Wednesday 28 October 2015

కవిత నెం 201(అప్పుల తిప్పలు)

కవిత నెం :201

'అప్పుల తిప్పలు ''

అప్పుల తిప్పలు 
ఇవి ఎవ్వరికే చెప్పుడు 

ఆదియందు అందంగా 
రాను రాను భారంగా 

మన ఆలోచనలను ఘోరంగా 
అంతరాత్మలో కలత నిరంతరంగా 

నిద్రవచ్చినా పోనీయ'కుండా 
ఆకలివేసినా తిననీయకుండా 

వెక్కిరిస్తుంటుంది వెటకారంగా 
వేడుక చూస్తుంటుంది వినోదంగా 

జీవితానికి అవసరం డబ్బైతే 
అవసరమైన వేళ అది సర్దుబాటుకాకపోతే 
నేనున్నా అంటూ ''స్నేహమై '' నిన్ను చేరేదే అప్పు 

ఒకప్పుడు అప్పు దొరకటం చాలా కష్టమే 
ఇప్పుడు తలుచుకుంటే చాలు తలుపు తడుతుంది 

అది తీర్చేంత వరకు నిన్ను వెంబడిస్తుంది 
అందరికీ సులువు కాదు అప్పుల్ని తీర్చటం 

అప్పు చేసి తుర్రు మనే వాళ్లు ఉన్న ఈ కాలంలో 
అప్పు చేసి బోరు మని ఆత్మాహుతి చేసుకునే వాళ్లు ఉన్నారు 

క్రమంగా అప్పును మాపుకునే వారు  ఉన్న ఈ కాలంలో 
అక్రమంగా చేసిన అప్పుకు వడ్డీ బాదే వారూ ఉన్నారు 

అందుకే అప్పంటే భయపడి దూరంగా ఉండేవాళ్లు ఉంటే 
అవసరానికి తప్పక అప్పు చేసి ఇరుక్కునే వాళ్లు కొందరు 

ఏదైనా ఇది అమృతమే తీర్చగల్గే సమర్ధత ఉంటే 
మన అసమర్ధతతో భుజాన వేసుకుంటే ఇక విషమే 

మన అవసరం తీరటానికి చెయ్యాలి 'ఋణం '
అప్పుతో చెలగాటమాడితే మన జీవితమే 'రణం '

అప్పు చేసి పప్పు కూడు అన్నమాట ఏమోగాని 
అప్పు చేసి ముప్పు కూడరాదు నిజమేమో 

అప్పుతో తప్పు చెయ్యకు 
అది నిప్పై నిన్ను దహించేస్తుంది 



Tuesday 27 October 2015

కవిత నెం 200:గుండె చప్పుడు

కవిత నెం :200

గుండె చప్పుడు 

నాలో నేనే నీలా 
నీలో నీవే నాలా 
ఒక్కసారిగా ఒక్కటై 
ప్రతిస్పందన మొదలై 
మనలో మనమే చేరగా 

ఏమంటారు దానినే 
గుండె చప్పుడు ... గుండె చప్పుడు 

నీ ఆలోచనలో నేనే ఉండగా 
నా ఆలోచనలో నీవే నిండగా 
నా కనులలో వెలుగు నీవేగా 
నీ శ్వాషలో ఊపిరి నేనుగా 

ఒకరికి ఒకరం 
ఒక్కసారిగా ఇద్దరం 


అంటారేమో దీనినే 
గుండె చప్పుడు ... గుండె చప్పుడు 

నీ వెళ్లే చోటనే నేనే రానా 
నే నడిచే బాటలో అడుగివి నీవుగా 
వింటున్నా నీ పేరే ఒక సంగీతంలా 
నీ పిలుపే నాకు ఒక ఆలాపంలా 

ఒకరిలో ఒకరం 
అర్ధసగమై ఇద్దరం 


అంటారేమో దీనినే 
గుండె చప్పుడు ... గుండె చప్పుడు 


నా మనసులో మాటే నీదిగా 
నీ మనసున్న చోటే నాదిగా 
నీ చేతిలో ఉండే రేఖలా 
నా నుదిటిన ఉండే గీతలా 

