Wednesday 10 December 2014

కవిత నెం75(తెలుగమ్మాయి)


కవిత నెం :75
తెలుగమ్మాయి
********************************** 

కాటుక సొగసుల మాటున కలువల్లాంటి కళ్ళు 
దోరతనం  పూసుకున్న దొండపండు లాంటి పెదాలు 
చక్కిలి గింతలు పెట్టే చేమంతుల్లాంటి చెక్కిళ్ళు 
చంద్రబింబాన్ని పోలినది ఆమె అరవిందం 
నుదుట మద్యన జ్యోతిలా ప్రకాశించే సింధూరము 
ఊగుతూ మనసు లాగుతూ ఉండే వయ్యారి వాలుజడ 
కొప్పులో దాగి పరిమళాలతో దోబూచులాడే మల్లెలు 
వాలుజడకు మరింత అందాన్ని పెంచే పట్టు పావడాలు 
చెవులకు వేలాడుతూ గుసగుసలాడే జూకాలు 
విరిసిన కుసుమం లాంటి చిరు దరహాసము 
గలగల  పారే గోదారిలా  మట్టిగాజుల సవ్వడులు 
గోరింటాకుతో పండిన వెన్నెల వనాలు అరచేతులు 
హొయలను  కురిపించే వయ్యారి హంస నడకలు  
అద్బుత సోయగాలను చూపించే తన కాలి అందెలు 
లంగా ఓణీ  వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి 
మేటి సౌందర్యాన్ని చూపే పదహారణాల అమ్మాయి 
మంచి కట్టూ బొట్టూ సాంప్రదాయం ఉన్న అమ్మాయి 
తెలుగు భాష లాంటి మధురమైనది తెలుగమ్మాయి 
బాపుబొమ్మలా చక్కనైనది మన తెలుగమ్మాయి 
మన కళ్ళ ముందు నడయాడే లక్ష్మీదేవి తెలుగమ్మాయి 











0 comments:

Post a Comment