Friday 17 February 2017

కవిత నెం 273:ఆటో వాలా

కవిత నెం :273
*ఆటో వాలా *

జీవన భృతి కోసం మనిషి పట్టిన
మూడు చక్రాల రధం .........

ఒకప్పుడు ఒకటి ,రెండు ,మూడు
ఇప్పుడు వందలు కాదు వేలు
ఒకడి కింద నలుగుతూ ఉండే కన్నా
సొంతంగా సులువైన ఉపాధి ఆటో

ఒక కిరాయి కోసం ఎదురుచూపులు
కొన్ని సర్వీసులు వస్తే పూట జీతం
ఆ ఆటోపైనే ఆధారపడే కుటుంబాలు
సాయంత్రానికి లెక్కల ఎక్కాల జాబితాలు

వెతుకులాట నుంచి ఆన్ లైన్లో సేవలు
అప్పు చేసి మరీ ఆటో నడిపే మేధావులు
అణుకువగా ఉండేది కొందరైతే
అజమాయిషీ చేసేది మరి కొందరు
ఆటో యూనియన్లలో చిక్కేది కొందరు
స్వేచ్ఛగా విహరించి సంపాదించేది ఇంకొందరు

మండుతున్న  డీజిల్ ధరలు ఒక వైపు
పెరుగుతున్న క్యాబ్ సర్వీసులు మరో వైపు
సూర్యుడు నిద్రలేవక ముందు నుంచే
వీరి పరిభ్రమణం మొదలవ్వాల్సిందే
మరల ఇంటికి వెళ్ళేది ఏ అర్ధరాత్రికో

కొన్ని ఆటోవాలా రేట్లు నయమనిపిస్తే
మరి కొన్ని ముట్టుకుంటే భయమనిపిస్తాయి

ఓ ఆటోవాలా
నీ కోసం , నీ కుటుంబం కోసం
నీ ఈ ఆటో సావాసం శభాష్
నీ కాళ్ల మీద నిలబడే ధైర్యం అదుర్స్

మా దగ్గర నిజాయితీ చూపించు
నీ సొమ్ము మరింత పెరుగుతుంది
మోసాన్ని వీడి మనిషిగా మెసలుకో
మంచి మనసుల దగ్గర స్థానం ఉంటుంది
త్వరగా వెళ్లాలని ప్రయత్నించకు
నీ పక్కకు రావాలంటే విసుగొస్తుంది

- గరిమెళ్ళ గమనాలు
(17. 02. 17)











0 comments:

Post a Comment