ఒకరై మనం 
ఒకరికోసం ఒకరం 


అంటారేమో దీనినే 
గుండె చప్పుడు ... గుండె చప్పుడు 




Sunday 25 October 2015

కవిత నెం 199:అసమాంతరాలు

కవిత నెం :199
*అసమాంతరాలు *
  1. అక్షరాలు రేకుండా పదాలు సమకూర్చలేము 
    అవాంతరాలు లేకుండా గమ్యం చేరలేము 
    ఏది ఏమైనా నిజాన్ని నమ్మలేము 
    అనుకున్నది ఏమైనా జరగకుండా ఆపలేము 
    నిరీక్షణ ఏమైనా ఫలితాన్ని మార్చలేము 
    జరిగిన దానిని తలుచుకుంటూ 
    జరగవలసినది ఆలోచిస్తూ 
    ప్రస్తుతంలో ఏమి చేయలేని అయోమయంలో 
    ఎందుకు  నేస్తం నీవుండాలి 
    నిన్న అనేది ఓ పునాది 
    చేదు అనేది రుచి కి ప్రతి నిది 
    తెలుసుకోవటానికి అడుగు ముందుకు వెయ్యి 
    అనీ తెలిసినట్టుగా ఉండటం మర్యాద కాదోయి 
    జీవితం అనేది ఒక్క గతంతో ఆగేది కాదోయి 
    జీవితం అనేది ఒక్క నిర్ణయంతో నిలిచిపోదోయి 
    నువ్వంటూ ఉన్నందుకు 
    నీకోసం మరొకటి ఉంటుంది 
    ఒకచోట నీకు లబించనిది 
    మరోచోట నీకోసం వేచి యుంటుంది 

కవిత నెం 198:మౌన శబ్దం

కవిత నెం :198
*మౌన శబ్దం *
  1. కలలు అలలై కావ్యమై 
    కురిసినవి వర్షపు చినుకులై 
    కదిలించే నాలో తలపులే 
    కదిలోచ్చే నాతొ ఊహలే 
    ఎదలో చెరుగని గుర్తులే 
    వికసించే నేటి కుసుమమై 
    మెరిసింది మెరుపు కాంతియై 
    రమ్మంది పిలుపు గమ్యమై 
    ఆగింది నా మనసు నిశబ్దమై....  నిశబ్దమై ............ 

కవిత నెం 197:ఒకరిలో ఒకరం

కవిత నెం :197
*ఒకరిలో ఒకరం *


నువ్వున్నావులే నా కోసమే 
నా జన్మాంతము నీతో సాగులే 
నింగీ నేలకు దూరం కరిగెనే 
నిన్ను కలిసిన వేళలో నే లోకం మరుచులే 

ఎదలో ఏదో ఆశ 
నా కలలో నిన్నే తలచా 
ఏ క్షణము విడువని శ్వాస 
నిన్ను చూసి కదిలేను తెలుసా 

