Friday 26 August 2016

కవిత నెం 225: ఓ అభిమాని ఆలోచించు

కవిత నెం : 225

శీర్షిక పేరు : ఓ అభిమాని ఆలోచించు 

నువ్వు పుట్టింది నీకోసం 
నీ జీవితం నీ కోసం , నీ కుటుంబం కోసం 
నువ్వు పుట్టాకే తెలిసిద్ధి కదా !
నీ హీరో ఎవరో ? నీ అభిమానం  ఏమిటో ?
నువ్వు అభిమానించావని ఏ హీరో దిగొస్తాడు 
నువ్వు ఇష్టపడుతున్నావని ఏ హీరో గ్రహిస్తాడు 
అభిమానం ఉండాలి కాని దానికి బానిస కాకూడదు 
అభిమానం చూపించాలి కాని హద్దు దాటకూడదు 
వెయ్ ,చిందెయ్ నీ హీరో అంటే
చెయ్ ,పండుగ చెయ్ నీ హీరో సినిమా వస్తే
కాని అవి వెర్రిలా మారి వింత కాకూడదు
అదే అభిమానం మరొకరికి వెగటు కాకూడదు
హీరో ఎప్పటికీ హీరోనే అభిమానింపబడతాడు
అభిమాని ఎంత ఆశపడినా క్యూలోనే నిలబడతాడు
హీరోలకి ఈర్ష్యా ,ద్వేషాలుండవు మరి మీకెందుకు ?
వారిలో వారికి వైరం ఉండదు మరి మీశత్రువర్గాలేమిటి ?
సరదాగా చెప్పుకోండి గొప్పలు  - మీ సంతృప్తికి
సంతోషంగా పంచుకోండి - మీ అభిమానాన్ని
పాలు పోసి ,జంతు బలులు ఇచ్చి మీ హీరో స్థాయి దించకండి
అటువంటివి వారికి కూడా నచ్చవు -కుదిరితే మంచిపని చెయ్యండి
కలిసి పండుగ చేసుకోండి - హీరోల పేరు చెప్పి కొట్టుకోకండి
వైషమ్యాలకు పోయి మీ కన్నవారి గుండెల్లో
విషాధాలను మిగల్చకండి ........

ఆలోచించండి అభిమానులారా !





Thursday 25 August 2016

కవిత నెం 224 :విజయవాడ లో -కృష్ణా పుష్కరం

కవిత నెం 224

* విజయవాడ లో -కృష్ణా పుష్కరం  * 

ఇప్పుడిప్పుడే  రూపుదిద్దుకొంటున్న   అమరావతిలో
అందంగా ఆడుకుంటుంది కృష్ణమ్మ 
ప్రతీ 12 సం //ల తర్వాత తన వద్దకు వచ్చే పుష్కరునితో 
తండోపతండాలుగా వచ్చిన జన సంద్రాన్ని చూసి 
పులకిస్తూ ,పలకరిస్తూ ప్రవహించ సాగింది మన కృష్ణమ్మ 

చుట్టపు చూపుగా వచ్చి మన గంగమ్మ కూడా జత కలవడంతో 

బిర బిరా మంటూ ,కిల కిల రావాలు చేస్తూ పరవశించింది కృష్ణమ్మ  
వడి వడిగా పరిగెత్తుతూ , తన హొయలతో ఆకర్షిస్తుంది కృష్ణమ్మ 
వచ్చిన అవకాశాన్ని  సద్విని యోగం చేసుకోమంది కృష్ణమ్మ  

నగరమంతా మిల మిలా మెరిసిపోయింది 

వీధి వీధుల్లో పుష్కరాల జాతర సాగింది 
ఎటు చూసినా కొత్తదనం ,పాత రూపుల్ని మాపుతూ 
ఎటు చూసినా సందడి , మన కృష్ణమ్మ తీరం వెంబడి 

ఈ 12 రోజులూ ఒక  పెద్ద పండుగ వాతావరణం 

ప్రతి ఇంట కనుల పంట చేసింది ఈ సంబరం 
ఆట పాటలతో ,కేరింతలతో మన కృష్ణమ్మ ఒడి 
దివ్యకాంతులతో ,దేదీప్యంగా మన కనకదుర్గమ్మ గుడి 

ప్రత్యేకంగా అలంకరించ బడిన మన  'ప్రకాశం బ్యారేజి '

ఫెర్రీ-పవిత్ర సంగమం వద్ద ఏర్పాటు చేసిన 'పుష్కర   హారతి' 
దుర్గ గుడి ,తిరుపతి గుడి నమూనాలు దిగి వచ్చిన తరుణం 
వేయి కళ్లు చాలవు కదా , వాటిని వీక్షించగా మన జన్మ పావనం 
నిగ నిగ లాడే రహదారులు - స్వాగతమంటున్న పుష్కరఘాట్లు 

వర్ణించటానికి కూడా  మాటలు చాలవు విజయవాడను చూసి 

వాడ వాడాలా ,వాలంటీర్స్ యొక్క ఆతిధ్యం తో మురిసి 

నిర్విరామంగా సాగిన మన ప్రభుత్వపు సహకారాలు 

అవి మన  చంద్రబాబు చేసిన గొప్ప  మార్గ దర్శికలు

ప్రతీ  ఒక్కరు కదిలొచ్చి -అందించిన  సహాయాలు 

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కృష్ణా పుష్కరాలు 
తరతరాలకు ,వీడిపోని కృష్ణమ్మతో మన సంబంధాలు 

హారతి వైభవం - నిత్యా శోభాయమానం మన కృష్ణమ్మ కు 

సకల పాప  హరణం - మన కృష్ణా  పుష్కర స్నానం స్నానం 
పరమ పవిత్రం - పావనం - జనపునీతం -కృష్ణా పుష్కరం