్కడో విన్నట్టు ఉంది కదా !

నిజాన్ని అబద్దమనుకుని 
అబద్దాన్ని నిజమనుకుని 
మన జీవితం కొన్ని కొన్ని సార్లు బోల్తాకొడటం నిజమే కదా 

నిజాన్ని చెప్పాలంటే ధైర్యం ఉండాలి 
అబద్దాన్ని చెప్పాలంటే చిన్న కారణం చాలు 

అవసరం ''అబద్దాన్ని '' పలికిస్తుంది 
భాద్యత ''నిజాన్ని '' బోదిస్తుంది 
ఏది పాటించాలో కాలమే మనకు నేర్పిస్తుంది 

కాని మన జ్ఞానంతో చేసే పని 
నీ వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది 

నిజంలో హాయి నిలుస్తుంది 
అబద్దం భయాన్ని కల్గిస్తుంది 
నీడలా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది 

నిజం మంచి బంధాలను ఏర్పరుస్తుంది 
అబద్దం అందరినీ దూరం చేస్తుంది 
అబద్దం అలవాటైతే 
నీ బ్రతుకుకు ఉండబోదు విశ్రాంతి 


Friday 11 December 2015

కవిత నెం 210 :ఒక్కడినే

కవిత నెం :210

ఒక్కడినే 

నాలో నేనే ఒక్కడినే 
నాతో నేనే ఒక్కడినే 
నా ముందు నేను 
నా వెనుక నేను 
నా చుట్టూ నేను 
నేనంతా ఒక్కడినే 

కాసేపు ఒక్కడినే 
క్షణకాలం ఒక్కడినే 
కాలంతో ఒక్కడినే 

అన్వేషిస్తూ ఒక్కడినే 
ఆలోచిస్తూ ఒక్కడినే 
ప్రేమిస్తూ ఒక్కడినే 
విరోధిస్తూ ఒక్కడినే 

అటువైపు ఒక్కడినే 
ఇటువైపు ఒక్కడినే 
ఎటువైపైనా ఒక్కడినే 

సంతోషంలో ఒక్కడినే 
భాదలో ఒక్కడినే 
లౌక్యంలో ఒక్కడినే 
లోకంతో ఒక్కడినే 

పోరాడినా ఒక్కడినే 
ఓడినా ఒక్కడినే 
గెలిచినా ఒక్కడినే 
గేలిచేసినా ఒక్కడినే 

నాడు ఒక్కడినే 
నేడు ఒక్కడినే 
మరోనాడైనా ఒక్కడినే 
మారనివాడిని ఒక్కడినే 

అందరిలో ఒక్కడినే 
కొందరిలో ఒక్కడినే 
నలుగురిలో ఒక్కడినే 
కాని నేనొక్కడినే 

ఒక్కడినే నేనొక్కడినే 
కాదు మరి ఒంటరినే 





Tuesday 1 December 2015

కవిత నెం 209:అసహనం

కవిత నెం :209

//అసహనం //

చంటి పిల్లవాడికి 
తను అడిగింది ఇవ్వకపోతే 
వాడు అసహనమే చూపుతాడు 

పిల్లలు తమ మాట విననప్పుడు 
చెప్పి చెప్పి విసిగిపోయి 
తల్లిదండ్రులు అసహనం అవుతారు 

ప్రొద్దున్నే లేవగానే 
తన భార్య కాఫీ ఇవ్వకపోతే 
భర్త అసహనానికి గురవుతాడు 

ఒకరోజు పనమ్మాయి రాకపోతే 
ఆ పని ,ఈ పని ఏ పని చెయ్యాలో తెలియక
ఆ ఇల్లాలు అసహనమైపోతుంది 

నెల తిరిగేసరికి 
ఇంటి బిల్లులు కట్టలేక 
ఆ యజమాని అసహనం చూపుతాడు 

చేసిన అప్పులు తీర్చలేక 
అప్పుల గోల భరించలేక 
ఆ వ్యక్తి అసహనమే చూపుతాడు 

జీతాలు సమయానికి రాకపోతే ''అసహనం ''
ఉద్యగంలో ప్రమోషన్ రాకపోతే ''అసహనం ''
పెన్షన్ లు సరిగ్గా రాకపోతే ''అసహనం ''
ఫీజు రీయంబ్రెస్మెంట్ రాకపోతే ''అసహనం ''
సకాలంలో వర్షాలు రాకపోతే రైతన్నకి ''అసహనం''
రైతు పంట చేతికి అందకపోతే ''అసహనం ''
అందుకే నేడు రైతన్నల ఆత్మహత్యలు 
పెరిగిన ధరలు చూసి వినియోగదారుడికి  ''అసహనం ''
ఒకరి మతంపై మరొకరికి ''అసహనం ''
అందుకే మత ఘర్షణలు జరిగేది 
ఏ సంసార జీవితం  ఉండదు ''అసహనం ''
అందుకే కదా విడాకుల శాతం పెరిగేది 
ఒకరి కులంపై మరో కులం వారికి ''అసహనం ''
మా కులం మా కులం అంటూ నినాదాల హోరు 
ప్రభుత్వం తీరుపై ఒక్కొక్కసారి ప్రజల ''అసహనం ''
విపక్షాల గోలపై అధికార పక్షం వాళ్లకి ''అసహనం ''
వృద్ధులైన తల్లిదండ్రులను సాకలేక పిల్లలకి ''అసహనం ''
అందుకే అనాధాశ్రామల బాట పెరిగింది 
ఓడిన వాడికి గెలిచిన వాడిపై ''అసహనం ''
ఒక దేశంపై మరో దేశం ''అసహనం ''
నేటికి ఇరుదేశాల మధ్య కొనసాగే యుద్ధాలు 



ఎక్కడైనా అంతరంగముగా ఈ ''అసహనం ''కొనసాగుతూనే ఉంటుంది 
''అసహనం '' ముందు పుట్టిందే కొత్తగా ఏమీ పుట్టలేదు 
దీనికి అంతు అంటూ లేదు కాని దీనికి ఆజ్యం పోయటం తగదు 
ఇది ఒక చిన్న విషయమే కాని ఫలితాలు పెద్దవి 
అందుకే అందరిలో చర్చనీయాంశం అయ్యింది 
పార్లమెంట్ ని సైతం కుదిపేస్తుంది 
దీనిని పెద్ద రచ్చ చేయాల్సిన అవసరం లేదు 
బ్రతికేవాళ్లు ,బ్రతకగల్గిన వాళ్లు బాగానే బ్రతుకుతున్నారు  









Thursday 26 November 2015

కవిత నెం 208:నేను కవినేనా ?

కవిత నెం :208

నేను కవినేనా 


నేను కవినేనా 

మనసు పెట్టే రాస్తాను 
నా కాలానికి పని చెబుతుంటాను 
మరి నేను కవినేనా ?

అక్షరాలను కలుపుతూ ఉంటాను 

అంతరంగాన్ని పలికిస్తూ ఉంటాను 
మరి నేను కవినేనా ?

పాండిత్యంలో ప్రావీణ్యం లేదు 

సాహిత్యాన్ని అభ్యసించలేదు 
మరి నేను కవినేనా ?

అనుభవాలతో అల్లికలు చేస్తుంటాను 

మనోభావాలతో రాతలు రాస్తుంటాను 
మరి నేను కవినేనా ?

అందంగా వర్ణిస్తానో తెలియదు 

అర్ధవంతంగా లిఖిస్తానో తెలియదు 
మరి నేను కవినేనా ?

పుస్తక పఠనం చాలా తక్కువ

మనసు  పఠనం అంటే కొద్దిగా మక్కువ 
మరి నేను కవినేనా ?

నేను రాసేది బాగుంది అనుకుంటాను 

నేను రాసినది నిరుపయోగం కాదనుకుంటాను 
మరి నేను కవినేనా ?

నేననుకున్నది రాయటమే తెలుసు 

నేచెప్పదలుచుకున్నది నాకు ఇలాగే వచ్చు 
మరి నేను కవినేనా ?

ఒకరి ఆదరణ పొందలేని అనర్హుడిని 
నా మనసుని నమ్మిన నాకు నేనే నేస్తాన్ని 
మరి నేను కవినేనా ?

అనవసర రాద్దాంతాలు నా కలం కి లేవు 
అవసరమైన సందేశం  ఒకటున్నా చాలు 
మరి నేను కవినేనా ?

నా రాతలు పిచ్చి కాగితాలే 
నా భావాలు మట్టి బొమ్మలే 
మరి నేను కవినేనా ?

పెద్దగా ఎవ్వరితో పరిచయాలు లేవు 

ఎటువంటి బిరుదులు నా కంటూ లేవు 
మరి నేను కవినేనా ?

కవి అన్న గుర్తింపు కార్డ్ నాకు లేనే లేదు 

ఏ మహామహులతో నేను పోల్చుకోలేను 
మరి నేను కవినేనా ?

నేనింతే అనే అహంబావి ని కాను 
నేర్చుకునే విద్యార్దినే ఈ కాలంలో ,కవిత్వంలో 
మరి నేను కవినేనా ?

- గరిమెళ్ళ గమనాలు 






Wednesday 25 November 2015

కవిత నెం 207:నాడు -నేడు 'దేశం ' లో

కవిత నెం :207

నాడు -నేడు 'దేశం ' లో 

ఒకప్పుడు 
దేశ స్వాతంత్రం కోసం 
మన స్వేచ్చ కోసం 
ఓడారు ,పోరాడారు -గెలిచారు 

అన్ని కులాలు 
అన్ని మతాలు 
అన్ని గ్రామాలు 
ఒక్కటిగా ,సమిష్టిగా -నిలచారు 

ఆత్మ విశ్వాసంతో ,
గుండె ధైర్యంతో ,
రొమ్ము విరచి ,
శత్రువుల  వెన్ను - విరగగొట్టారు 

పరాయివాళ్ల పాలనలో 
సమాది అవుతున్న 
మన దేశ సమైక్త్యతని 
స్వార్ధపరుల నుంచి - రక్షించారు 

మరి ఆ స్వేచ్చ ,స్వాతంత్రం మన సొంతమయ్యాక 
మనం చేసిన మంచి ఏమి ?
మనవళ్ల దేశానికి ఉపయోగమేమి ?

నీ స్వార్ధం 
నీ లోభం 
నీకు నువ్వే ప్రలోభం 

లేదు న్యాయం 
లేదు ధర్మం 
న్యాయ దేవతకే అంధకారం 

మన వాళ్లే 
మన ప్రజలే 
మన దేశమే 
అని ఆలోచన ఎవ్వరికి ?