ఎవరికెవరు తెలియని
ఏమౌతామో మనకని 

అని తెలిసి తెలియని తరుణం 
నిన్ను పరిచయం చేసిన సమయం 

ఎంతో ఇష్టమే నిన్ను చూసిన క్షణము 
ఏ అదృష్టమో చెలి నీతో బంధము 

ఒకరికి ఒకరం ఊపిరని 
నువ్వోచ్చాకే తెలిసేనని 

తడబడి తడబడే మనసులలో 
కనపడని మౌనం దాగేనని 

ఇదియే ప్రేమని -మనకోసం వుందని 
ఏ విధి రాతయో -వరమై ఉందని  

కవిత నెం196:దాచుకున్న మనసు

కవిత నెం :196
* దాచుకున్న మనసు  *

నేనంటే  ఇష్టాన్నీ నీలో దాచుకుంటావా 
నేనే నీ ప్రాణమని నాకు తెలియదంటావా 

మాట తెలిపే వేళ మౌనమెందుకే 

నీ మనసు తెలుసే బాల కోపమెందుకే 

బంగారం నిన్నోదిలి నేను ఎలా ఉండనే 

పెంచుకున్న ఈ దూరంలో నువ్వు ఏమి అవుతావే 

నీ కళ్ళలోన నా రూపం - కనపడుతుంది 

నీ కనుపాప దానినేమో కప్పి వుంది 

నీ పెదవులలో నా పేరు దాగివుంది 

నా పిలుపు కోసం అది వేచియుంది 

బంగారం ఈ నిముషం ఏమి తెలియదంటావా 

నీ కోసం ఆకాశమై ఎదురు చూడమంటావా 

నీ గుండెలోన మనప్రేమ నిలచివుంది 

ఎందుకనో మది దాటి రాను అంది 

చిన్నారి నీ స్నేహం - జతకమ్మంటుంది 

దానికేమో నీ హస్తం -అందనంటుంది 

బంగారం ఎన్నాళ్ళిలా మన ఒంటరి పయనం 

ఇకనైనా క్షమించమ్మా నా చిన్ని హృదయం 

కవిత నెం195:మరో జన్మంటూ ఉంటే

కవిత నెం :195

మరో జన్మంటూ ఉంటే 

మరో జన్మంటూ నాకు ఉంటే 
నేనిలాగే మనిషిలానే జన్మించాలి 
ఈ జన్మలో ఉన్నవాళ్ళు నాకు మరో జన్మలోనూ కావాలి 
నేను కోల్పోయిన వాళ్ళను మరో జన్మలో చూడగలగాలి 
అమ్మప్రేమ ఇలానే నాకు తోడుండాలి 
రాజును కానక్కరలేదు కాని సంపన్నుడిని కావాలి 
రాజ్యాన్ని పాలించనక్కరలేదు ఉన్నతంగా జీవించాలి 
మహోన్నతుడిని కానాక్కరలేదు  మానవత్వం ఉంటే చాలు 
చిరంజీవిని కానక్కరలేదు చిరునవ్వుతో బ్రతికితే చాలు 
సొంత ప్రయోజనాలకు లోబడని నిస్వార్డుడిని అయితే చాలు 
పరాక్రమవంతుడుని కానక్కరలేదు గుండె దైర్యం ఉంటే చాలు 
పిరికితనం అసలే వద్దు భయం తెలియనివాడిగా ఉంటే చాలు
మరీ సుఖాలను చూడనక్కరలేదు కష్టాలు ముంచకుండా ఉంటే చాలు 
భాద కలగకూడదని అనటంలా సమస్యలను అదిగమించగల్గితే చాలు  
మరీ అందంగా పుట్టక్కరలేదు మనసు నిర్మలంగా ఉంటే చాలు 
మేధావిని కానక్కరలేదు ప్రపంచ జ్ఞానం తెలిస్తే చాలు 
పండితుడిని కానక్కరలేదు అన్ని కళల్లో నైపుణ్యత ఉంటే చాలు 
ఒకరికి ద్రోహం చేయకుండా ,మంచి స్నేహం పొందగల్గితే చాలు 
అతిగా శ్రమపడకుండా కంటికి కునుకు ఉంటే చాలు 
ఒకరికోసం ఎదురుచూడకుండా నా పనులు నేను చేసుకుంటే చాలు 
మంచి ,చెడు ఆలోచించకుండా ఒకరికి సాయం చెయ్యగల్గితె చాలు 
సమాజాన్ని ఉద్దరించనవసరంలా నలుగురికి మేలు చెయ్యగల్గితే చాలు 
కోరుకున్నది జరుగకపోయినా నిరాశ వెంటాడకుంటే చాలు 
శత్రువులు లేకుండా అందరికీ మంచి మిత్రుడినయితే చాలు 
నా కంటూ ,నన్ను అభిమానించే వాళ్లు నా కోసం ఉంటే చాలు 
మరీ సన్యాసి లా మారక్కరలేదు దేవుడంటే భక్తి ఉంటే చాలు 
నా వ్యక్తిత్వం నాలానే ఉండాలి మరొకరిని గౌరవించగల్గితే చాలు 
మేడలు ,మిద్దెలు ఉండనవసరం లేదు నాకంటూ ఒక ఇల్లు ,పొలం  ఉంటే చాలు 
ఎటువంటి భాదరబందీలు లేకుండా నా జీవితం కొనసాగితే చాలు 
ఒక హిందువుగా ,ఒక కవిగా బ్రతికినంత కాలం చాలు 







Friday 23 October 2015

కవిత నెం 194:నేటి స్నేహ వైఖరి

కవిత నెం  :194

''నేటి స్నేహ వైఖరి  ''


ప్రతీ మనిషికీ అలవాటు ''స్నేహం ''

