Tuesday, 31 January 2017

కవిత నెం264:* జీవన పోరాటం *

కవిత నెం :264

*జీవన పోరాటం *

పొద్దుగాడ లేస్తూనే
పొట్టకూటి కోసం
ఎన్నో పనులు
మరెన్నో బాధ్యతలు

గీ రోజు  మంచిగా గడిస్తే చాలు
గీ  దినం మనం బతకనీకి సంపాదిత్తే చాలు
ఎన్నో హృదయాల ఆర్భాటం
మరెన్నో హృదయాల బ్రతుకు పోరాటం

మనిషి ఆశలకు హద్దుల్లేవు
మనోషి ఊహలకు నియమాలు లేవు
కొద్దిమంది  మేడలు , మిద్దెల్లో కాపురముంటే
మరి కొద్దిమందికి నిలువ నీడ లేక తపించేవారు

ఏముంది ఈ భూమిలో అంతా మట్టేకదా
ఏముంది ఈ గాలిలో అంతా తేమే కదా
అవి ఉన్నోడికి ,లేనోడికి అంతా ఒకటే కదా
మరేంది జట్కాబండి బ్రతుకులు
మరేంది ఆకలి అరుపుల ఆర్తనాదాలు

ఉన్నోళ్లు ఆశ చావక ఆకాశం వైపు పోతుంటే
లేనోడు ఈ పొద్దు గడిస్తే చాలు అంటూ ఎదురు చూపులు



Related Posts:

  • కవిత నెం33:ఉద్యోగం కవిత నెం :33 ఈ రోజుల్లో యువకులకి ప్రదానమయిన సమస్య ''ఉద్యోగం '' చదువుకున్నది అంతా ఒక ఎత్తు అయితే చదువు అయిన తరువాత వారి వారి అర్హతలకు సంబంధించి ఉద్యో… Read More
  • కవిత నెం38:స్నేహం కవిత నెం :38 స్నేహం చినుకులా వచ్చి వర్షంలా మారి నదిలా ప్రవహించి మన మనసులో నిలచిపోయే అద్బుతమైన బంధం బాష లేని భావ తరంగం ఈ ''స్నేహం '' మరణం లేని అమరం ఈ… Read More
  • కవిత నెం 35:నదీ స్నానం కవిత నెం :35 //నదీ స్నానం// ***************************** సకల ప్రాణ రాశులకు  ఇది జీవ ధరణి ప్రవహించే నదిలో చేయు నదీస్నానం పవిత్ర ఆరోగ్యాబివృ… Read More
  • కవిత నెం36:వాయువు కవిత నెం :36 //వాయువు // పంచభూతములలో ఇది ప్రముఖమైనది విశ్వమంతటా నిరాకారంగా వ్యాపించినది ప్రకృతి లో అదృశ్య రూపమై ఆవిర్భమైనది సకలచరాచరసృష్టి కి జీవనాద… Read More
  • కవిత నెం34:ద్రాక్ష కవిత నెం :34//ద్రాక్ష// ద్రాక్ష - ఫలములలో రాణి అని దీని పేరు వైటాస్ కుటుంబం నుంచి వచ్చిన ఫలము బెర్రీ ఫ్రూట్ అన్ని దీనికి ఉంది మరొక పేరు ద్రాక్షలో మన… Read More

0 comments:

Post a Comment