దొరికినదా దోచుకో 
నీ కీర్తిని పెంచుకో 
నీ కోరిక కోసం 
మానవ ధర్మాన్ని మరచిపో 

ప్రజాస్వామ్యం అంటూ 
రోజుకొక్క పార్టీ పెడుతూ 
నీ పాలనే నిలవాలి అంటూ 
ఎందుకు రాజకీయం ?

ఉన్మాదం 
ఉగ్రవాదం 
పడగ నీడలో 
మన దేశం ఇరుకున పడుతుంటే 

నీ మతం - నీ కులం 
నీ పార్టీ - నా పార్టీ
ఐకమత్యం లేక 
ఒంటరిగా నువ్వు సాగితే 

ఏది రక్షణ 
ఎక్కడుంది దుష్ట శిక్షణ 
అబాగ్యులు 
అమాయకులు 
మన ప్రజలు 
ఆ వినాశనంలో కొట్టుకుపోతే 

రండి కలిసి రండి 
ఒక్కటిగా ఉండండి 
ఎవ్వరికీ ఇవ్వొద్దు అవకాశం 
మన ప్రజలు - మన దేశం 
క్షేమమే -మన దేశ సౌభాగ్యం  









Tuesday 24 November 2015

కవిత నెం 206:ఫేస్ బుక్ స్నేహాలు

కవిత నెం :206

ఫేస్ బుక్ స్నేహాలు

ముఖాలు కనపడవు - ముఖ చిత్రాలు ఉంటాయి 
మనసు తెలియదు - మాటలెన్నో చెప్తాయి 
చిరునామా తెలియదు - కొత్త స్నేహాలు పుడతాయి 
బంధువులెందరు ఉన్నా - ఏ బందుత్వాలు పట్టవు 
అమ్మా ,నాన్న పక్కనే ఉన్నా -  ఆత్మీయతలుండవు 
మొగుడు పెళ్లాల మధ్య - చిచ్చు రగిలిస్తూ ఉంటాయి 
మన దినచర్యను మొత్తం - పబ్లిక్ కి తెలియచేస్తుంటాయి 
రోజుకొక పోస్ట్ పెట్టించి - స్టేటస్ పరిశీలించమంటాయి 
లైక్స్ ,కామెంట్స్ అంటూ - కొత్త మోజు తగిలిస్తాయి 
తెలియని పబ్లిసిటీ కోసం - ఆరాటం పెరిగేలా చేస్తాయి 
ఫ్రెండ్స్ లిస్ట్ ,చాట్ బాక్స్ లతో - కాలక్షేపం చెయ్యమంటాయి 
మీటింగ్స్ ,ప్రోగ్రామ్స్ అంటూ - కొత్త టైం టేబుల్నిస్తాయి 
నిజమైన స్నేహాలు కొన్ని - మొహమాట మిత్రాస్ కొన్ని 
అనవసర పరిచయాలు కొన్ని - అవసరాలకి అండ కొన్ని 
కొత్త అనుభవాలు కొన్ని - చేదు జ్ఞాపకాలు కొన్ని 
మంచి సంకల్పం కోసం కొన్ని - చెడ్డ కార్యకలాపాలు కొన్ని 
పొగరుగా ,వగరుగా - చిరు చిరు స్నేహాలు చిగురించగా 
కారంగా ,మమకారంగా - మధుర బందాల్ని కలుపంగా 
గుసగుసలు కొన్నైతే - రుసరుసలు చూసేవి కొన్ని 
ఆహ్లాదం ,ఆనందం తెచ్చేవి కొన్నైతే - నిరాశతో చూసేవి కొన్ని 
కొన్ని ప్రయోజనాలే - మరికొన్ని నిస్ప్రయోజనాలు 
సోషల్ మీడియా లో పుట్టే స్నేహాలు మాత్రమే ఇవి 
మన సొంతం అనుకుని -మరీ మునిగి పోకండి 
ఇవే ప్రధానం అనుకుని - మీ పనులను మానుకోకండి 
మరీ శృతిమించకుండా -స్నేహ వాతావరణాన్ని ఉంచండి 
ఆరోగ్యంగా ,అందంగా ఉండేలా -ఫేస్ బుక్ స్నేహాలు చెయ్యండి 

Thursday 19 November 2015

కవిత నెం 205 :ఆడు మగాడు

కవిత నెం : 205

అంతర్జాతీయ మగవారి దినోత్సవం సంధర్భంగా 

********************************************
((((((((((ఆడు మగాడు )))))))
_____________________________________________

చిరిగిన చొక్కానైనా ధరిస్తాడు
తన పిల్లలకు ఏ లోటూ రాకుండా చూస్తాడు
ఆడు మగాడు ఒక 'నాన్న 'గా

మాసిన గడ్డంతో తిరుగుతూ ఉంటాడు
తన భార్య అందంగా ఉంటే చాలనుకుంటాడు
ఆడు మగాడు ఒక 'భర్త' గా

చూస్తానికి జులాయిలా కనిపిస్తాడు
పున్నామ నరకం నుంచి తప్పించే యోధుడవుతాడు
ఆడు మగాడు ఒక 'కొడుకు ' గా

అల్లరిచేస్తూ ,ఏడిపిస్తూ ఉంటాడు
అపురూపంగా తన గుండెల్లో పెట్టుకుంటాడు
ఆడు మగాడు ఒక 'సోదరుడు' గా

ఎనలేని ప్రేమను కురిపిస్తాడు
తన ప్రేమకోసం ప్రాణ త్యాగానికైనా సిద్దపడతాడు
ఆడు మగాడు ఒక 'ప్రేమికుడు ' గా

అన్నివేళలా అందుబాటులో ఉంటాడు
అత్మీయతనందిస్తూ నీ అంతరాత్మ గా నిలుస్తాడు
ఆడు మగాడు ఒక 'స్నేహితుడు' గా

సరదాగా గిల్లి కజ్జాలు పెట్టుకునే 'భావ ' గా

వదినంటే అమ్మతో సమానంగా భావించే 'మరిది 'గా

అత్తింట్లో కోడలికి ఆప్తుడు గా నిలచే 'మామ ' గా

నాన్న తర్వాత నీ మేలుకోరుకునే 'బాబాయి' గా

మంచి ,చెడులను విశ్లేషిస్తూ దారిచూపే 'పెద్ద నాన్న ' గా

ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటూ ,తోడుగా ఉండే 'తాతయ్య ' గా 

కుటుంబ భారాన్ని మోసే ఒక 'కూలీ ' గా 

చెమట చిందించు వేళ ఒక 'శ్రామికుడు ' గా 

బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహించే ఒక  'ఉద్యోగి' గా 

నీ లక్షానికి చేర్చుటలో ఒక 'డ్రైవర్' గా 

దేశాన్ని సంరక్షించే ఒక 'సైనికుడు' గా 

కర్తవ్యాన్ని నిర్వర్తించే 'కర్త ' గా 

విశ్వాన్ని నడిపించే 'సృష్టికర్త ' గా 

చెప్పుకుంటూ పొతే ఎన్నో విధులు 

ఈ 'పురుషుడు 'లేనిదే ఏ కార్యమూ ఉండదు 

నేడు జరుగుచున్న ప్రపంచ తీరును బట్టి 

మగాడు 'మృగాడు ' గా మారటం చూసి 

పురుషులలో పుణ్య పురుషులు లేకపోవటం చూసి 

ఒక మగాడిని మగాడుగా  చూడలేని లోకంతీరుకు దారి తీసి 

కాని ఇవన్నీ ఒక్కసారి పక్కన పెడితే 

ఆడు మనసున్న 'మగాడే ' మరీ 




















Friday 13 November 2015

కవిత నెం 204:నేటి చుట్టరికాలు

కవిత నెం :204

**నేటి చుట్టరికాలు **

పేరుకి ఉంటుంది రక్త సంబంధం 
కాని మనసులకి ఉండదు ఏ సంబంధం 

కలిసి యుండలేరు 
కలిసినా మనస్పూర్తిగా మాట్లాడుకోలేరు 

నేనే పెద్ద ,నేను చిన్న అనే ఆలోచన తప్ప 
పలకరింపుకి పెదవుల్ని కదిలించలేరు 

వారి స్వార్ధం ,స్వప్రయోజనమే ముందు 
మన తోటి వారే , మన వారే అని తలంచకుండు 

గౌరవం ఇస్తున్నా అది అందుకోలేరు 
ఇంకేదో కావాలని ,బెట్టుగా కూర్చుంటారు 

కుటుంబంలోని బంధాలు కంటే 
సమాజంలోని డబ్బు ,పరపతికై చూస్తుంటారు 

మనవాళ్లు మన స్థాయి కన్నా తక్కువైతే 
మాటవరసకి పిలిచి అవమానిస్తారు 
ఒకవేళ రాకపోతే రాలేదని సాధిస్తారు 

తనకంటే బంధువులలో గొప్పవాళ్లు ఉంటే 
అతిది మర్యాదలతో సత్కరిస్తుంటారు 

ఒకరిని ఒకరు నమ్మలేరు 
ఒకరిపై ఒకరు ప్రేమను పొందలేరు 

నిజమైన ప్రేమ , వాత్సల్యం మరుస్తారు 
కనిపించే డాబుకి ,డబ్బుకి విలువిస్తారు 

అందరిముందు పలానా అని చెప్పుకోలేరు 
ఒకరు వీరికన్నా బాగుంటే ఓర్చుకోలేరు 

అవసరం ఉంటే మాత్రం ఆత్మీయత కురిపిస్తారు 
అవసరం లేదంటే నీ గురించి ఆరా కూడా తీయరు 

పల్లెటూర్లలో ఉన్నప్పుడు చుట్టమే కదా ఆత్మీయం 
పట్నాలు వచ్చాక ఏకాంతమే నీకున్న ఆతిధ్యం 

పండుగలకైనా ఆహ్వానించు కోగల్గుతున్నారా ఇప్పుడు 
ఎవరి తీరు వారే ,ఎడ ముఖం పెడ ముఖాలే కదా ఎప్పుడూ 

పిలిస్తే ప్రేమగా  పలికే చుట్టరికాలు ఉండాలి కాని 
వచ్చామా ,వెళ్ళామా అంటే మాత్రం అవి చట్టరికాలే 

మారుతున్న కాలంతో పాటు బంధాలు మారుతున్నాయి 
ఆ బంధాలు వలన వట్టి బాధలే మిగులుతున్నాయి 

గుర్తుంచుకోండి అందరూ ....... 
మన వారు ,మనకోసం ఉన్నప్పుడు ఆ బంధాన్ని నిలుపుకోండి ఎప్పుడూ 

- గరిమెళ్ళ గమనాలు 

Tuesday 10 November 2015

కవిత నెం 203:నిజమైన దీపావళి రావాలనీ ........

