Tuesday, 24 January 2017

కవిత నెం 259:సమయం లేదా మిత్రమా

కవిత నెం :259

* సమయం లేదా మిత్రమా *

కాలం చాలా విలువైనది ,నిరంతరంగా ప్రయాణించేది
సమయ పాలన విలువ పెరిగి నిజంగానే  క్షణ తీరిక లేకుండా పోతున్నాం

బంధాలు , బంధుత్వాలు అంటూ అందరిమధ్యన  పెరిగిన మనకు
నేడు ఎవ్వరి తోడూ లేకుండా , ఏకాంతంలో బ్రతుకుతున్నాం

అమ్మా , నాన్న తోడు లేకుండా ,వారిని చూడకుండా ఉండలేని రోజులు
నేడు వారితో కాసేపు ఆప్యాయంగా మాట్లాడలేక విసుక్కుంటున్నాం

ఉత్తరాలు , ప్రతుత్తరాలతో కమ్మని కబుర్లు లేఖల్లో పంచుకున్నాం
నేడు వాట్స్ అప్ ,ట్విట్టర్స్ అంటూ  కాలాక్షేపాలు చేస్తున్నాం

నీ అవసరాల కోసం ఉన్న ఊరుని , కన్న వారిని విడిచి దూరంగా పోతున్నాం 
కనీసం పండగలకి , పబ్బాలకి కూడా మన ఊరుని , మన వారిని కలుసుకోలేకపోతున్నాం 

చిన్ననాడు స్నేహితుల కోసం మన వారినే లెక్క చేసే వారిమి కాదే 
మరి  ఆ స్నేహితులతో ఒక్కసారి అయినా మాట్లాడవా గుర్తు తెచ్చుకో !

మన పనులు మనం చేసుకునే వాళ్ళమే కదా అప్పుడు 
నేడు ఆన్ లైన్లు వచ్చిన తర్వాత 'బద్దకానికి ' అలవాటు పడుతున్నాం 

నీ చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోలేని స్థాయిలో నేడున్నాం 
కనుకనే ఏదైనా సమస్య వస్తే 'ఆత్మ హత్య' లకు పాల్పడుతున్నాం 

కాలంతో పాటు మన జీవన విధానంలో కూడా మార్పు వచ్చింది నిజమే 
కానీ మన మొదట ఎలా ఉన్నాం అనే అస్థిత్వాన్ని మరిచిపోతున్నాం 

ఎదో ఆశ ,ఎంత సంపాదించిన అందని దానికై నీ ప్రయాస 
ఉన్న వసతులు చాలవా మిత్రమా , ఉన్నంతలో హాయిగా బ్రతకటానికి 

మన ఎదుగుదల , మన జీవితం ముఖ్యమే 
మనకున్న సమయంలో డబ్బుతో పాటు , ప్రేమలు -ఆప్యాయతలు కూడా కావాలిగా 

మన అవసరాలను కూడా మనమే స్వతహాగా చేసుకోలేని బిజీలో మనమున్నాం 
సమయం ఉంటుంది మిత్రమా .... సంతోషంగా నీ జీవితం సాగించటానికి 
కాబట్టి ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా ..... నీ సమయాన్ని కాపాడుకో !

- 24. 01. 17 // గరిమెళ్ళ గమనాలు //





Related Posts:

  • కవిత నెం :258 కవిత నెం :258 పసి హృదయంలో ప్రేమని పుట్టించావు ఆశలతో నా మనసుకి నడక నేర్పించావు నీ వలపుల ఊసులతో ఉరకలు వేయించావు అన్నీ చేసి ఇలా ఓడిపొమ్మని నన్నొదిలి వె… Read More
  • కవిత నెం 108:భయం కవిత నెం :108 ఎక్కడ నుంచి వస్తుందీ ? ఎటువైపునుంచి వస్తుందీ ? చల్లని స్పర్సలా వచ్చి  పాదరసంలా ఒళ్ళంతా పాకి  కరెంటు షాక్ లా నరనర మెక… Read More
  • కవిత నెం257:నేతాజీ నీకు జోహారు కవిత నెం -257 * నేతాజీ నీకు జోహారు * స్వాతంత్ర సమరంలో పోరాడిన యోధుడా వెన్ను వంచక శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన వీరుడా జోహార్లు నీకు జోహా… Read More
  • కవిత నెం111:గురువు కవిత నెం :111//గురువు // గురువు అనే పదం గర్వమైనది . గురువు అనే పదం మనకు మార్గమైనది గురువు అనే పదం గౌరవప్రదమైనది. గురువు అంటే ఆదివిష్ణువు  … Read More
  • కవిత నెం 110:నిశబ్దంలో కవిత నెం :110 కదిలే నక్షత్రాలని చూసి  ఓ క్షణం నిలుచున్నా ఈ నిశబ్దంలో  మెరిసే మెరుపుని చూసి  ఓ క్షణం మూగబోయినా ఈ నిశబ్దంలో  అ… Read More

0 comments:

Post a Comment