Saturday, 28 January 2017

కవిత నెం263:మేలుకో నవతేజమా

కవిత నెం :263

*మేలుకో నవతేజమా *

సమాజాం పిలుస్తుంది రా కదలిరా
నవ సమాజం పిలుస్తుంది రా కదలిరా
గుర్రు పెట్టి నిద్రబోతే ఏముందిరా
కలం పట్టి గళం పాడే చోటుంది రా

నాలుగు గోడల మధ్య ఏముందిరా
నలుగురితో కలిసి చూడు రా కదలిరా
నవ్వుకుంటూ ,తిట్టుకుంటూ ఎంతకాలం రా
నిజమేంటో నీ సిరాతో చెప్పి చూడరా

నీ సుఖం , నీ పక్షం ఎంతసేపురా
ఎదుటివారి బాగు కోసం రా కదలిరా
న్యాయ అన్యాయాల గుణింతమేలరా ?
ఎదురించే గుండె చాలు రా కదలిరా

కడుపులోనే కుళ్ళు దాచి కంపుకాకురా
ఈ సమాజంలో కుళ్ళు కంపు పెకలిద్దాం రా
ఉడుకు నెత్తురుంటే చాలా ఏమాంటావురా
ఉడుములాగా ఉరకాలి ఆగిపోకురా

నీకెందుకు అనుకుని ఆగిపోకురా
నీ ఒక్క ప్రశ్నతోనైనా ప్రశ్నిద్దాం రా
అడుగులకు మడుగులెత్తే ఖర్మ ఏలరా !
గొఱ్ఱెలాగా మందలోనా వలస ఏలరా !

ఎక్కడైనా రాజీ పడని తత్వమేలరా
అమాయకులపై నీ వెర్రి కేకలు చాలురా
నీ సమాజం కోసం ఎక్కడా రాజీ పడకురా
నీ ఆవేశం ఆలోచనతో ఆవిర్భవించరా

నీ ఇల్లు , నీ కుటుంబం ఒక్కటే సొంతం కాదురా
నీ సమాజం ,నీ దేశం అని మరువబోకురా
ఏవో నీతులు చెప్పి చల్లారబోకురా
నువ్వు తెలుగువాడివని ఎన్నటికీ మరువబోకురా

- 31.01. 2017
గరిమెళ్ళ గమనాలు
























Related Posts:

  • కవిత నెం31:సాగిపో కవిత నెం :31 సాగిపో ....  * ఫలితం ఆశించకుండా  పనిచెయ్యి కష్టాన్ని మరచి శ్రమించవోయి ఆనందం చెదరిపోకుండా బ్రతుకవోయి చెడుతో విసిగిపోకుండా మంచిచ… Read More
  • కవిత నెం 30:ఆలు మగలు కవిత నెం :30 *ఆలు మగలు * బార్యా భర్తల బందం ఎంతో పవిత్రమైనది మూడు ముళ్ళ బంధమది ఏడడుగుల అనుబంధమది జన్మ జన్మల బాందవ్యమది నీకోసం ఒక తోడు నిరంతరం నీతో పాట… Read More
  • కవిత నెం 272:అమ్మమ్మ కవిత నెం :272 * అమ్మమ్మ * అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు రేపటి వెలుగమ్మ అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు భవితకు గతమమ్మ మా అమ్మకు అమ్మవు మమతల పందిరివు ఇంటికే ఇలవేల్పువ… Read More
  • కవిత నెం 28:ఈ వేళ కవిత నెం :28 నా కనుల ముందు నీ తోడు లేక  దాచి ఉంచా అది నీకు చెప్పలేక నీ జత లేని నా జీవితంలో హరితం హరించుకున్న వేళ  నీ కోసం రాహదారిలో బాటసా… Read More
  • కవిత నెం27:నా దేవి కవిత నెం :27 నాలో సగం నా రూపంలో ప్రతి రూపం నా భావాలకు అక్షర రూపం నా కన్నులకు నీవు కార్తీక దీపం నా మనసుతో ముడిపడిన మరో వసంతం నా హృదయములో నిలచిన పారిజ… Read More

0 comments:

Post a Comment