కవిత నెం :203

నిజమైన దీపావళి రావాలనీ ........ 

స్వార్ధానికి బలవుతున్న అనాధలను చూడు 
కోడిపిల్లలా మారుతున్న ఆడపిల్లల బ్రతుకు చూడు 
వ్యసనపరుల కామ క్రీడలకు ఒత్తిలా కరిగిపోయే ఆడ మనసు చూడు 
ర్యాగింగ్ బూతానికి ఆహారమవుతున్న అక్కా ,చెల్లెలను చూడు 
నిర్ద్యాక్ష్యంగా మగ కామందుల చేతిలో నలిగిపోయే నేటి స్త్రీ ని చూడు 
ఎటువంటి రక్షణ లేని సమాజ అరణ్యంలో చిక్కుక్కున్న శీలం చూడు 
ఆడపిల్లలను కని కన్నీరు మున్నీరవుతున్న అమ్మా ,నాన్నలను చూడు 
అన్నం పెట్టే రైతన్న అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చూడు 
పేదరికాన్ని తట్టుకోలేక రోడ్డున పడుతున్న బిక్షగాళ్ళను చూడు 
చదువుకునే స్తోమత లేక పనికి వెళ్తున్న బాల కార్మికులను చూడు 
మదమెక్కి కష్టపడలేక పెరుగుతున్న దొంగతనాలు చూడు 
పేదలను తోక్కేస్తూ అడ్డంగా పెరిగిపోయే సంపన్నులను చూడు 
మద్య తరగతి బ్రతుకునెక్కిరిస్తూ  మండే ధరలు చూడు 
మురికి వాడల్లో ,అనాధ ఆశ్రమాల్లో రగులుతుండే జీవం చూడు 
 మనం బాగున్నా మన చుట్టూ వాళ్ల బాగు కోరుతూ వెలిగించు దీపం 
వారి వారి జీవితాలలో ఎటువంటి చెడు జరగకూడదని వెలిగించు దీపం 
చెడును ఎంత రూపుమాపుతున్నా పుట్టుకొస్తూనే ఉంటది 
చెడు అంతం ఇంకా మిగిలే ఉంది ఈ భూమి పైనా 
అటువంటి చెడున సంక్లిప్తంగా నాశనం అవ్వాలని 
మూగబోయిన బ్రతుకులలో చిరునవ్వులు తారజువ్వలవ్వాలని 
ఈ దీపావళి పండుగ అందరికీ అన్ని శుభాలని చేకూర్చాలని 
నిండు మనస్సుతో ''దీపావళి పండుగ శుభాకాంక్షలు '' 

Monday 2 November 2015

కవిత నెం 202:రైలంట రైలు

కవిత నెం : 202

రైలంట రైలు
దీనికి ఉండదంట వేలా పాలు
ఇది తిరుగుతాది ఎన్నో మైళ్లు
కూస్తూ ఉంటుంది రైలు బెల్లు 
ఆగిన చోట ఉండదు
ప్రతీ చోటా ఇది ఆగదు
కాలంలో ప్రయాణిస్తూఉంటుంది 
కాలాన్ని వెనక్కినెట్టినట్టు ఉంటది 
సమయానికి గమ్యాన్ని చేరలేనిది 
మూడొస్తే వాయువేగంలో పోతది 
సిగ్నల్ అందకపోతే నత్తలాగా నడుస్తది 
సౌకర్యాలతో సాగిపోయే రెండు పట్టాల ప్రయాణం 
ప్రపంచమంతా చుట్టేసే పొడవైన వాహనం 
అందరికీ ఇష్టమే కదా  రైలంటే 
ఒక్కసారి దీనిలో ప్రయాణించామంటే 
ఆ అనుభూతిని మరువలేము ఇట్టే 







Wednesday 28 October 2015

కవిత నెం 201(అప్పుల తిప్పలు)

కవిత నెం :201

'అప్పుల తిప్పలు ''

అప్పుల తిప్పలు 
ఇవి ఎవ్వరికే చెప్పుడు 

ఆదియందు అందంగా 
రాను రాను భారంగా 

మన ఆలోచనలను ఘోరంగా 
అంతరాత్మలో కలత నిరంతరంగా 

నిద్రవచ్చినా పోనీయ'కుండా 
ఆకలివేసినా తిననీయకుండా 

వెక్కిరిస్తుంటుంది వెటకారంగా 
వేడుక చూస్తుంటుంది వినోదంగా 

జీవితానికి అవసరం డబ్బైతే 
అవసరమైన వేళ అది సర్దుబాటుకాకపోతే 
నేనున్నా అంటూ ''స్నేహమై '' నిన్ను చేరేదే అప్పు 

ఒకప్పుడు అప్పు దొరకటం చాలా కష్టమే 
ఇప్పుడు తలుచుకుంటే చాలు తలుపు తడుతుంది 

అది తీర్చేంత వరకు నిన్ను వెంబడిస్తుంది 
అందరికీ సులువు కాదు అప్పుల్ని తీర్చటం 

అప్పు చేసి తుర్రు మనే వాళ్లు ఉన్న ఈ కాలంలో 
అప్పు చేసి బోరు మని ఆత్మాహుతి చేసుకునే వాళ్లు ఉన్నారు 

క్రమంగా అప్పును మాపుకునే వారు  ఉన్న ఈ కాలంలో 
అక్రమంగా చేసిన అప్పుకు వడ్డీ బాదే వారూ ఉన్నారు 

అందుకే అప్పంటే భయపడి దూరంగా ఉండేవాళ్లు ఉంటే 
అవసరానికి తప్పక అప్పు చేసి ఇరుక్కునే వాళ్లు కొందరు 

ఏదైనా ఇది అమృతమే తీర్చగల్గే సమర్ధత ఉంటే 
మన అసమర్ధతతో భుజాన వేసుకుంటే ఇక విషమే 

మన అవసరం తీరటానికి చెయ్యాలి 'ఋణం '
అప్పుతో చెలగాటమాడితే మన జీవితమే 'రణం '

అప్పు చేసి పప్పు కూడు అన్నమాట ఏమోగాని 
అప్పు చేసి ముప్పు కూడరాదు నిజమేమో 

అప్పుతో తప్పు చెయ్యకు 
అది నిప్పై నిన్ను దహించేస్తుంది 



Tuesday 27 October 2015

కవిత నెం 200:గుండె చప్పుడు

కవిత నెం :200

గుండె చప్పుడు 

నాలో నేనే నీలా 
నీలో నీవే నాలా 
ఒక్కసారిగా ఒక్కటై 
ప్రతిస్పందన మొదలై 
మనలో మనమే చేరగా 

ఏమంటారు దానినే 
గుండె చప్పుడు ... గుండె చప్పుడు 

నీ ఆలోచనలో నేనే ఉండగా 
నా ఆలోచనలో నీవే నిండగా 
నా కనులలో వెలుగు నీవేగా 
నీ శ్వాషలో ఊపిరి నేనుగా 

ఒకరికి ఒకరం 
ఒక్కసారిగా ఇద్దరం 


అంటారేమో దీనినే 
గుండె చప్పుడు ... గుండె చప్పుడు 

నీ వెళ్లే చోటనే నేనే రానా 
నే నడిచే బాటలో అడుగివి నీవుగా 
వింటున్నా నీ పేరే ఒక సంగీతంలా 
నీ పిలుపే నాకు ఒక ఆలాపంలా 

ఒకరిలో ఒకరం 
అర్ధసగమై ఇద్దరం 


అంటారేమో దీనినే 
గుండె చప్పుడు ... గుండె చప్పుడు 


నా మనసులో మాటే నీదిగా 
నీ మనసున్న చోటే నాదిగా 
నీ చేతిలో ఉండే రేఖలా 
నా నుదిటిన ఉండే గీతలా 

ఒకరై మనం 
ఒకరికోసం ఒకరం 


అంటారేమో దీనినే 
గుండె చప్పుడు ... గుండె చప్పుడు 




Sunday 25 October 2015

కవిత నెం 199:అసమాంతరాలు

కవిత నెం :199
*అసమాంతరాలు *
  1. అక్షరాలు రేకుండా పదాలు సమకూర్చలేము 
    అవాంతరాలు లేకుండా గమ్యం చేరలేము 
    ఏది ఏమైనా నిజాన్ని నమ్మలేము 
    అనుకున్నది ఏమైనా జరగకుండా ఆపలేము 
    నిరీక్షణ ఏమైనా ఫలితాన్ని మార్చలేము 
    జరిగిన దానిని తలుచుకుంటూ 
    జరగవలసినది ఆలోచిస్తూ 
    ప్రస్తుతంలో ఏమి చేయలేని అయోమయంలో 
    ఎందుకు  నేస్తం నీవుండాలి 
    నిన్న అనేది ఓ పునాది 
    చేదు అనేది రుచి కి ప్రతి నిది 
    తెలుసుకోవటానికి అడుగు ముందుకు వెయ్యి 
    అనీ తెలిసినట్టుగా ఉండటం మర్యాద కాదోయి 
    జీవితం అనేది ఒక్క గతంతో ఆగేది కాదోయి 
    జీవితం అనేది ఒక్క నిర్ణయంతో నిలిచిపోదోయి 
    నువ్వంటూ ఉన్నందుకు 
    నీకోసం మరొకటి ఉంటుంది 
    ఒకచోట నీకు లబించనిది 
    మరోచోట నీకోసం వేచి యుంటుంది 

కవిత నెం 198:మౌన శబ్దం

కవిత నెం :198
*మౌన శబ్దం *
  1. కలలు అలలై కావ్యమై 
    కురిసినవి వర్షపు చినుకులై 
    కదిలించే నాలో తలపులే 
    కదిలోచ్చే నాతొ ఊహలే 
    ఎదలో చెరుగని గుర్తులే 
    వికసించే నేటి కుసుమమై 
    మెరిసింది మెరుపు కాంతియై 
    రమ్మంది పిలుపు గమ్యమై 
    ఆగింది నా మనసు నిశబ్దమై....  నిశబ్దమై ............ 