ప్రతీ మనిషికీ అవసరం ''స్నేహం ''
స్నేహం పేరుతోనే ఒకరికి ,ఇద్దరవుతుతారు 
ఆ ఇద్దరూ ,ఇరవై ,వందలవుతుంటారు 
అంతా బాగానే ఉంటుంది 
మన అవసరం ,ఆనందం కోసం ''స్నేహం '' అవసరమే 
మన కష్ట -సుఖాలను పంచుకునేది ఒక్క ''స్నేహితుల'' తో మాత్రమే 
ఆ స్నేహం పద్దతిగా ,హుందా తనంగా ఉంటే మంచిదే 
ఆ స్నేహం చిక్కగా ,చక్కగా బలపడితే ఇంకా మంచిదే 
ఇకపోతే కబుర్లు ,కాకరకాయలు అన్నీ పంచుకున్నాక 
ఏమి చెయ్యాలో తెలియక కొత్త మోజు ,జబ్బు పుడుతుంది 
ఒకరిలో ఒకరు లీనమయ్యిపోవటం 
ఒకరిని ,ఇంకొకరు విడిచియుండ లేకపోవటం 
అలా అలా ప్రత్యెక ఇష్టంగా కులం ,రంగు అంటూ ప్రాంతీయ బేదాలతో 
వాళ్ల వరకు మాత్రమే ఆ స్నేహం తిరుగుతూ ఉంటుంది 
అలా అని కొత్త వారిని మాత్రం ఆహ్వానించకుండా ఉండరు 
వారిని కూడా ఆహ్వానించి ఇది మన సమూహం ,కుటుంభం అంటారు 
వారు వీళ్ళ పద్ధతులకి అలవాటుపడితే బాగానే ఉంటుంది 
వారి ,వీరి అభిప్రాయలు కుదరకపోతే మరలా స్నేహం వికటిస్తుంది 
స్నేహం ఒకరికోసం మాత్రమే పుట్టింది కాదు 
మన స్నేహం మన తోటివాళ్లకు మాత్రమే రాసిచ్చింది కాదు 
స్వార్ధం లేని స్నేహాన్ని అందరికీ పరిచయం చెయ్యండి 
ఏ వివక్ష లేని స్నేహాన్ని స్వేచ్చగా ఎగరనివ్వండి 
ఆ స్నేహానికి ఒక గ్రూప్ అంటూ ,
ఆ స్నేహాన్ని ఒకే భాష వారమంటూ , ఒకే జాతివారమంటూ 
ఆ స్నేహాన్ని ఒకే ప్రాంతానికి చెందిన వారమంటూ 
ఆ స్నేహాన్ని ఒకే కులపు రుచి ఎరిగిన వారమంటూ 
ఆ స్నేహానికి దిశ ,దశ చేసే నాయకత్వం ఉంది అంటూ 
ఒకటే పార్టీ అంటూ ,మన వరకే మనము అంటూ 
తోక్కెయ్యకండి  చిగురించే స్నేహాన్ని 
మార్చెయ్యకండి ''స్నేహానికి '' ఉన్న నిర్వచనాన్ని 
మన స్నేహం పవిత్రమై ,సర్వమత సమ్మతమై ప్రవహించాలి 
మన స్నేహం ప్రశాంతమై , కోవెల లాంటి నిలయం కావాలి 
ఏ కల్మషాన్ని ,కాలుష్యాన్ని స్నేహానికి అంటించనీయకు 
కలుపుగోలుతనంతో ''స్నేహం ''లో ముందుకెళ్ళు 
నీవు అందరికీ దగ్గరవుతూ ,మరొకరిని ఒంటరిగా చెయ్యకు 
స్నేహం మనలో నుంచి పుడుతుంది 
స్నేహం మనల్ని చూసి పుడుతుంది 
కాని ఆ స్నేహాన్ని ,స్నేహ గుణాన్ని మనతో అంతం చెయ్యవద్దు 

                                                       - గరిమెళ్ళ గమనాలు 




Wednesday 21 October 2015

కవిత నెం 193:సమాజపు పోకడ

కవిత నెం : 193


*సమాజపు పోకడ *
నమస్కారానికి ప్రతి నమస్కారం - అది సంస్కారం 
ఆ నమస్కారాన్ని పాటిస్తున్నదెవరు ?
అదే సంస్కారం అని గుర్తిస్తున్నదెవరు ?

