Sunday 9 April 2023

శ్రీ హరి గోవిందం (351)

ఎంతెంతో పుణ్యం హరి నామస్మరణం
పిలిచినా పలికెను -అదియే శ్రీనివాస అభయం
భక్తులను సదా కాచి కాపాడెను 
కోరిన కోర్కెలు తీర్చే వైకుంఠ నాధుడు
ఏడెడు లోకాలు దాటి
ఏడు కొండలకు వచ్చి
సర్వ జగ ధ్రక్షకుడుగా వెలిసియున్నాడు
శ్రీ కలియుగ వెంకట నాధుడు
అదిగో అల్లదగో శ్రీ హరివాసము
పవిత్ర పుణ్య స్థలైన తిరుపతి నగరమున
వేచి యున్నాడు శ్రీ తిరుమలేశుడు
ప్రతీ ఇంటింటి కొంగు బంగారమై
నడిపిస్తాడు ,వినిపిస్తాడు,కనిపిస్తాడు
కనులతో కాంచి చూడు ఆ కమనీయమైన రూపాన్ని
ఆశగా వేచి చూడు ఆ దివ్యమైన దర్శనానికి 
నిర్మలమైన మనసుతో నిజరూప దర్శనం కోసం
అన్నీ మరచి ,హాయిగా స్వామిని తరయిస్తూ
శ్రీ వేంకట రమణుడి వైభోగం చూడు
ఇందుగలడు ,అందుగలడు అని 
శ్రీ హరి ఈ తిరుపతి కొండంతా గలడు
మన కోసం ,మన క్షేమం కోసం 
నిత్య అభిషేకుడై ,నిత్యంగా నీరాజనాల అందుకుంటున్నాడు 
నీ కంటూ, నా కంటూ ,మన కంటూ ఉన్న ఇలవేల్పుడు 
అలువేలు మంగ సమెతుడై గోవిందుడు 
అందరివాడగా ,అనాధ రక్షకుడుగా ,అపద్బాండవుడు గా
కొండలలో నెలకొన్నాడు కోనేటి రాయుడు
ఆయన నామం చాలు -  గోవిందా హరి గోవిందా
ఆయన దర్శనం చాలు - సకల పాప హరణం
శ్రీ మన్నారాయణం - శ్రీ హరి గోవిందం