కవిత నెం 197:ఒకరిలో ఒకరం

కవిత నెం :197
*ఒకరిలో ఒకరం *


నువ్వున్నావులే నా కోసమే 
నా జన్మాంతము నీతో సాగులే 
నింగీ నేలకు దూరం కరిగెనే 
నిన్ను కలిసిన వేళలో నే లోకం మరుచులే 

ఎదలో ఏదో ఆశ 
నా కలలో నిన్నే తలచా 
ఏ క్షణము విడువని శ్వాస 
నిన్ను చూసి కదిలేను తెలుసా 

ఎవరికెవరు తెలియని
ఏమౌతామో మనకని 

అని తెలిసి తెలియని తరుణం 
నిన్ను పరిచయం చేసిన సమయం 

ఎంతో ఇష్టమే నిన్ను చూసిన క్షణము 
ఏ అదృష్టమో చెలి నీతో బంధము 

ఒకరికి ఒకరం ఊపిరని 
నువ్వోచ్చాకే తెలిసేనని 

తడబడి తడబడే మనసులలో 
కనపడని మౌనం దాగేనని 

ఇదియే ప్రేమని -మనకోసం వుందని 
ఏ విధి రాతయో -వరమై ఉందని  

కవిత నెం196:దాచుకున్న మనసు

కవిత నెం :196
* దాచుకున్న మనసు  *

నేనంటే  ఇష్టాన్నీ నీలో దాచుకుంటావా 
నేనే నీ ప్రాణమని నాకు తెలియదంటావా 

మాట తెలిపే వేళ మౌనమెందుకే 

నీ మనసు తెలుసే బాల కోపమెందుకే 

బంగారం నిన్నోదిలి నేను ఎలా ఉండనే 

పెంచుకున్న ఈ దూరంలో నువ్వు ఏమి అవుతావే 

నీ కళ్ళలోన నా రూపం - కనపడుతుంది 

నీ కనుపాప దానినేమో కప్పి వుంది 

నీ పెదవులలో నా పేరు దాగివుంది 

నా పిలుపు కోసం అది వేచియుంది 

బంగారం ఈ నిముషం ఏమి తెలియదంటావా 

నీ కోసం ఆకాశమై ఎదురు చూడమంటావా 

నీ గుండెలోన మనప్రేమ నిలచివుంది 

ఎందుకనో మది దాటి రాను అంది 

చిన్నారి నీ స్నేహం - జతకమ్మంటుంది 

దానికేమో నీ హస్తం -అందనంటుంది 

బంగారం ఎన్నాళ్ళిలా మన ఒంటరి పయనం 

ఇకనైనా క్షమించమ్మా నా చిన్ని హృదయం 

కవిత నెం195:మరో జన్మంటూ ఉంటే

కవిత నెం :195

మరో జన్మంటూ ఉంటే 

మరో జన్మంటూ నాకు ఉంటే 
నేనిలాగే మనిషిలానే జన్మించాలి 
ఈ జన్మలో ఉన్నవాళ్ళు నాకు మరో జన్మలోనూ కావాలి 
నేను కోల్పోయిన వాళ్ళను మరో జన్మలో చూడగలగాలి 
అమ్మప్రేమ ఇలానే నాకు తోడుండాలి 
రాజును కానక్కరలేదు కాని సంపన్నుడిని కావాలి 
రాజ్యాన్ని పాలించనక్కరలేదు ఉన్నతంగా జీవించాలి 
మహోన్నతుడిని కానాక్కరలేదు  మానవత్వం ఉంటే చాలు 
చిరంజీవిని కానక్కరలేదు చిరునవ్వుతో బ్రతికితే చాలు 
సొంత ప్రయోజనాలకు లోబడని నిస్వార్డుడిని అయితే చాలు 
పరాక్రమవంతుడుని కానక్కరలేదు గుండె దైర్యం ఉంటే చాలు 
పిరికితనం అసలే వద్దు భయం తెలియనివాడిగా ఉంటే చాలు
మరీ సుఖాలను చూడనక్కరలేదు కష్టాలు ముంచకుండా ఉంటే చాలు 
భాద కలగకూడదని అనటంలా సమస్యలను అదిగమించగల్గితే చాలు  
మరీ అందంగా పుట్టక్కరలేదు మనసు నిర్మలంగా ఉంటే చాలు 
మేధావిని కానక్కరలేదు ప్రపంచ జ్ఞానం తెలిస్తే చాలు 
పండితుడిని కానక్కరలేదు అన్ని కళల్లో నైపుణ్యత ఉంటే చాలు 
ఒకరికి ద్రోహం చేయకుండా ,మంచి స్నేహం పొందగల్గితే చాలు 
అతిగా శ్రమపడకుండా కంటికి కునుకు ఉంటే చాలు 
ఒకరికోసం ఎదురుచూడకుండా నా పనులు నేను చేసుకుంటే చాలు 
మంచి ,చెడు ఆలోచించకుండా ఒకరికి సాయం చెయ్యగల్గితె చాలు 
సమాజాన్ని ఉద్దరించనవసరంలా నలుగురికి మేలు చెయ్యగల్గితే చాలు 
కోరుకున్నది జరుగకపోయినా నిరాశ వెంటాడకుంటే చాలు 
శత్రువులు లేకుండా అందరికీ మంచి మిత్రుడినయితే చాలు 
నా కంటూ ,నన్ను అభిమానించే వాళ్లు నా కోసం ఉంటే చాలు 
మరీ సన్యాసి లా మారక్కరలేదు దేవుడంటే భక్తి ఉంటే చాలు 
నా వ్యక్తిత్వం నాలానే ఉండాలి మరొకరిని గౌరవించగల్గితే చాలు 
మేడలు ,మిద్దెలు ఉండనవసరం లేదు నాకంటూ ఒక ఇల్లు ,పొలం  ఉంటే చాలు 
ఎటువంటి భాదరబందీలు లేకుండా నా జీవితం కొనసాగితే చాలు 
ఒక హిందువుగా ,ఒక కవిగా బ్రతికినంత కాలం చాలు 







Friday 23 October 2015

కవిత నెం 194:నేటి స్నేహ వైఖరి

కవిత నెం  :194

''నేటి స్నేహ వైఖరి  ''


ప్రతీ మనిషికీ అలవాటు ''స్నేహం ''

ప్రతీ మనిషికీ అవసరం ''స్నేహం ''
స్నేహం పేరుతోనే ఒకరికి ,ఇద్దరవుతుతారు 
ఆ ఇద్దరూ ,ఇరవై ,వందలవుతుంటారు 
అంతా బాగానే ఉంటుంది 
మన అవసరం ,ఆనందం కోసం ''స్నేహం '' అవసరమే 
మన కష్ట -సుఖాలను పంచుకునేది ఒక్క ''స్నేహితుల'' తో మాత్రమే 
ఆ స్నేహం పద్దతిగా ,హుందా తనంగా ఉంటే మంచిదే 
ఆ స్నేహం చిక్కగా ,చక్కగా బలపడితే ఇంకా మంచిదే 
ఇకపోతే కబుర్లు ,కాకరకాయలు అన్నీ పంచుకున్నాక 
ఏమి చెయ్యాలో తెలియక కొత్త మోజు ,జబ్బు పుడుతుంది 
ఒకరిలో ఒకరు లీనమయ్యిపోవటం 
ఒకరిని ,ఇంకొకరు విడిచియుండ లేకపోవటం 
అలా అలా ప్రత్యెక ఇష్టంగా కులం ,రంగు అంటూ ప్రాంతీయ బేదాలతో 
వాళ్ల వరకు మాత్రమే ఆ స్నేహం తిరుగుతూ ఉంటుంది 
అలా అని కొత్త వారిని మాత్రం ఆహ్వానించకుండా ఉండరు 
వారిని కూడా ఆహ్వానించి ఇది మన సమూహం ,కుటుంభం అంటారు 
వారు వీళ్ళ పద్ధతులకి అలవాటుపడితే బాగానే ఉంటుంది 
వారి ,వీరి అభిప్రాయలు కుదరకపోతే మరలా స్నేహం వికటిస్తుంది 
స్నేహం ఒకరికోసం మాత్రమే పుట్టింది కాదు 
మన స్నేహం మన తోటివాళ్లకు మాత్రమే రాసిచ్చింది కాదు 
స్వార్ధం లేని స్నేహాన్ని అందరికీ పరిచయం చెయ్యండి 
ఏ వివక్ష లేని స్నేహాన్ని స్వేచ్చగా ఎగరనివ్వండి 
ఆ స్నేహానికి ఒక గ్రూప్ అంటూ ,
ఆ స్నేహాన్ని ఒకే భాష వారమంటూ , ఒకే జాతివారమంటూ 
ఆ స్నేహాన్ని ఒకే ప్రాంతానికి చెందిన వారమంటూ 
ఆ స్నేహాన్ని ఒకే కులపు రుచి ఎరిగిన వారమంటూ 
ఆ స్నేహానికి దిశ ,దశ చేసే నాయకత్వం ఉంది అంటూ 
ఒకటే పార్టీ అంటూ ,మన వరకే మనము అంటూ 
తోక్కెయ్యకండి  చిగురించే స్నేహాన్ని 
మార్చెయ్యకండి ''స్నేహానికి '' ఉన్న నిర్వచనాన్ని 
మన స్నేహం పవిత్రమై ,సర్వమత సమ్మతమై ప్రవహించాలి 
మన స్నేహం ప్రశాంతమై , కోవెల లాంటి నిలయం కావాలి 
ఏ కల్మషాన్ని ,కాలుష్యాన్ని స్నేహానికి అంటించనీయకు 
కలుపుగోలుతనంతో ''స్నేహం ''లో ముందుకెళ్ళు 
నీవు అందరికీ దగ్గరవుతూ ,మరొకరిని ఒంటరిగా చెయ్యకు 
స్నేహం మనలో నుంచి పుడుతుంది 
స్నేహం మనల్ని చూసి పుడుతుంది 
కాని ఆ స్నేహాన్ని ,స్నేహ గుణాన్ని మనతో అంతం చెయ్యవద్దు 

                                                       - గరిమెళ్ళ గమనాలు 




Wednesday 21 October 2015

కవిత నెం 193:సమాజపు పోకడ

కవిత నెం : 193


*సమాజపు పోకడ *
నమస్కారానికి ప్రతి నమస్కారం - అది సంస్కారం 
ఆ నమస్కారాన్ని పాటిస్తున్నదెవరు ?
అదే సంస్కారం అని గుర్తిస్తున్నదెవరు ?

