Wednesday 20 December 2017

314(కన్నప్రేమ)

కవిత నెం :314

*కన్నప్రేమ *
కొడకా ఓ ముద్దు కొడకా
కొడకా ఓ కన్న కొడకా
కొడకా ఓ తల్లి కొడకా
ఏందిరయ్యా నీ పొలికేక

మారింది నీ నడక
మా గతి ఏడ చెప్పలేక
నువ్వంటే ఇష్టం కనుక
గత్యంతరం మాకు లేక

కవిత నెం :313(తెలుగునేడు )

కవిత నెం :313
*తెలుగునేడు *

కవి అన్నా , కవిత్వమన్నా తెలియదు ఒకప్పుడు
కవులు ,కవీశ్వరులు కోకొల్లలు ఇప్పుడు
రాజుల కాలం నాడు మాత్రమే ఉన్న గుర్తింపు
రాను రాను కరువవుతుంది రాణింపు
తెలుగు పండితులంటే చులకన ఒకప్పుడు
తెలుగుభాషతో హేళన ఇప్పుడు
పరభాషలపై మోజు ,వ్యామోహం ఇప్పుడు
తెలుగు మాట్లాడటం నేరంగా పరిగణన
తెలుగోడిగా నువ్వెందుకు చెయ్యవు పరిశీలన ?

కవులు /కవిత్వాలంటే అపహాస్యం
సభలు /సమావేశాలంటే పెరుగుతుంది జోక్యం
బిరుదులు /సన్మానాలు అంటే మనకెంతో ఇష్టం
తెలుగంటే బేఖాతరు అది వృద్ధి చెందుట కష్టం

పండితులు ,నిపుణులు ఎందరో మహనీయులు
వారి వచనాలు వినకుండా పెడచెవిన పెట్టేరు
మన జ్ఞానమీ వేదమని తలచి ఎంతో మురిసేరు
తత్వాన్ని గ్రహించక తర్కములో పడుదురు

గౌరవం , సంప్రదాయం నేర్పినది మన తెలుగే
క్రమశిక్షణ ,విచక్షణ  చెప్పింది మన తెలుగే
అంటరానితనం లేని భాష మన తెలుగే
అమ్మలాగా మనల్ని లాలించేది మన తెలుగే

నువ్వెంత వాడివైనా నువ్వు తెలుగోడివే
నీకెంత తెలిసినా అందరిలో ఒకడివి మాత్రమే
సాధన తో అభ్యసిస్తే సాహిత్యం సాధ్యమేలే
నీవొకనితో మాత్రమే అది ఆరంభం కాలేదే
మన కీర్తి ,ప్రతిష్టలే ముఖ్యం కాదులే
మన తెలుగు భాష అంటే మమకారం ఉండాలే
గర్వంతో తెలుగును త్యజించాకోయి
తెలుగువాడిగా తెలుగుజాతితో స్థిరపడు భాయి
















Sunday 17 December 2017

కవిత నెం :312(ప్రపంచ తెలుగు మహాసభలు)

కవిత నెం :312
* ప్రపంచ తెలుగు మహాసభలు *

అత్యంత రంగ వైభవంగా
ప్రతీ ఇంట కవుల సంబురంగా
తెలంగాణా తెలుగు వెలుగులు అంబరంగా
అందరికీ ఉత్తర్వ / రిజిష్టర్ ఆహ్వానాలు
సుదూర ప్రాంతాల నుంచి చేరిన కవికిరణాలు
ఎందరో కళాకారుల ప్రతిభకు ఇదొక ఆనవాళ్లు
హైదరాబాద్ నడిబొడ్డున తెలుగు శోభితాలు
తలచిన కార్యం ఒక మహా సాహితీ ప్రభంజనం
ఎందరో కవుల /కళాకారుల హృదయాల పులకరింత
ఎందరో ప్రేక్షకుల నయనాలు  పరవశింత
ఆత్మీయం ,ఆతిధ్యం హత్తుకొంటూ
ఆకాశపందిరి , హరివిల్లు ఒకటిగా కలుసుకుంటూ
పొందివచ్చిన అవకాశం అందిన ద్రాక్షగా
అందకుండా జారిన అవకాశం ఒక ఆశగా
అతిదులందరున్నా , సమావేశాలు ఎన్నున్నా
ప్రాచుర్యం , ప్రావీణ్యత కనపరచే వేడుకగా
తెలంగాణా విశిష్టత నలుదిశలా ప్రవహించగా
సాగింది ఈ ప్రపంచ తెలుగు మహా సభ
ప్రతి తెలుగోడి మదిలో నిలచిన మహా సభ

