Wednesday, 22 February 2017

కవిత నెం276:తెలుగు వెలుగు

కవిత నెం :276
శీర్షిక పేరు :  తెలుగు వెలుగు 

మరో జన్మకేగినా , మరల జన్మించినా మాతృభాష  తెలుగవ్వాలనీ
విదేశాలకేగినా ,విచ్చలవిడి తిరిగినా తెలుగంటే  అంటు కారాదని

ఏ భాష నేర్చినా , ఏ యాస పలికినా తెలుగులాంటి తేనే బాషఉండదనీ
చదువెంత  యున్నా , సంస్కారం నేర్పే సరళమైన భాష తెలుగేననీ

అవయవాలు కదిలించి , ఆరోగ్యం కల్పించే మన తెలుగు భాష ఒకటేననీ
తెలుగు జాతి ఖ్యాతిని చూపి , తెలుగోడని ఎలుగెత్తి చూపే భాష మన తెలుగనీ

అక్షరాలు ఎన్నున్నా , లక్షణంగా  పలకగల తెలుగు భాష మనదేనని 
ఈ అవనిలో  అఖండంగా దశ దిశలా ధ్వనించి రవళించే భాష మన తెలుగనీ 

తెలుగును  త్యజించాలని , తెలుగును మరుగున  పెట్టాలని చూడకోయి తెలుగోడా 
నీ తెలుగు  ఒక వెలుగు అది నీ కణమంతా మెలుగు .... తెలుగు రక్షణకై వెయ్యి తొలి అడుగు 

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు 
# కవి తరంగం #
23. 02. 2017





Related Posts:

  • కవిత నెం27:నా దేవి కవిత నెం :27 నాలో సగం నా రూపంలో ప్రతి రూపం నా భావాలకు అక్షర రూపం నా కన్నులకు నీవు కార్తీక దీపం నా మనసుతో ముడిపడిన మరో వసంతం నా హృదయములో నిలచిన పారిజ… Read More
  • కవిత నెం 30:ఆలు మగలు కవిత నెం :30 *ఆలు మగలు * బార్యా భర్తల బందం ఎంతో పవిత్రమైనది మూడు ముళ్ళ బంధమది ఏడడుగుల అనుబంధమది జన్మ జన్మల బాందవ్యమది నీకోసం ఒక తోడు నిరంతరం నీతో పాట… Read More
  • కవిత నెం31:సాగిపో కవిత నెం :31 సాగిపో ....  * ఫలితం ఆశించకుండా  పనిచెయ్యి కష్టాన్ని మరచి శ్రమించవోయి ఆనందం చెదరిపోకుండా బ్రతుకవోయి చెడుతో విసిగిపోకుండా మంచిచ… Read More
  • కవిత నెం 272:అమ్మమ్మ కవిత నెం :272 * అమ్మమ్మ * అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు రేపటి వెలుగమ్మ అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు భవితకు గతమమ్మ మా అమ్మకు అమ్మవు మమతల పందిరివు ఇంటికే ఇలవేల్పువ… Read More
  • కవిత నెం 28:ఈ వేళ కవిత నెం :28 నా కనుల ముందు నీ తోడు లేక  దాచి ఉంచా అది నీకు చెప్పలేక నీ జత లేని నా జీవితంలో హరితం హరించుకున్న వేళ  నీ కోసం రాహదారిలో బాటసా… Read More

0 comments:

Post a Comment