హాయ్ అని ,నమస్తే అని , సలాం అని 
తెలుగు భాషని ,సాంప్రదాయాన్ని పక్కన పెట్టి 
పొడి పొడి అక్షరాలను చేర్చి , సాగించుకుంటున్నారు 

నువ్వు ఎదుగుతున్న కొద్దీ ,నీలో మార్పు ఉంటుంది 
మరి నువ్వు నేర్చిన మాటలకెందుకు మౌనముంటుంది 

సిల్లీగా సారీ అంటారే ,క్షమించు అంటానికి శ్రమనా నీకు ?
ఓహ్ థాంక్యూ అంటారే ,ధన్యవాదముకు దండాలు ఎందులకు ?

ప్రతీ పదం ఆంగ్లం , ప్రతీ పద్దతిలో వెస్ట్రన్ 
బుద్దిగా బొట్టు పెట్టుకోవటం మరిచారు 
పద్దతిగా జుట్టు దువ్వుకోవటం విడచారు 
నీటుగా బట్టలు ధరించడాన్ని ఉతికారేశారు 

అడగకుండా సహాయం చెయ్యం అది మన రోగం 
అడిగినా సహాయం చెయ్యలేని అంధకారం 
పొరపాటున సహాయం చేసినా గుర్తించలేని అహంకారం 

మానవత్వం ఉంటుంది కాని మనకు హృదయమే ఉండదు 
పైకి మాత్రం అయ్యో అంటూ , లోలోపలే తిట్టుకుంటాం 

సరిగ్గా నడవటం తెలియదు - నడిపించటం అస్సలే తెలియదు 
నేర్చుకోవటానికి బద్ధకం - నేర్పించటానికి నిశ్శబ్దం 

ఎందాకపోతారు మీరిలా ఒకే రైలు పట్టాలల్లే 
మీ చుట్టూ జరిగేది అంతా - ఎండమావుల నీడలే 

మీరు మనిషైతే - మనిషంటూ మీకు మీరు గుర్తించండి 
మీకు మనసంటూ ఉంటే - మరొకరిని సాటి మనిషిలా చూడండి 

- గరిమెళ్ళ గమనాలు 

Tuesday 20 October 2015

కవిత నెం 192:నువ్వే నాకు - నీవే నాకు

కవిత నెం :192

నువ్వే నాకు - నీవే నాకు 

నేనెక్కడున్నా 
నాతోనే ఉంటూ 
నా పక్కనే ఉంటూ 
నాలో సగమై ఉంటూ 
నేను పాలు అయితే 
తను నీళ్లు లా ఉంటూ 
నేను జీలకర్ర అయితే 
తను బెల్లం లా ఉంటూ 
నేను నీడ అయితే 
తను తోడుగా ఉంటూ 
నాకు స్నేహితురాలిలా 
నా ప్రియురాలిలా 
నా హృదయంలా నన్నంటి ఉంటూ 
అమ్మ తర్వాత అమ్మంత ప్రేమ చూపిస్తూ 
నా బాధ్యతను పంచుకుంటూ 
నా కష్టాలకు ఓదార్పునిస్తూ 
నా ఇష్టమై నాలో ఐక్యమై ఉంటూ 
నా భాదను మరిపిస్తూ 
నాకు సంతోషాన్ని కలిగిస్తూ 
నేను చేసే ప్రతి పనిలో శ్రమయై ఉంటూ 
నేను చూపించే ప్రేమలో ఆ ప్రేమను తిరిగిస్తూ 
నేను ఓడానంటే  'ఓటమి ' కారణం నేనే కావచ్చు 
కాని నా గెలుపులో ఉండేది మాత్రం తానే 
అహంకారం నాకుందో లేదో తెలియదు కాని 
మమకారాన్ని మాత్రం మధురంగా అంటించింది 
నా కోపం ,ప్రకోపమై  ప్రకంపనలు చెందకుండా 
చిరునవ్వుతో చల్లార్చి నాకు సేద తీరుస్తుంది 
నా ప్రేమ నిజమని తెలిసినా ,తన భయము తనకుంటుంది 
ఆ భయము ఆపార్ధంలా మారకుండా ,అనురాగమై కురుస్తుంది 
నీ చిటికిన వేలు పట్టి - నా చేయి అందించాను 
ఈ జన్మాంతము నిన్ను వదులుకోను 
ఏ జన్మకైనా - నువ్వుంటే చాలు 
ప్రతి జన్మలోనూ అమ్మ ప్రేమ ,నీ ప్రేమ నాకుంటే చాలు 

Tuesday 13 October 2015

కవిత నెం191:అల్ప సంతోషి

కవిత నెం :191

*అల్ప సంతోషి  *
ప్రపంచం చాలా పెద్దది 
దానిలో మన ఆలోచనలు అనంతం 
అంతా మనమే అనుకుంటూ ఉంటాం 
కాని మనల్ని బొమ్మగా చేసి ఆడుకుంటారు 
జీవితం అంటే ఇంటే ఒక చదరంగం 
ఆడదాం ఓడిద్దాం అని మొదలెడతాం 
గెలుపు వరకు వెళ్తాం ఓడించబడతాం 
గెలిచినా మన గెలుపులో మరొక హస్తం 
ఆనందిస్తాం సంతోషం వస్తే 
బాదపడతాం విచారమనిపిస్తే 
కాని రెండింటినీ ఒకేలా స్వాగతించం 
స్నేహమనుకుంటాం ...బంధం అనుకుంటాం 
అంతా మనవారే అనుకుంటుంటాం 
మనతోటి కలిసి ,మనవెంటే తిరిగి 
మనమంతా ఒకటే అని నమ్మించబడతాం 
మనం జనంలో కలిసి మనం మనలానే మిగులుతాం 

కవిత నెం 190:పేగుబంధానికి విలువెక్కడ ?

కవిత నెం :190

పేగుబంధానికి విలువెక్కడ ?

అమ్మా నాకు చిన్న నలతగా ఉంటే 

నువ్వు కలత చెంది ,కన్నీళ్లు పెట్టుకునేదానివి 

అమ్మా నేను అడగకుండానే 

నాకు ఆకలివేస్తుందని గ్రహించి నా బొజ్జ నింపేదానివి 

చిన్నప్పుడు ఒక నిముషం నువ్వు కనపడకపోతే 

కిందపడి ,వెక్కి వెక్కి ఏడ్చే వాడిని 

నిన్ను విడిచి దూరంగా ఉండాల్సి వస్తే 

బెంగ పెట్టుకుని ,నీ కోసం ఎదురు చూసేవాడిని 

నాకు భయమనిపిస్తే 

నీ ఒళ్లో తలపెట్టి దాక్కుండేవాడిని 

నాకు నిద్దుర రాకపోతే 

నీ జోల పాట వింటూ హాయిగా నిద్రపోయేవాడిని 

నువ్వంటే ఎంతో ఇష్టం కదా నాకు అప్పుడు 

ఎందుకంటే నాకు నువ్వు తప్ప ఎవ్వరూ తెలియదు కదా 

నువ్వెప్పుడూ నాకెదురుగా కనిపించాలనుకునేవాడిని అప్పుడు 

నీ తోడు లేకుంటే నేనేమౌతానో అన్న భయం కాబోలు 

నాకు చెమట పట్టకుండా చూసుకునేదానివి 

నీ రెక్కల కష్టంతో నాకు లోటు రాకుండా చూసుకున్నావు 

నీ గోరు ముద్దలతో ,నీ చేతి కమ్మదనం తెలియచేసావు అప్పుడు 

నీకు ఇష్టమైన వాటిని తినలేక పోతున్నావు ఇప్పుడు 

నాకోసం నీ కడుపు మాడ్చుకునేదానివి 

నాకు కావాల్సింది మాత్రం వెంటపడి మరీ పుచ్చుకునే వాడిని 

నీ కష్టాన్ని లెక్కచేయకుండా సుకుమారంగా నన్ను పెంచావు 

నీకు కష్టమని ఏనాడైనా నా మనసు ఆలోచించిందా చెప్పు 

నీకు నేనంటే చాలా ఇష్టం కదూ అమ్మా 

దానికోసం ,నాకు కష్టమంటూ తెలియకుండా చేసావు 

నీ ప్రాణం ,నీ ప్రపంచం నేనే కదూ 

మరి ఎందుకమ్మా నా ప్రాణం ,సర్వం అంటూ మరొకరిని ఇచ్చావు 

నాకోసం ఎన్నో అవమానాలు భరించావు 

మరి ఒక్కమాట నువ్వు నన్నంటే  ఎందుకు తట్టుకోలేను 

నేను గొప్పవాడిని కావాలని 

నవ్వు నీ జీవితాన్నే త్యాగం చేసి నాకు వారధిలా నిలచావు 

మరి నా కాళ్ల మీద నేను బ్రతకటం నేర్చాక 

నిన్నెందుకు అమ్మా ప్రేమగా చూసుకోలేకపోతున్నాను 

నేను పెద్దగా చదువులేకపోయినా , జీవితాన్ని చదివించావు 

అందమయినా ప్రపంచం లేకపోయినా ,అవకాశం ఇచ్చావు 

నాకోసం నీకు నువ్వే .... కంటి పాప లా మారావు 

నీ ఓర్పు ,నేర్పులతో ..... నన్నింత వాణ్ణి  చేసావు 

ప్రతీ క్షణం నిన్నే పలకరించేవాడినే 

ఈ కాలంతో ప్రయాణిస్తూ రోజుకోమారు పలకరిస్తున్నాను 

నన్నెంతో భాద్యతగా ,క్రమ శిక్షణ గా పెంచావే 

నిన్ను నా భాద్యత అని ఎందుకు తలంచలేకపోతున్నాను

నీ మాటలు ఒకప్పుడు ముద్దు నాకు 

మరి పదే పదే నువ్వు నాకోసం చెప్తుంటే వినలేకపోతున్నాను ఎందుకు ?

అబద్దం ఆడి ఎరుగను కదా నీ దగ్గర ఒకప్పుడు 

నేను బరువు ,బాధ్యతలు మోసేసరికి నిజాన్ని మాట్లాడలేకపోతున్నా నీ ముందు 

నీ చెంత ఉంటే అదే సంతోషం నాకు అప్పుడు 

నీకు దూరంగా ఎలా ఉండగల్గుతున్నా ఇప్పుడు 

నువ్వంటే ఇష్టమంటూ చెప్పుకోవటం తప్ప 

నిన్ను ఇష్టంగా చూసుకోవటం తెలియదా అమ్మా నాకు  

నీకు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే 

నేనెలా హాయిగా నిదురించగల్గుతున్నాను 

నువ్వంటే నాకెంతో గౌరవం ,ప్రేమ అమ్మా 

నీవు లేకపోతే అవి నాకు దక్కవు అమ్మా 

నీ దీవెన నాకు బలం అమ్మా 

మరి నీవు కోరుకున్నది నేను చేయగల్గుతున్నానా ?