ఎన్నో రాష్ట్రాల సమ్మేళనం మిళితమైన వేళ
ఎన్నో భాషల పయనం తీరం చేరిన వేళ
అవమానాలు , ఆలస్యాలు ఎదురైనా
అభిమానం ముందుకు సాగమని చెప్పెనుగా
రాజకీయాల కూటమైనా , రాజసం ఒక బాటగా
సత్కారం , సన్మానం రుచి చూపుతున్నా
ప్రతిభ తగ్గలేదు , గౌరవం వీడలేదు
ఇవి పొందిన వాడు ధన్యుడు
పొందలేనివాడుగా ఉన్న సామాన్యుడు

కొన్ని లొల్లి రేగుతూ , సర్దుమణుగుతూ
చీకటిని చీల్చుకుంటూ , వెలుతురుని వెతుక్కొంటూ
మంచి వారికి మంచి అవకాశ రధం
కొంతైనా ముందుకుపోతుంది తెలుగోడి పదం
కవుల గళాలన్నీ కలిసి అయ్యింది జనపధం

సమన్వయ లోపాలు సహజం
నిర్వాహకుల కృషి అభినందనీయం
కానీ అవసరం ప్రతి ఒక్కరికి సంయమనం
ముఖ్యంగా రక్షణ వ్యవస్థ యొక్క తోడ్పాటు
ప్రభుత్వ యంత్రా0గం సాధించింది విజయం
హర్షణీయం .... తెలుగు వెలుగుతుందని
ఇటువంటి సాహితీ పోషణకు శ్రీకారమయ్యిందని

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు



Tuesday 12 December 2017

కవిత నెం :311(మన పల్లెసీమ)




కవిత నెం :311

మన పల్లెసీమ


ప్రకృతితో దర్శనమిచ్చేది
బద్దకాన్ని వదిలించేది
ఆరోగ్యాన్ని ప్రసాదించేది
''మన పల్లె సీమ ''

అందాలతో విందుచేసేది
ఆమని సొగసులనందించేది
ఆడపడుచుల అనురాగమది
''మన పల్లెసీమ ''

చిన్నా పెద్దా బేధం లేనిది
చీకు చింత చూపకుంటది
ఆటలు -పాటలు కలుపుకుంటది
''మన పల్లెసీమ ''

పేదా ధనిక పొంతలేనిది
పాడిపంటల భాగ్యమున్నది
రైతుకు మిక్కిలి ఊపిరైనది
''మన పల్లెసీమ ''

అందరికీ బందువైనది
ప్రతీ బంధం విలువైనది
ప్రేమకు పెన్నిధిగా ఉన్నది
''మన పల్లెసీమ ''

మానవత్వం జాడ ఉన్నది
మనిషిగా నిన్ను కన్నది
మమతల సమతల తోడుకలది
''మన పల్లె సీమ ''


సద్దన్నం బలము అన్నది
ఊరగాయలో రుచిఉన్నది
ఆవగాయలో ఆకలి ఉన్నది
''మన పల్లె సీమ ''


సరదాల  జాతరున్నది
సంబరాల మోత ఉన్నది
పండుగలకు నిలయమైనది
''మన పల్లె సీమ ''


జీవనాన్ని నీకు నేర్పింది
నీ జీవితాన్ని నీకు ఇచ్చింది
నేడు ఒంటరిగా తాను మిగిలింది
''మన పల్లెసీమ ''

విదేశీ చదువుల  ధ్యాసలో
పాశ్చాత్త అలంకరణ మోజులో
స్వార్ధపు యోచన క్రమములో
మన సంస్కృతి మరచిన వేళలో

నీకోసం వేచి ఉంటుంది
''మన పల్లెసీమ ''
ఒక్కసారి అయినా తనని చూడమని
వేడుకుంటుంది '' మన పల్లెసీమ ''