Wednesday 26 February 2014

కవిత నెం 13:గులాభి

కవిత నెం :13
__________________________________________
అందమైన పుష్పం ఈ ''గులాభి''
అందరి హృదయాలను హత్తుకునే పుష్పం ఈ ''గులాభి''
 తన పరిమళ అందాలతో మనల్ని మరిపింపచేస్తుంది ఈ ''గులాభి''
నిర్మలమైన ప్రేమకు సంకేతం ఈ ''గులాభి''
మదిలోని భావాల ఊసులకు వారధి ఈ ''గులాభి''
తన మౌనంతో మనల్ని మాట్లాడింపచేస్తుంది ఈ ''గులాభి''
తన విప్పారిన పూరేకులతో మనకు దగ్గరవుతూ 
వాడిపోయి ,ముళ్ళ గాయం మనకు చేసి విడిపోతుంది 
ప్రపంచంలో ప్రేమపుష్పం గా పిలువబడే పుష్పం ఈ ''గులాభి''
ప్రెమాక్షరాలకన్నా  ముందు ప్రేమమకరందాలను చిందించే పుష్పం ఈ''గులాభి''


కవిత నెం12:ఎడబాటు

కవిత నెం : 12
*ఎడబాటు *
నన్నొదిలి నీవు వెళ్ళావో
నిన్ను వదిలి నేను ఉంటున్నానో తెలియదు కాని
నీకు నాకు మధ్య నిలచిన ఈ దూరం మాత్రం
నీవు వదిలిన అడుగు గుర్తులని చూపుతూ
నీ జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఉంది
నీ మీద నే పెంచుకున్న ఆశల కెరటాలని
ఆకాశం వైపుగా పయనించేలా చేస్తుంది
సుదూర తీరాలను తాకవచ్చేమో గాని
నీ హృదయానికి నేనెలా దగ్గర కాగలను
నా గుండె గాయమవుతున్నదే
నీ జ్ఞాపకాల పరిమళాలను పీల్చుకుంటూ
ఈ దూరానికి తీరం లేదా విరహం తప్ప
నా గాయానికి మందు లేదా గమనం తప్ప
ఒక్క అడుగుతో వేలమైళ్ళు ప్రయాణం చేయవచ్చంటారే
అలాగే , ఒక్క అడుగుతో నిన్ను చేరే మార్గం చూపవా చెలీ !


Friday 21 February 2014

కవిత నెం 10:తెలుగు భాష


కవిత నెం : 10
* తెలుగు భాష *