కాలం పరీక్షించవచ్చు అమ్మా 

నన్ను మాత్రం అపార్ధం చేసుకోకమ్మా 

నీ క్షేమమే నాకు సంతోషం 

నీ ఆజ్ఞ యే నాకు శిరోధార్యం 

ఇవి మాటల్లో చెప్పటానికే బాగుంటాయి 

మన నిజ జీవితంలో ఆచరణలో అమ్మ పై ప్రేమ చూపిస్తే ఇంకా బాగుంటాయి 

- గరిమెళ్ళ గమనాలు 




Monday 12 October 2015

కవిత నెం189(ఆదిపత్య పోరు)

కవిత నెం :189

ఆదిపత్య పోరు 

నేనంటే నేను అంటూ 
నేనేలే ముందు అంటూ 
నా పేరే ఉండాలంటూ 
నన్నే అందరూ కీర్తించాలంటూ 
ప్రతి మదిలో దాగుంటుంది గుట్టు 
పైకి  ప్రేమ ,అభిమానం చూపించుకుంటూ 
ఎటువంటి భేషజాలకు చోటులేదంటూ 
''నేనే '' అన్న అహంకారాన్ని పూసుకుంటూ 
''నేనే'' అన్న స్వార్దాన్ని అంటించుకుంటూ 
ఉండలేరుగా ఒకరంటూ ఊరకిట్టూ 
ప్రతీ కులానికి ఉంటుంది ఒక గట్టు 
ప్రతీ ప్రాంతానికి ఉంటుంది ఆనకట్టు 
ప్రతీ మనిషీ వాటితోనే చేస్తుంటాడు కనికట్టు 
ఎందుకో తెలియని ఆకాంక్షను పెంచుకుంటూ 
సమాజంలో పనికిరాని గుర్తింపుని పెంచుకుంటూ 
సభలు ,సమావేశాలు అంటూ ఎన్నో వేషాలు మొదలెట్టు 
రాజకీయంలోనే కాదు జీవితతంత్రాలు తెలిసినట్టు 
ప్రతీ స్నేహంలోనూ చిగురిస్తుంది ''నేను '' అనే చెట్టు 
ప్రతీ రంగంలోని మిగతావారిని అణగదొక్కేట్టు 
మేముసైతం అంటూ ''నేను '' మాత్రానికే చోటు ఉండేట్టు 
ఎందుకీ ''నేను'' అనే ఏకపక్షదోరణి పుట్టేట్టు 
మనిషి ,మరో మనిషినీ మానసికంగా చంపుకు తినేట్టు 
ఇదే ఆదిపత్య పోరు     

- గరిమెళ్ళ గమనాలు 


Wednesday 7 October 2015

కవిత నెం188:గురువారం

కవిత నెం :188

గురువారం 


గురువారం 
గురు బలం ఉన్న వారం 
శ్రీ సాయి కాటాక్షం పొందే వారం 
ఇది లక్ష్మీ వారం 
లక్ష్య సిద్ది కలిగే వారం 
అనుకూలమైన వారం 
ఇది ఆనంద సాయి వారం 
మన గుండె నిండే వారం 
గురు భక్తికే గురువారం 
శ్రేష్టమైన వారం 
ఇది సాయి సన్నిధానం 
మహిమ గల వారం 
మహోన్నతమైన వారం 
అందరికే ప్రియమైన వారం 
నాకెంతో నచ్చే వారం 
అందుకే ఇది గురువారం 


Thursday 1 October 2015

కవిత నెం187:ఎక్కడికి వెళ్తున్నాం మనం

కవిత నెం :187




''ఎక్కడికి వెళ్తున్నాం మనం''

మనం పుట్టక ముందు ప్రకృతి అంటే పులకరించే వాళ్లం  

నేడు మన అవసరాల కోసం కాలుష్య సహవాసం చేస్తున్నాం 
ఒకప్పుడు అన్నం ,ఆవకాయ ముద్దతో ఆకలి విలువ తెలుసుకున్నాం 
ఇప్పుడు ఫీజా ,బర్గర్స్ అంటూ మన శరీరాన్ని చెత్తతో నింపుతున్నాం 
నిజాయితీ ,నిబద్దత అంటూ ఆ చదువులోనే నేర్చుకున్నాం 
మనం బ్రతకటానికి ఏ  బీతి లేకుండా తప్పు దోవలో పోతున్నాం 

మన తల్లిదండ్రుల ప్రేమలో ఎంతో ఎదుగుతూ వస్తున్నాం 

మనవారిని మరచి ,మన దేశం విడచి ఆనాధలుగా ఉంటున్నాం 
బడిలో చదివన వారమే ,పద్దతిగా సంస్కారం నేర్చుకున్నాం 
నేడు కాన్మెంటులంటూ ,ఇంగ్లీష్ బ్యాగ్ లతో సంసృతిని మారుస్తున్నాం 
అందరం కలిసి ఉండటమే ఐకమత్యం అని తలచేవారం 
ఏ మతమంటూ ,కులమంటూ బేధాలు లేకుండా పెరిగిన వాళ్లం  
పక్కవారితో  కూడా మనస్పూర్తిగా మాట్లాడలేక దాక్కుంటున్నాం 

కులమంటూ ,కుళ్లుకుంటూ కుమ్ములాటకు పోతున్నాం 

కల్మషం లేని హృదయంతో పవిత్రంగా స్వాగతించుకునేవాళ్లం 
చిన్న పెద్దా అంటూ గౌరవం మరచి ,దుర్భాషలాడుతున్నాం 
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేగా చదువుకున్నాం 
మరి మనం  ఎదుగుతున్నకొద్దీ ,మిగతా వారని హేళన చేస్తున్నాం 
భారతీయులంటే సోదరి ,సోదరా భావంతోనే కదా అభిమానించాం 
రాగింగ్ అంటూ ,నీచ సంస్కృతి తో వెర్రితనంతో బ్రతుకున్నాం 

రైతు దేశానికి వెన్నెముక అంటూ గర్వంగా చెప్పుకుంటున్నాం 

రియల్ ఎస్టేట్స్ అంటూ మన పంట భూములని మనమే చంపుతున్నాం 
సాఫ్ట్ వేర్స్ ,డాక్టర్స్ ,ఇంజనీర్స్ అంటూ భారానికి మించిన  చదువులు 
వాటికోసం ,భారానికి మించిన అప్పులతో ఈడ్చుతున్న బ్రతుకులు 
ఎవరి పంట వాళ్లు  తినే రోజులలో హాయిగా నిదురపోయేవాళ్ళం 
రాజీకీయ రాబందుల రాజ్యంతో నేడు ఆత్మహత్యలో నిదురపోతున్నాం 

మన దేశ స్వాతంత్రం ,స్వేచ్చ కోసం పోరాటాలు చూసియున్నాం 

మరి ఆ స్వేచ్చ సొంతమవ్వగా ,మన ఓటుతో  తాకట్టు ఎందుకు పెడుతున్నాం? 
అన్ని రంగాల వారికి ,ఆన్ని ప్రాంతాల వారికి వారధి భారతదేశం 
ఎన్ని ఉన్నా ,ఎంత సంపద ఉన్నా కాలేదా  పేదరిక నిర్మూలన దేశం ?
అందరం కలిసి చేసుకునే పండగలు ఎన్నో ఉన్న మన హిందూ సంప్రదాయంలో 
పార్టీలు ,పబ్ లూ  అంటూ వాటి వెంట అనవసర పరుగు లెందులకు ?

ఎంతో మంది ప్రతివ్రతలు పుట్టిన చరిత్ర కల మన భారతదేశం లో 

ఆడవారిని భానిసగా చేస్తూ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే వ్యభిచారగ్రుహాలెందులకు ?
పంచె  ,చీర విడచి విదేశీ వస్త్రాలంటూ ,వేలాడే దుస్తులకై మోజెందుకు ?
ప్రపంచ నలు మూలల ,మన దేశ సంసృతి ని ఖ్యాతిగా చెప్పుకుంటుంటే 
మనం మాత్రం మోడరన్ అంటూ ,మన ఆచారలని మార్చేస్తున్నాం 

ఎంతో అభివృద్ధి పదంలో మన దేశం ముందు కెల్తుంటే 

లేనివాడు ,ఉన్న వాడు ఇద్దరూ సమానంగా ఎదగలేక పోతున్నారెందుకు ?
మనం మారుతున్నాం ,మన దేశ సంస్కృతిని మారుస్తున్నాం 
కాని మన దేశం గర్వపడేలా ఎప్పుడు మనం మారటం 
మనలో మార్పు కోసం మరో సంఘ సంస్కర్త రాడు 
మనలో చైతన్యం కోసం మరో విప్లవం కూడా పుట్టుకు రాదు 
ఎదురుచూపులు మాని మన కర్తవ్యం మన చేద్దాం 
ఎప్పటికీ మనం భారతీయుడులానే జీవిద్దాం 

- గరిమెళ్ళ గమనాలు 






Wednesday 16 September 2015

కవిత నెం 186:వినాయకుడు - గణ నాయకుడు

కవిత నెం :186
వినాయకుడు - గణ నాయకుడు
సమస్త పూజలను ముందు అందుకునేవాడు
సప్త సముద్రాలు దాటి వస్తున్నాడు
దేవుళ్ళందరిలో ప్రధమ ఆరాధ్యడు 
ముల్లోకాలను చుట్టుకుంటూ వస్తున్నాడు
నాయకుడు అధినాయకుడు వినాయకుడు
దండాలు పెట్టించుకుంటూ
జై జై లు కొట్టించుకుంటూ
మూషికవాహనం పై వేగంగా వస్తున్నాడు
ప్రతి చవితి నాడు పలకరిస్తుంతాడు
సంవత్సరానికి ఒక్కసారి వస్తుంటాడు
సకల ఐశ్వర్యాలాను వెంటతీసుకుని వస్తాడు
కుడుములు ,వడపప్పు ,కర్జూర ,పాయసం ,పాలతాలికలు
ఎన్నోన్నో పూలతో ,ఎన్నోన్నో పత్రిలతో అలంకరణప్రియుడు
చల్లంగా చూసేడు ఈ బొజ్జ గణపయ్య
ప్రతి వారింట కొలువు తీరేనయ్యా
నీ నామస్మరణం - పాప నివారణం
నీ కధ శ్రవణం - ఎంతో పుణ్యఫలం
నువ్వంటే భక్తికో కొలిచిన వారిని
నువ్వంటే ప్రేమతో పిలచిన వారిని
వెన్నుంటి వారిని సంరక్షించేవయ్యా
ఎన్నో కుటుంబాలు నీ పేరు చెప్పి
జీవనోపాదినే పొందేను స్వామీ
నువ్వంటే ఇష్టంతో భక్తిలో పోటీ పడి
తండోప తండాలుగా నీ విగ్రహాలను నిలపి
వీధి వీధిలో ,వాడ వాడ లో పూజలను చేసేరు
శ్రేష్టమైన నీ సేవకోసం ,తపన పడే ప్రతి హృదయం
అందర్నీ మరువక ,ఎవర్నీ విడువక
నీ కరుణ కటాక్షంతో కృప చూడుమయ్యా
జై బోలో గణేశా ,జై బోలో విఘ్నేశా జై జై జై సర్వేషా పాహిమాం

