Tuesday, 12 December 2017

కవిత నెం :311(మన పల్లెసీమ)




కవిత నెం :311

మన పల్లెసీమ


ప్రకృతితో దర్శనమిచ్చేది
బద్దకాన్ని వదిలించేది
ఆరోగ్యాన్ని ప్రసాదించేది
''మన పల్లె సీమ ''

అందాలతో విందుచేసేది
ఆమని సొగసులనందించేది
ఆడపడుచుల అనురాగమది
''మన పల్లెసీమ ''

చిన్నా పెద్దా బేధం లేనిది
చీకు చింత చూపకుంటది
ఆటలు -పాటలు కలుపుకుంటది
''మన పల్లెసీమ ''

పేదా ధనిక పొంతలేనిది
పాడిపంటల భాగ్యమున్నది
రైతుకు మిక్కిలి ఊపిరైనది
''మన పల్లెసీమ ''

అందరికీ బందువైనది
ప్రతీ బంధం విలువైనది
ప్రేమకు పెన్నిధిగా ఉన్నది
''మన పల్లెసీమ ''

మానవత్వం జాడ ఉన్నది
మనిషిగా నిన్ను కన్నది
మమతల సమతల తోడుకలది
''మన పల్లె సీమ ''


సద్దన్నం బలము అన్నది
ఊరగాయలో రుచిఉన్నది
ఆవగాయలో ఆకలి ఉన్నది
''మన పల్లె సీమ ''


సరదాల  జాతరున్నది
సంబరాల మోత ఉన్నది
పండుగలకు నిలయమైనది
''మన పల్లె సీమ ''


జీవనాన్ని నీకు నేర్పింది
నీ జీవితాన్ని నీకు ఇచ్చింది
నేడు ఒంటరిగా తాను మిగిలింది
''మన పల్లెసీమ ''

విదేశీ చదువుల  ధ్యాసలో
పాశ్చాత్త అలంకరణ మోజులో
స్వార్ధపు యోచన క్రమములో
మన సంస్కృతి మరచిన వేళలో

నీకోసం వేచి ఉంటుంది
''మన పల్లెసీమ ''
ఒక్కసారి అయినా తనని చూడమని
వేడుకుంటుంది '' మన పల్లెసీమ ''













Related Posts:

  • నిన్ను నిన్నుగానే ప్రేమించా(11) ''నిన్ను నిన్నుగానే ప్రేమించా'' నిన్ను నిన్నుగానే ప్రేమించా నీకోసం నిరీక్షించా ,పరితపించా నా జీవితంలో ఇక నీవే నా పట్టపురాణివి నీ  పలుకుల  … Read More
  • మానవ శిధిలాలు(9) కవిత నెం : 9 *మానవ శిధిలాలు * మానవుడు చేస్తున్న అమానుష చర్యలకు మనిషి తనలో తానూ నలిగిపోతున్న వైనం తనను తానూ ఆత్మ వంచన చేసుకున్నప్పుడు చేసిన పాపములకు శ… Read More
  • ఓ ఓటరు మహాశయా! (350)కవితా శీర్షిక : ఓ ఓటరు మహాశయా!మన పోరాటం వ్యవస్థ కోసం కాని ఒక వ్యక్తి కోసం కాకూడదు.మన ఆరాటం చెడుని జయించటం కోసంకాని మంచిని ముంచటం కోసం కాకూడదు.మన … Read More
  • ఐ లవ్ యు ప్రియా (7) కవిత నెం : 7ఈ సముద్రం సాక్షిగా నింగి సాక్షిగా ,నీరు సాక్షిగా  నేను నిన్ను ప్రేమిస్తున్నా ప్రియా  సముద్రం ఎన్నో జీవరాసులను  తనలో దా… Read More
  • నీవేమి -నేనేమి (8) // నీవేమి -నేనేమి // నిన్ను చూడక నా మది గది తలుపును తెరువకున్నదే నీవు నాతోన లేని ఈ క్షణమున నా నయనం ఏ దృశ్యమును చూడలేకున్నదే ఎందుకు ఎందుకు ఎందులకు ? న… Read More

0 comments:

Post a Comment