Friday 3 February 2017

కవిత నెం265 :* భార్య బాదితులం *

కవిత నెం  : 265
భావగీతి కవన సంకలనం కోసం 

కవిత నెం :1
* భార్య బాదితులం *
(హాస్య కవిత - సరదాకు మాత్రమే)

భార్య బాదితులం మేం భార్య బాదితులం
పెళ్ళితోనే మొదలవుతుంది మాకు
బెండ్ అవ్వమని మా బెండ్ తీస్తారు

జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు
మనం సుకుమారంగా వారి తలపై చెయ్యి పెడితే
మనల్ని అణగదొక్కేట్టు గట్టిగా ఒత్తుతారు

పెళ్ళిలో దండలు మార్చుకునేటప్పుడు
మనం వారికన్నా ఎత్తుగా ఉంటే
ఎగిరెగిరి మరీ సాధించుకుంటారు

అరుంధతీ నక్షత్రం చూపించబోతే
మనకు చుక్కలు ఎలా చూపిద్దాం అని
అక్కడే ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటారు

ఏవండీ అని పిలవటానికి వారికి ఇబ్బంది అండి
అందుకే 'రా ' అని , పేరు పెట్టి మరీ పిలుస్తారు
కానీ మనతో 'బంగారం' బుజ్జి ' అని పిలిపించుకుంటారు

వారి అమ్మ ,నాన్నలని మనం గౌరవించాలి
మన అమ్మ ,నాన్నలని మాత్రం ఆంటీ ,అంకుల్ అని
లేదంటే అత్తా , మామ్ అంటా  .....కత్తిరింపు లాగా

ఆరోజుల్లో పొద్దున్నే లేచి , మొగుళ్ల కాళ్లకి దండం పెట్టరు మాష్టార్లు
మనమే లేచి , ఆఫీసు కెళ్లేటప్పుడు వారిని లేపి మరీ వెళ్లాలి

మనం మెసేజెస్ , ఫోన్స్ చేస్తే సరిగ్గా సమాధానం రాదు కదా
వారు ఫోన్ చేసినప్పుడు , ఒక్క రింగ్ కి రిప్లై ఇవ్వలేదా
ఇక అంతే తిట్ల దండకం (లేదా ) సత్యభామ అలకలు

వారికేమో మన నుంచి స్వేచ్ఛ కావాలంటారు
మన మెయిల్స్ , ఫోన్స్ పాస్ వార్స్ తెలుసుకుని మరీ
తీరికగా అన్నీ చెక్ చేసుకుంటుంటారు .......

వారి స్నేహితులను ధైర్యంగా పరిచయం చేస్తారు
మన స్నేహితులను మాత్రం ఇంటికి కూడా రానివ్వరు
అదే అమ్మాయి అన్నా అంటూ పలకరించినా ఒప్పుకోరు

ఆదివారం వస్తే విశ్రాంతి కావాలంటారు
బయటకు తీసుకెళ్లమని ఆదేశిస్తారు
అదే మాకు దొరికిన ఒకే ఒక సెలవుదినంగా మాత్రం గుర్తించరు

వంటలలో సాయం చెయ్యమంటారు
టీవీ సీరియల్స్ అలవాటు పడి మనల్ని అవే చూడమంటారు

ఎక్కడికైనా ప్రయాణం చెయ్యాల్సి వచ్చిందా
ముందుగా కన్ఫర్మేషన్ చెప్పకుండా
అప్పటికప్పుడు చెప్పి నీకు నన్ను తీసుకెళ్లే ఉద్దేశం లేదని
బుకాయిస్తుంటారు ..... ....

మనం వారిని విడిచి ఎక్కడికైనా వెళితే
ప్రేమగా కుశల ప్రశ్నలొదిలేసి
మనతో పంపిన సామాన్ల గురించి గుర్తుచేస్తూ ఉంటారు

వారు పుట్టింటి కెళ్ళినప్పుడన్నా
కాస్త స్వేచ్ఛగా ఉందాం అనుకుంటే
పదే పదే ఫోన్స్ చేసి టెస్టులు పెడుతుంటారు

వారికి ముద్దు వస్తే
'బేబీ ' 'మొద్దు' అంటూ కుక్కపిల్లల్లా పిలుపులొకటి
వారికి భాద వస్తే కన్నీళ్లతో
మన షర్ట్ మొత్తం పాలిపోయేలా చేస్తారు
మనం టెన్షన్ వల్లో , ఒత్తిడి వల్లో
స్నేహితులతో కలిసి మందు కొడితే
అది కూడా మానెయ్యమని మొరాయిస్తారు

కోపంగా ఒక్క మాట కూడా అనకూడదు సుమీ
నాపై ప్రేమ తగ్గింది అంటూ ... మనకే డౌట్ వచ్చేలా చేస్తారు
మన వలన వారు సంతోషంగా ఉండాలని చూస్తారు
మన సంతోషం మాత్రం వారికి రవ్వంత పట్టదు

మన జీవితంలో ఏదైనా సాధిస్తే
ఆ విజయం అంతా వీరే అనుకుని చాటింపు చేస్తారు
పొరపాటున మనకు అవమానం జరిగితే
మన వైఫల్యాలను ఎత్తి మరీ చూపుతారు

షాపింగుకి తీసుకెళ్ళమంటారు
మనకి నచ్చింది సెలెక్ట్ చెయ్యమంటారు
కానీ వారికి నచ్చిందే వారు తీసుకుంటారు
పైగా ఆ షాపింగ్ కి ఒక పూట చేస్తారు

ఇవన్నీ చిన్న చిన్న సరాదా గిల్లికజ్జాలు
మొగుడు -పెళ్ళాం ల మధ్య సర్వ సాధారణం
సరదాగా కవితలా రాసినవి మాత్రమే సుమండీ !

- గరిమెళ్ళ గమనాలు
04. 02. 2017
















0 comments:

Post a Comment