Monday 7 September 2015

కవిత నెం185:చెలియా నీవే

కవిత నెం :185
చెలియా నీవే

న కన్నుల్లో నీవే
న గుండెల్లో నీవే
నాతో వచ్చే నీడలో కూడా నేవే
ఎటు చూసిన నీవే
ఎవ్వరిలో వున్నా ఎదురుగ వచ్చేది నీవే
నా ప్రతి మాటలో నీవే
నిద్రపోతున్న ఆ నిదురలో నీవే
నిదూరలోనుంచి పుట్టే ఆలోచన నీవే
కనుపాపల్లో నీవే
కంటిలో తిరిగే నీళ్ళల్లో నీవే
నే చేసే పనిలో నీవే
నా ప్రతి ఆలోచన నీవే
నా మనసులోని  సంబాషణ నీవే
ఎ జంటను చుసిన గుర్తుకువచ్చేది నీవే
నా గుండెల్లో ఆనందం నీవే ,విషాదం నేవే
నన్ను నేనుగా చూసుకుంటున్న కనిపించేది నీవే
తింటున్న తాగుతున్న ఆ తలంపులో నేవే
ఆకలి ,దాహం లేకున్నా నన్ను జాగ్రత్తగా చూసుకునే తోడూ నీవే
నువ్వు లేని ఒంటరితనములో నాతొ వుండిపోయేది నీవే
నా ప్రతి జ్ఞాపకం లోనూ నీవే
నాలో వున్నది నీవే
నీవు నాటో లేని క్షణం విషంలా వున్నా నేకోసం వేచివుంట ఎప్పటివరకిన
నీవే నీవే అంటూ అనుకుంటూ సాగిపోత ఏక ఎదురయ్యే కాలమున

!!!!!!!!!!


కవిత నెం 184:నువ్వంటే ఇష్టం

కవిత నెం :184

*నువ్వంటే ఇష్టం * స్వచ్చమైన నీ చిరునవ్వంటే  నా కిష్టం 
వెన్నెలమ్మ హాయిని చూపే నీ చూపంటే నా కిష్టం

లోకం మరచి,నీతో ఉండి ,మాట్లాడటమంటే నా కిష్టం
నీ వైపు చూస్తూ , వినాలన్పించే - నీ పలుకులు అంటే నా కిష్టం

నిన్నే తాకి, నన్నే సోకిన చిరుగాలి అంటే నా కిష్టం
నీ రూపం చూపుతూ ,వచ్చే ప్రతి కల అంటే నా కిష్టం.

నీ వాలుజడలో కొప్పున వుండే సంపెంగ అంటే నా కిష్టం.
నీ కాలికింద మువ్వలు చేసే ,సవ్వడులు అంటే నా కిష్టం.

నీకై  వేచి నిరీక్షించిన ,సమయమంటే నా కిష్టం.
నీకోసం నే తలచే ,ఆ తలంపులు అంటే నా కిష్టం.

నన్నే తిడుతూ కదిపే , ఆ పెదవులు అంటే నా కిష్టం
అందమైన గోరింటాకు కల్గిన ,నీ అరచేయ్యంటే నా కిష్టం

నన్నే మరపించే , నీ జ్ఞాపకాలు అంటే నా కిష్టం.
నీ ఒడిలోన ఒదిగినప్పుడు , ఆ కమ్మని హాయి నా కిష్టం

నీ కోసం నే రాసే , చిరు కవిత అంటే నా కిష్టం.
నీతో కలిసి నడచిన , ఆ మదురక్షణములు  అంటే నా కిష్టం

నీ కోసం నే వదిలే , నా శ్వాసంటే  నా కిష్టం
నీ కోసం నే మలచుకున్న , నా ఆశయమంటే  నా కిష్టం.

!!!!!!!
గరిమెళ్ళ రాజా

కవిత నెం 183:ఆశ

కవిత నెం :183

నీతో నడవాలనే ఆశ
నీతోపాటు ఉండిపోవాలనే ఆశ
నీ నవ్వు చూడాలనే ఆశ
నిన్ను నవ్వించాలనే ఆశ
నీతో ఎకాంతంగా గడపాలనే ఆశ
నీ చెంతనే ఉండి సేద తీరాలనే ఆశ
నీ కోసం నేను మారాలనే ఆశ
నా కోసం నీవు మారాలనే ఆశ
నీ కళ్ళల్లో చూస్తూ నిల్చిపోవాలనే ఆశ
నీ ఒడిలో ఒదిగి ఉండాలనే ఆశ
నువ్వెప్పుడూ నన్నే తలవాలనే ఆశ
నీ పెదవులపై నా పేరు ఉండాలనే ఆశ
నీ కోసం వేదన చెందాలనే ఆశ
ఆ వేదన నే కౌగిలితో మాయమవ్వాలనే ఆశ
నీతో నిరంతరం మాట్లాడుతూ ఉండాలనే ఆశ
నీ ద్యాసలో నన్ను నేను మర్చిపోవాలనే ఆశ
నా కలవరం - నీవే అవ్వాలనే ఆశ
నీ  ఊహల్లో - నా  ఉనికే కదలాలనే ఆశ
నా కోసం నీ ఆలోచన సాగుతూ ఉండాలనే ఆశ
నా కోసం నే ఎదురుచూపులు చూడాలనే ఆశ
నీ జ్ఞాపకాలు - నిన్నే గుర్తుచేస్తూ ఉండాలనే ఆశ
నా లాగే నీవు కూడా నా కోసం తపన పడాలనే ఆశ
నువ్వెక్కడున్నా, నేనెక్కడున్నా
మన మనసు ఊసులు సాగాలనే ఆశ
క్షణమైనా , అర క్షణమైనా
నీ బావన - నా చుట్టూ తిరుగుతూ ఉండాలనే ఆశ
నీ కోసం  -బ్రతకాలనే ఆశ
నీతోనే నా గమ్యం సాగాలనే ఆశ
నా ప్రయాణంలో నీ తోడూ నాతో ఉండాలనే ఆశ
నీతోనే నా బంధం బలపడాలనే ఆశ
మరో జన్మలో కూడా నువ్వే నా ప్రేయసి కావాలనే ఆశ
నీకోసమే నిల్చిపోవాలి కలకలం నా శ్వాస

!!!!!!!!!

కవిత నెం182:ఓ ప్రియతమా !

కవిత నెం :182

ఓ ప్రియతమా !
కలలో చూసిన సౌందర్యరూపం 
అది నే మేను యొక్క అందం.
చంద్రబింబం లాంటి నీ సోయగం
నా మదిలో రేపెను కలవరం
ప్రియా ! నీ పరిచయం ఒక వరం
అది ఈ జన్మకు మరువలేని తీయని జ్ఞాపకం.
ప్రియా కనులు మూసినా నీవాయే 
కనులు తెరిచినా నీవాయే
ప్రియతమా తొలిసారి నిన్ను చూడగానే నా మనస్సు
నాకు తెలియకుండా నీకు చేరువ అయ్యింది అది నీకు తెలుసు.
మందు వేసవిలో ఆ చంద్రుని చల్లదనం పువ్వులకోసం
నీ కంటి చూపు చల్లదనం నా కోసం, నా ప్రేమ కోసం
ప్రియా నీవు లేని జీవితం వ్యర్ధం 
ప్రియా నీ ప్రేమే నా జేవితనికి ఒక అర్ధం , అదే నాకు పరమార్ధం
చెరుగని నీ చిరునవ్వు
ముద్దుగా విరిసియున్న మందారపువ్వు
చేక్కిలిగిలి పుట్టించే నీ అదరాలు
నా ప్రేమ ఉషోదయానికి అవి కారణాలు
నా ఈ ప్రేమ సముద్రంలోని అలజడికి కారణం నీ పరిచయం
ప్రియా ఈ జన్మ నీ కోసం
ఎదురుచూస్తూ వుంటా నీ ప్రేమకోరకు మరో జన్మ కోసం

!!!!!!!
గరిమెళ్ళ రాజా

కవిత నెం 181:ఒంటరితనం

కవిత నెం :181

ఒంటరితనం మన ఊసుల్ని  గుర్తుచేస్తుంది
ఒంటరితనం మన మనసు బాసల్ని గుర్తుచేస్తుంది
ఒంటరితనం నీతో ఉన్న మదుర క్షణాలని గుర్తుచేస్తుంది
ఒంటరితనం నీతో ఉన్న ఏకాంత సమయం విలువని గుర్తుచేస్తుంది
ఒంటరితనం నీ మాటలని గుర్తుచేస్తుంది
ఒంటరితనం మన గుసగుసల్ని గుర్తుచేస్తుంది
ఒంటరితనం మన గిల్లికజ్జాలని గుర్తుచేస్తుంది
ఒంటరితనం మన సరదాలని గుర్తుచేస్తుంది
ఒంటరితనం మన తీయటి జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది
ఒంటరితనం మన మదుర బావాలను గుర్తుచేస్తుంది
ఒంటరితనం మన ఎడబాటుని గుర్తుచేస్తుంది
ఒంటరితనం నీకై ఆలోచింపచేస్తుంది
ఒంటరితనం నీ గురించే కలవరింప చేస్తుంది
ఒంటరితనం నీ ద్యాసలో గడిపేల చేస్తుంది
ఒంటరితనం నీ కోసం నన్ను నేను మర్చిపోయేలా చేస్తుంది
ఒంటరితనం నీ రూపాన్ని నిలువెత్తునా చూపుతూ వుంటుంది
ఒంటరితనం నాలో కొత్త ఆశలేవో రేపుతుంది
ఒంటరితనం నా మదిని జోలపాడుతుంది
ఒంటరితనం చిరుసవ్వడిని చిగురింపచేస్తుంది
ఒంటరితనం నన్ను మబ్బులలో ,హరివిల్లులో పయనింప చేస్తుంది
ఒంటరితనం నీ తోడుని నాకు చేరువ చేస్తుంది
ఒంటరితనం నీ నీడ నా  వెంట నడిచేలా చేస్తుంది
ఒంటరితనం నీవు నాతో ఉంటావనే  దైర్యాన్ని పెంచుతుంది
ఒంటరితనం నీవు నా దానివే అనే నమ్మకాన్నిస్తుంది
ఒంటరితనం నేను నేకోసమే ఉన్నా అనే సందేశాన్నిస్తుంది 
ఒంటరితనం నీకై పిచ్చివాడిని చేస్తుంది
ఒంటరితనం నన్ను పిరికివాడిని చేస్తుంది
ఒంటరితనం నన్ను నిలువునా దహిస్తూ వుంటుంది
ఒంటరితనం నన్ను నేను నిగ్రహించుకునేల చేస్తుంది
ఒంటరితనం నీకై నడిచేలా చేస్తుంది
ఒంటరితనం నీకోసం బ్రతికేలా చేస్తుంది
ఒంటరితనం అంటే భయమూ వేస్తుంది 
ఒంటరితనం అంటే నాకెంతో నచ్చుతూ ఉంటుంది
ఎందుకంటే ఈ ఒంటరితనం నీపై ప్రేమను పెంచుతుంది
నీ విలువను తెలియచేస్తుంది

