Tuesday, 28 March 2017

కవిత సంఖ్య : 280* హేవిళంబి ఉగాది శుభాకాంక్షలు *

కవిత సంఖ్య : 280

* హేవిళంబి ఉగాది శుభాకాంక్షలు *

మావి కొమ్మలు
మల్లె రెమ్మలు
కోయిలమ్మలు
లేలేత చిగురులు

వేప పువ్వులు
చెఱుకు గడలు
బంతి- చేమంతులు
పుడమి తల్లి కాంతులు

తొలకరి జల్లులు
విరిసిన హరివిల్లు
ముంగిట్లో రంగవల్లిలు
అంబరాన మెరిసిన శోభలు

కోవెల గంటలు
రమణుల వంటలు
షడ్రుచుల సమ్మేళనాలు
వేద పఠనాలు
పంచాగ శ్రవణాలు
పర్వదిన సంబరాలు

స్వాగతాలు
స్వగతాలు
నవ వసంతాలు
కొత్త ఉత్సాహాలు

పచ్చదనాలు
ప్రకృతి రమణీయాలు
మామిడి తోరణాలు
ప్రతీ ఇంట ఉత్సావాలు
ఈ 'ఉగాది 'ఉషోదయాలు

శ్రీ హేవిళంబి
నామ సంవత్సర
శుభాకాంక్షలు ......

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు

Related Posts:

  • కవిత నెం :324(నా అభిలాష) కవిత నెం :324 *నా అభిలాష * ఊసులాడుటకు ఊసు కావలెయును నిన్ను పొగడుటకు ప్రాస కావలెయును మిస మిస మనే నీ నొసల మధ్యన ఎర్రటి తిలకమై నుదురు కావలెయును నీ క… Read More
  • కవిత నెం :323(ప్రియ మధనం) కవిత నెం :323 *ప్రియ మధనం * పిలిస్తే పలుకుతావు పలకరించే పిలుపునివ్వవు అందుకోమని చేయినిస్తావు నీ చేతివేలు చివర్నైనా తాకనివ్వవు ముద్దమందారంలా మెరిసి… Read More
  • కవిత నెం :306(ప్రేమ సంకెళ్లు) కవిత నెం :306 * ప్రేమ సంకెళ్లు * ప్రతీ ప్రేమ నేడు పంతమే కాదు తన ప్రేమని కూడా బాధ్యతతో నడుస్తుంది తాను రాజీ పడుతూ త్యాగాన్ని తెరలా అడ్డం పెడుతుంద… Read More
  • కవిత నెం :288(నీ ప్రేమలో నా గమనం) కవిత నెం :288 * నీ ప్రేమలో నా గమనం * నిన్ను చూస్తే నా కలం సాగుతుంది నిన్ను చూసాక నా కవిత పొంగుతుంది నీవున్న చోట ప్రేమ పరిమళిస్తుంది నీతో కలిసి నడిచే… Read More
  • కవిత నెం :335 (అన్నపూర్ణా - వందనం ) కవిత నెం :335 అన్నపూర్ణా - వందనం అమ్మలగన్నమాయమ్మ ఏ దీవెన దక్కిందోయమ్మ ఏ దేవత వరమైనవమ్మా మా తల్లి డొక్కా సీతమ్మా మా పాలిట అన్నపూర్ణమ్మ మా ఆకలి తీర్… Read More

0 comments:

Post a Comment