Tuesday, 3 January 2017

కవిత నెం 251 : అమ్మ ప్రేమాలాపన

కవిత నెం :251

** అమ్మ ప్రేమాలాపన **

తనకంటూ ఉన్నా లేకున్నా 
తనకంటూ ఏమీ దాచుకొని అమ్మతనం 
తన రెక్కల కష్టంతో బిడ్డలను సాకేదే తల్లి గుణం 
తన పిల్లల కోసం ప్రయాస పడటం ఆమె ఆరాటం 

తన కడుపులో నీళ్లు ఆవిరవుతున్నా తరగని ప్రేమ వైనం 
ఆ  పూటకి దొరికిన ఆహారాన్ని తన నోటితో పిల్లలకు అందిస్తూ 
వారి ఆకలి తీరినాక తన ఆకలికి మర్చిపోయే మాతృత్వం 

తన దుఃఖాన్ని సైతం విస్మరించి మమకారం చూపే అమ్మబంధం 
తన పిల్లల సుఖాల కోసం నిరంతరం శ్రమిస్తూ సాగే కల్పవల్లి . 

ఎన్నో ఎదురుదెబ్బలను ఓర్చుకుంటూ బ్రతికే చిట్టి తల్లి 
ఎన్ని ప్రమాదాలను కాచి తన పిల్లలకు రక్షణ కల్పిస్తుంది 

తన వారి కోసం తన జీవితాన్ని ఫలంగా పెట్టి బంగారు భవితనిస్తుంది 
అది పక్షులకైనా , మరే ప్రాణులలో నైనా 
తల్లి ప్రేమ తరగని నిక్షేపం 
ఆమె చూపే ఆదరణ అపురూపం 

తల్లిప్రేమకు నిర్వచనం లేదు 
అమ్మ ప్రేమ ముందు ఈ సృష్టి కూడా భేఖాతరు

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు // 04. 01. 17//





Related Posts:

  • కవిత నెం185:చెలియా నీవే కవిత నెం :185 చెలియా నీవే న కన్నుల్లో నీవే న గుండెల్లో నీవే నాతో వచ్చే నీడలో కూడా నేవే ఎటు చూసిన నీవే ఎవ్వరిలో వున్నా ఎదురుగ వచ్చేది నీవే న… Read More
  • కవిత నెం 183:ఆశ కవిత నెం :183 నీతో నడవాలనే ఆశ నీతోపాటు ఉండిపోవాలనే ఆశ నీ నవ్వు చూడాలనే ఆశ నిన్ను నవ్వించాలనే ఆశ నీతో ఎకాంతంగా గడపాలనే ఆశ నీ చెంతనే ఉండి సేద తీ… Read More
  • కవిత నెం 184:నువ్వంటే ఇష్టం కవిత నెం :184 *నువ్వంటే ఇష్టం * స్వచ్చమైన నీ చిరునవ్వంటే  నా కిష్టం  వెన్నెలమ్మ హాయిని చూపే నీ చూపంటే నా కిష్టం లోకం మరచి,నీతో ఉండి ,… Read More
  • కవిత నెం 256 :రిపబ్లిక్ డే కవిత నెం  :256 ** రిపబ్లిక్ డే ** భారత దేశంలో రాజ్యాంగం అమలు ప్రారంభమైన రోజు భారత దేశం గణతంత్ర దేశంగా ప్రకటించుకున్న రోజు  'గణతంత్ర ది… Read More
  • కవిత నెం182:ఓ ప్రియతమా ! కవిత నెం :182 ఓ ప్రియతమా ! కలలో చూసిన సౌందర్యరూపం  అది నే మేను యొక్క అందం. చంద్రబింబం లాంటి నీ సోయగం నా మదిలో రేపెను కలవరం ప్రియా ! నీ పర… Read More

0 comments:

Post a Comment