Monday 12 October 2015

కవిత నెం189(ఆదిపత్య పోరు)

కవిత నెం :189

ఆదిపత్య పోరు 

నేనంటే నేను అంటూ 
నేనేలే ముందు అంటూ 
నా పేరే ఉండాలంటూ 
నన్నే అందరూ కీర్తించాలంటూ 
ప్రతి మదిలో దాగుంటుంది గుట్టు 
పైకి  ప్రేమ ,అభిమానం చూపించుకుంటూ 
ఎటువంటి భేషజాలకు చోటులేదంటూ 
''నేనే '' అన్న అహంకారాన్ని పూసుకుంటూ 
''నేనే'' అన్న స్వార్దాన్ని అంటించుకుంటూ 
ఉండలేరుగా ఒకరంటూ ఊరకిట్టూ 
ప్రతీ కులానికి ఉంటుంది ఒక గట్టు 
ప్రతీ ప్రాంతానికి ఉంటుంది ఆనకట్టు 
ప్రతీ మనిషీ వాటితోనే చేస్తుంటాడు కనికట్టు 
ఎందుకో తెలియని ఆకాంక్షను పెంచుకుంటూ 
సమాజంలో పనికిరాని గుర్తింపుని పెంచుకుంటూ 
సభలు ,సమావేశాలు అంటూ ఎన్నో వేషాలు మొదలెట్టు 
రాజకీయంలోనే కాదు జీవితతంత్రాలు తెలిసినట్టు 
ప్రతీ స్నేహంలోనూ చిగురిస్తుంది ''నేను '' అనే చెట్టు 
ప్రతీ రంగంలోని మిగతావారిని అణగదొక్కేట్టు 
మేముసైతం అంటూ ''నేను '' మాత్రానికే చోటు ఉండేట్టు 
ఎందుకీ ''నేను'' అనే ఏకపక్షదోరణి పుట్టేట్టు 
మనిషి ,మరో మనిషినీ మానసికంగా చంపుకు తినేట్టు 
ఇదే ఆదిపత్య పోరు     

- గరిమెళ్ళ గమనాలు 


0 comments:

Post a Comment