Wednesday, 26 February 2014

కవిత నెం12:ఎడబాటు

కవిత నెం : 12
*ఎడబాటు *
నన్నొదిలి నీవు వెళ్ళావో
నిన్ను వదిలి నేను ఉంటున్నానో తెలియదు కాని
నీకు నాకు మధ్య నిలచిన ఈ దూరం మాత్రం
నీవు వదిలిన అడుగు గుర్తులని చూపుతూ
నీ జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఉంది
నీ మీద నే పెంచుకున్న ఆశల కెరటాలని
ఆకాశం వైపుగా పయనించేలా చేస్తుంది
సుదూర తీరాలను తాకవచ్చేమో గాని
నీ హృదయానికి నేనెలా దగ్గర కాగలను
నా గుండె గాయమవుతున్నదే
నీ జ్ఞాపకాల పరిమళాలను పీల్చుకుంటూ
ఈ దూరానికి తీరం లేదా విరహం తప్ప
నా గాయానికి మందు లేదా గమనం తప్ప
ఒక్క అడుగుతో వేలమైళ్ళు ప్రయాణం చేయవచ్చంటారే
అలాగే , ఒక్క అడుగుతో నిన్ను చేరే మార్గం చూపవా చెలీ !


Related Posts:

  • కవిత నెం12:ఎడబాటు కవిత నెం : 12 *ఎడబాటు * నన్నొదిలి నీవు వెళ్ళావో నిన్ను వదిలి నేను ఉంటున్నానో తెలియదు కాని నీకు నాకు మధ్య నిలచిన ఈ దూరం మాత్రం నీవు వదిలిన అడుగు గుర్త… Read More
  • కవిత నెం15 :ప్రేమ నౌక కవిత నెం :15 *ప్రేమ నౌక * ఎర్రని మబ్బుల సైతం  నా ఎదని కమ్మేస్తున్నాయి  నీ కోసం అన్వేషణ చేస్తున్న నన్ను  అడుగడుగుకి ఆపదలు అడ్డుకొంటు… Read More
  • కవిత నెం 13:గులాభి కవిత నెం :13 __________________________________________ అందమైన పుష్పం ఈ ''గులాభి'' అందరి హృదయాలను హత్తుకునే పుష్పం ఈ ''గులాభి''  తన పరిమళ అందాలత… Read More
  • కవిత నెం 10:తెలుగు భాష కవిత నెం : 10 * తెలుగు భాష * … Read More
  • కవిత నెం 14:మదర్ థెరిస్సా కవిత నెం  : 14 అమ్మతనంలో అనురాగరూపం '' మదర్ థెరిస్సా'' అనాధలకు మరో మాతృరూపం ''మదర్ థెరిస్సా'' విశ్వశాంతికై వెలసిన అనురాగ  విశ్వం … Read More

0 comments:

Post a Comment