Tuesday, 28 February 2017

కవిత నెం 278: అంతా మిధ్య

కవిత నెం :278

* అంతా మిధ్య *
ఎక్కువగా ఏదీ కోరుకోకు 
పొందినదాన్ని చేతులారా చేజార్చుకోకు 

అంతా నీదేనని మిధ్యపడకు 
ఇంతలో ఏముందని తేలికపడకు 

సమస్తం తెలుసునని మిడిసిపడకు 
అందరూ వెర్రివాళ్లు అని చులకనపడకు 

సుఖంలో ఏదోఉందని సంబరపడకు 
కష్టం బహుకఠినమని దిగులుపడకు 

మెరిసేదే బంగారం అని తుళ్లిపడకు 
మెరుపుకన్నా వేగం లేదని మభ్యపడకు 



Related Posts:

0 comments:

Post a Comment