Tuesday, 21 February 2017

కవిత నెం 275:*గోవు (గో మాత)*

 కవిత నెం :275
*గోవు (గో మాత)*

పరమ పవిత్రతకు , శుభానికి సూచిక 'గోవు'
అనాదికాలం నుంచి ఆరాధ్యదైవం 'గోవు'
భూమాత ధరించిన రూపం ' గోవు '
ఆదిశక్తి అంశ నుండి జన్మించిన రూపం 'గోవు'
హోమంలో నుండి జనించిన అగ్నిగోత్రం 'గోవు '
ముక్కోటి దేవతలకు నిలయం 'గోవు'
సమస్త కోరికలను తీర్చే దేవత 'గోవు'
ప్రాచీన భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక 'గోవు'
యజ్ఞయాగాది క్రతువులలో పాలు పంచుకోగలిగేది 'గోవు'
అతీంద్రియ దర్శన శక్తిని కల్గినది 'గోవు'
కన్నతల్లి సమానురాలు 'గోవు '
ప్రతి ఇంటీ కల్పతరువు 'గోవు '
రైతు వెన్నుముక 'గోవు'
భూలోక పూజలందుకునే గో మాత 'గోవు'
ముల్లోకాలకే విశ్వమాత గా 'గోవు'
దేవ రహస్యాన్ని పసిగట్టగల పాడి ఆవు ఈ 'గోవు'

గంగి గోవు పాలు గరిటెడైనను చాలు
విషాన్ని హరించే శక్తి కలవి  'గోవు పాలు'











Related Posts:

  • కవిత సంఖ్య :281(జీవితమే ఒక ప్రశ్న) కవిత సంఖ్య :281 జీవితమే ఒక ప్రశ్న ఏదో వెతుకులాట ఎక్కడికో  ప్రయాణమట ఎంత ఉన్నా ,ఏమి తిన్నా తృప్తి లేని మనిషి తన అవసరాలకు మించి పరితపిస్తుంటాడు భ… Read More
  • కవిత నెం :290(మారాలి) కవిత నెం :290 మారాలి మారాలి ఈ ప్రపంచం మారాలి నువ్వూ మారాలి నేనూ మారాలి మనం మారాలి ఈ జనం మారాలి చూస్తూ ఉంటే రోజులు పోతాయి కూర్చుని తింటే కొండలు కరుగు… Read More
  • కవిత నెం : 307(వెధవ జీవితం) కవిత నెం : 307 * వెధవ జీవితం * చిన్నప్పుడే హాయిగా ఉంది కష్టం తెలియదు తెలిసినా చేయనిచ్చేవాళ్లు లేరు సుఖం తెలియదు అందులోనుంచి రానించేవాళ్లు లేరు దుఃఖ… Read More
  • కవిత నెం263:మేలుకో నవతేజమా కవిత నెం :263 *మేలుకో నవతేజమా * సమాజాం పిలుస్తుంది రా కదలిరా నవ సమాజం పిలుస్తుంది రా కదలిరా గుర్రు పెట్టి నిద్రబోతే ఏముందిరా కలం పట్టి గళం పాడే చోట… Read More
  • కవిత నెం :340(నీ జ్ఞాపకంలో - నేనున్నా నాన్న ) కవిత నెం :340 కవితా శీర్షిక : నీ జ్ఞాపకంలో - నేనున్నా నాన్న  నువ్వంటే ఇష్టం నాన్న నీ రూపంటే ఇష్టం నాన్న నీ ఊహ తెలియకుండా ఎదిగా నాన్న న… Read More

0 comments:

Post a Comment