Sunday, 19 March 2017

కవిత సంఖ్య :279 (వస్తుంది ఉగాది !)

కవిత సంఖ్య :279

కవితా శీర్షిక : వస్తుంది ఉగాది !

తెలుగింటి ముంగిలి లోకి 
ఇష్టం పెంచుకుని మరీ వస్తుంది ఉగాది 
స్వచ్ఛమైన మనసులకు ఆహ్లాదం అందివ్వటానికి 

పిండి వంటల ఘుమ ఘుమలతో ..
ఉవ్విళూరిస్తూ.. వస్తుంది ఉగాది  
ఉరకలేసే సంతోషాల సంబరం తేవటానికి 

కొత్త కొత్త అందాలను తనతో తెస్తూ వస్తుంది ఉగాది
ఆమని సొగసులతో .. పగడాలను కూర్చటానికి 


కమనీయమైన ఆలాపనతో వస్తుంది  ఉగాది
కోయిలమ్మ పలుకులు వినిపించటానికి

మురుస్తూ ,మెరుస్తూ వస్తుంది ఉగాది
మామిడాకుల తోరణాలతో మది నింపటానికి

పరిపూర్ణమైన పచ్చదనంతో వస్తుంది ఉగాది
ప్రకృతితో కలిసి మయూరిలా నర్తించటానికి

మల్లె జాజుల పరిమళ గంధం పుస్తూ..వస్తుంది  ఉగాది
ఆంద్రుల ఆడపడుచులతో.. పెనవేసుకున్న బంధం చూపటానికి


తెలుగు సంవత్సరంలో అడుగుపెట్టే ఉగాది
ప్రధమమైన పండుగతో శోభను విరాజిల్లటానికి

షడ్రుచుల సమ్మేళనంతో వస్తుంది ఉగాది
జీవితంలో అన్ని కర్మలకు అలవాటుపడటానికి

ఒక వేడుకలా వచ్చిన ఉగాది
మనకెంతో నేర్పే వెళ్తుంది ఈ ఉగాది

వసంతఋతువుకు వన్నెల చిన్నారి ఉగాది
పంచాగశ్రవణం తో సూచనలు చేసే ఉగాది

అందమైన అనురాగబంధం ఉగాది
చైత్ర శుద్ధ పాడ్యమితో సరి కొత్త నామంతో
ప్రతీ వత్సరం మన సంస్కృతి -సంప్రదాయాలతో 
నిత్య నూతన ,మంగళకర మహోత్సవం ఈ ఉగాది 
- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్ 
(21. 03. 2017) 







Related Posts:

  • కవిత(360)కవిత ఓ కవితఅందమైన వనితనీ పేరులో ఉంటుంది బావాత్మకతనిన్ను చూడగా ఎదలో ఏదో కలవరింతనీ స్నేహంతో మొదలైంది నాలో పులకరింతఆగదేమో ఇప్పట్లో ఈ కేరింతఅలజడిలా అనిపిస… Read More
  • ప్రేమ సిద్దాంతం (359)ప్రేమ సిద్దాంతం ప్రేమించేటప్పుడు నువ్వే నా ప్రాణమనిపిస్తుందిప్రేమలో ఉన్నప్పుడు నువ్వే నా సర్వమనిపిస్తుందిప్రేమలో గెలిస్తే ,కల నిజమైంది అనిపిస్తుం… Read More
  • ఎవర్రా మీరంతా (363)ఎవర్రా మీరంతా! నీ పుట్ట - పొట్ట నువ్వు చూసుకోకుండాఎదుటివాడి తలరాత మారుద్దామనుకుంటావానీ గొప్పలు - నువ్వు చెప్పుకో అబ్బీఎదుటివాడి తిప్పల లెక్కలు నీ… Read More
  • ప్రేమ-పిలుపు (361)ప్రేమ-పిలుపు కమ్మని కల - కౌగిలికి చేరే వేళఉదయించే కిరణం - వెలుగుని ప్రసాదించే వేళఆ హాయిని ,ఉషోదయానికి స్వాగతం చెప్పలేకవిఘాతం కలిగించిన విఘాతకుడిన… Read More
  • భయంలోనే మనం (362) గతాన్ని తలుచుకుంటూవర్తమానాన్ని వృధా చేయరాదువర్తమానంలో కాలయాపన చేస్తూభవిష్యత్తుని కాలరాయరాదు నువ్వు భ్రమ పడిన సంఘటనలనుంచినువ్వు భయపడిన ఘట్టం… Read More

0 comments:

Post a Comment