!!!!!
గరిమెళ్ళ రాజా

కవిత నెం180:నీవే కదా

కవిత నెం :180

నా చుట్టూ ఉన్నది నీవే కదా
నా మనసులో ఉన్నది నీవే కదా
నా రూపం నీవే కదా
ప్రతి రూపం నీవే కదా
నా శ్వాశలో ఊపిరి నీవే కదా
నా నీడలో నిజమూ నీవే కదా
నాకు సాక్ష్యం నీవే కదా
ప్రతి పక్షం నీవే కదా

కథలాంటి కధ  కాదు
కన్నీళ్లకి  అది చేదు
మిగిలున్నా నీ తోడు
ఓ మరుమల్లె ఇటు చూడు

నిలువని  నిముషంలో ,సగమై నిలిచున్నా
కదిలే కాలంలో, కలమై సాగుతున్నా
మేఘాలలో మాయవు నీవా?
మెరిసే ముత్యపు పువ్వా
జాజికళ్ల  జామురాతిరి 
జగడమాడే నిన్ను చూడనీ
గాలికి చిక్కని గంధమా
పరిమళాలకు బంధమా

!!!!!!!
గరిమెళ్ళ రాజా




కవిత నెం179:నీ జ్ఞాపకాలే

కవిత నెం :179

నీ జ్ఞాపకాలే నన్నిలా
దాచాయిలే గుట్టుగా
నమ్మానులే మత్తుగా

విరజాజి పువ్వువు నువ్వా?
వికసించే కుసుమం నువ్వా?
నా చక్కిలి గింతవు నువ్వా ఓ వెన్నెలా?

నీవే నా తరగని కల
నిదురించే నేనీ వేళ
నీ చంటి పాపాయిలా 
లాలించాలి నన్నిలా ఓ వెన్నెలా !

దివికి దిగి వచ్చిన తారవు నీవా?
నీలగిరి సొగసువు నీవా?
హిమాచల బిందువు నీవా?

నీవున్న ప్రతి ఇల
అవుతుంది ఒక కోవెల
కిలకిల రాగాల కోకిల
పిలుస్తోంది నిన్నీ వేళ

సముద్రంలోని అల
నీకై పరుగులు ఏల?
ఒక్కసారి అందరాదా ఓ వెన్నెలా ?
నా నిరీక్షణ ఫలించాల
నిన్ను చూసిన ఈ క్షణాన
ఓదార్పుగా నీ ఒడిలోన
ఒక యుగాన్నే దాటి యున్నా నా వెన్నెలా !

!!!!!!
గరిమెళ్ళ రాజా

కవిత నెం178:హాయ్ - హలో

కవిత నెం :178

హాయ్ ; హలో 

సముద్రమంతా ఎంత సరదాగా విహరిస్తుందో 
ఆకాశమంతా  ఎంత నిర్మలంగా వికసిస్తుందో 
అలాగే నా మనసు నీతో సరదాగా తిరగాలని 
మాట్లాడాలని సరదాపడుతుంది సముద్రం లాగా
నీ ఒడిలో నా తలపెట్టి నిద్రిస్తుంటే 
నీ నిర్మలమైన హృదయంలో అన్ని బాధలు మర్చిపోయి 
నీ ఒడిలో ఒదిగిపోవాలని వుంది - మేఘాలలోని చంద్రుడిలా 
కానీ నీవేమో వాగులాగా కొండలోతుల్లోనుంచి 
కొండల మీద నుంచి జారిపోతున్నావు.
నీవేమో చేపవి కాదు - జాలరిలాగా వలవేయటానికి 
నీవు ఒక పక్షివి కాదు - పంజరంలో బంధించటానికి 
పట్టుకుంటే పాములాగా పారిపోతున్నావు.
ముట్టుకుంటే మెరుపులా మాయమవుతున్నావు.
నీ స్వేచ్చ నీది, నీ ఆనందం నీది,
నీ ఉల్లాసం - ఉత్సాహం నీవి.
వాటితో నేను కూడా  చెయ్యి కలపాలనుకుంటే 
ఎందుకు నువ్వు కాదంటు వున్నావో తెలియటంలేదు.
నన్ను కాలరాసి కొండలలో ఎగురుతున్నావు.
కానీ ఒకటి గుర్తుంచుకో 
నువ్వేగిరి కొండలు ఎవరో కాదు
అవి నేనే ప్రియా!

!!!!!!!
గరిమెళ్ళ రాజా

కవిత నెం177:శశి కళ

కవిత నెం :177

నిద్రపోదామన్నా నీ నీడ నన్నే వెంటాడుతుంది.
నిదురిస్తే నీ రూపం తట్టి లేపుతుంది.
మేల్కొని వుంటే నీ తలంపు మైమరపిస్తుంది.
మైకంలో వున్నా మనిషి ఎలా ఉంటాడో 
అల నీ మైకంలో పది మత్తులో మునిగి తేలుతున్నా
మొహమాటంతో ఈ మాట నీతో చెప్పలేకున్నా చెలీ !
నే పడుకుంటే పక్కమీద - పరుపు లాంటి పాన్పు నీవే
నా తలకింద దున్డులాంటి - వెచ్చని ఒడి నీదే
నీ కప్పుకునే దుప్పటి లాంటి - పరువం నీదే 
పగలూ - రేయీ  తేడా లేదు
కలలు అలలై సముద్రాన్ని దాటివేస్తున్నాయి.
నీ సోయగాలు అనే కిరణాలలో 
ఇది కల - లేక జాలరి పన్నిన వలా?
విలవిలా చిక్కాను చేపలాగ
నీ శిల్ప సౌందర్యంలో - ఓ శశి కళ

!!!!!!!!!
గరిమెళ్ళ రాజా

కవిత నెం 176:నీ కోసం

కవిత నెం :176

నీకోసమే ఉన్నా
నీకోసమీ జన్మా
నీ కోసమై అన్వేషణ

నీ కోసమై ఆలోచన
నీ కోసమై నా తపన
నీ కోసమై నిరీక్షణ

నా కన్నుల్లో తడి ఆరదు నీ కోసం
నా గుండెల్లో దడ తగ్గదు నీ కోసం
నా శ్వాసలో ఊపిరి నిలిచే నీ కోసం
నా అడుగుల పయనం  సాగెను నీ కోసం

నా మనసులో మౌనం పెరిగెను నీ కోసం
నా గొంతులో రాగం పలికెను నీ కోసం
నా జీవిత గమ్యం నీ కోసం
నా జననం మరణం నీ కోసం

నా క్షణ క్షణ కాలములో అక్షరం నీవు.
నీ నామ జపముతోనే ,నా రాతను రాస్తున్నాను
విది తీరు ఎలాగున్నా , నా వేదన ఆగదు ప్రియా
నీ తోడు కోసం , ఎదురుచూస్తుంటా నా జన్మంతా

గరిమెళ్ళ రాజా

కవిత నెం 175:తెలుసా ?

కవిత నెం :175
తెలుసా ?
(27 .07 .11)

మౌనంగా ఎగిరే ఆ పక్షుల బాష తెలుసా !
ఒక దిక్కుకై నిలిచే ఆ పువ్వుల శ్వాస తెలుసా!
నేనంటూ నడిచే - నా పయనం ఎటో తెలుసా !
నువ్వేనంటూ తలిచే - నా ఊపిరి సాగెను తెలుసా !

నువ్వే చెంతన ఉంటె - ఆ పొంతన తెలియదు తెలుసా !
నువ్వే విరహము అయితే - ఆ వేదన బరువు తెలుసా !
నీ కన్నా మించే ఆనందం లేదని తెలుసా!
నీ చిన్న చూపుతో అది పోతుందని తెలుసా!

నీతోటి ఉండగా - నా తుంటరి పనులు తెలుసా!
నీ ద్యాసలో ఉంటూనే - నా ఒంటరి బ్రతుకు తెలుసా!
"నువ్వే నా ప్రాణం" అనే అనుకున్న మాటలు తెలుసా!
నీతో రాలేని ఈ జీవం ఏమవుతుందో తెలుసా!

చేయి చేయి కలిపినా - మన సంగతులన్నీ తెలుసా!
మరో చెయ్యిని తాకి - నాకు సంకెళ్ళు వేసావు తెలుసా!
నా పిలుపు కోసం నువ్వు ఏంటో పిచ్చిగా చేసావు తెలుసా!
నీ పిలుపుల కోసం - నే పడే తాపత్రయము తెలుసా!

నా మాట వినకుండా నీకు రోజూ గడవదని చెప్పేదానివి తెలుసా!
మన కబుర్లు లేని కాలంలో - వుంటున్నామో తెలుసా!
"నిన్ను చూడాలనిపిస్తుంది రా " అంటూ రోజూ అడిగేదానివి తెలుసా!
ప్రతీ క్షణం అక్షరంలా నా ''మేఘ సందేశం'' తెలుసా!

నీవు నిదురించే వేళలో - నాకెన్ని రాత్రులున్నాయో తెలుసా!
నీకు మొదలైన ప్రశాంతత - నాకు దూరం అవుతుందని తెలుసా!

!!!!!!!
గరిమెళ్ళ రాజా