హాయ్ అని ,నమస్తే అని , సలాం అని 
తెలుగు భాషని ,సాంప్రదాయాన్ని పక్కన పెట్టి 
పొడి పొడి అక్షరాలను చేర్చి , సాగించుకుంటున్నారు 

నువ్వు ఎదుగుతున్న కొద్దీ ,నీలో మార్పు ఉంటుంది 
మరి నువ్వు నేర్చిన మాటలకెందుకు మౌనముంటుంది 

సిల్లీగా సారీ అంటారే ,క్షమించు అంటానికి శ్రమనా నీకు ?
ఓహ్ థాంక్యూ అంటారే ,ధన్యవాదముకు దండాలు ఎందులకు ?

ప్రతీ పదం ఆంగ్లం , ప్రతీ పద్దతిలో వెస్ట్రన్ 
బుద్దిగా బొట్టు పెట్టుకోవటం మరిచారు 
పద్దతిగా జుట్టు దువ్వుకోవటం విడచారు 
నీటుగా బట్టలు ధరించడాన్ని ఉతికారేశారు 

అడగకుండా సహాయం చెయ్యం అది మన రోగం 
అడిగినా సహాయం చెయ్యలేని అంధకారం 
పొరపాటున సహాయం చేసినా గుర్తించలేని అహంకారం 

మానవత్వం ఉంటుంది కాని మనకు హృదయమే ఉండదు 
పైకి మాత్రం అయ్యో అంటూ , లోలోపలే తిట్టుకుంటాం 

సరిగ్గా నడవటం తెలియదు - నడిపించటం అస్సలే తెలియదు 
నేర్చుకోవటానికి బద్ధకం - నేర్పించటానికి నిశ్శబ్దం 

ఎందాకపోతారు మీరిలా ఒకే రైలు పట్టాలల్లే 
మీ చుట్టూ జరిగేది అంతా - ఎండమావుల నీడలే 

మీరు మనిషైతే - మనిషంటూ మీకు మీరు గుర్తించండి 
మీకు మనసంటూ ఉంటే - మరొకరిని సాటి మనిషిలా చూడండి 

- గరిమెళ్ళ గమనాలు 

Tuesday 20 October 2015

కవిత నెం 192:నువ్వే నాకు - నీవే నాకు

కవిత నెం :192

నువ్వే నాకు - నీవే నాకు 

నేనెక్కడున్నా 
నాతోనే ఉంటూ 
నా పక్కనే ఉంటూ 
నాలో సగమై ఉంటూ 
నేను పాలు అయితే 
తను నీళ్లు లా ఉంటూ 
నేను జీలకర్ర అయితే 
తను బెల్లం లా ఉంటూ 
నేను నీడ అయితే 
తను తోడుగా ఉంటూ 
నాకు స్నేహితురాలిలా 
నా ప్రియురాలిలా 
నా హృదయంలా నన్నంటి ఉంటూ 
అమ్మ తర్వాత అమ్మంత ప్రేమ చూపిస్తూ 
నా బాధ్యతను పంచుకుంటూ 
నా కష్టాలకు ఓదార్పునిస్తూ 
నా ఇష్టమై నాలో ఐక్యమై ఉంటూ 
నా భాదను మరిపిస్తూ 
నాకు సంతోషాన్ని కలిగిస్తూ 
నేను చేసే ప్రతి పనిలో శ్రమయై ఉంటూ 
నేను చూపించే ప్రేమలో ఆ ప్రేమను తిరిగిస్తూ 
నేను ఓడానంటే  'ఓటమి ' కారణం నేనే కావచ్చు 
కాని నా గెలుపులో ఉండేది మాత్రం తానే 
అహంకారం నాకుందో లేదో తెలియదు కాని 
మమకారాన్ని మాత్రం మధురంగా అంటించింది 
నా కోపం ,ప్రకోపమై  ప్రకంపనలు చెందకుండా 
చిరునవ్వుతో చల్లార్చి నాకు సేద తీరుస్తుంది 
నా ప్రేమ నిజమని తెలిసినా ,తన భయము తనకుంటుంది 
ఆ భయము ఆపార్ధంలా మారకుండా ,అనురాగమై కురుస్తుంది 
నీ చిటికిన వేలు పట్టి - నా చేయి అందించాను 
ఈ జన్మాంతము నిన్ను వదులుకోను 
ఏ జన్మకైనా - నువ్వుంటే చాలు 
ప్రతి జన్మలోనూ అమ్మ ప్రేమ ,నీ ప్రేమ నాకుంటే చాలు 

Tuesday 13 October 2015

కవిత నెం191:అల్ప సంతోషి

కవిత నెం :191

*అల్ప సంతోషి  *
ప్రపంచం చాలా పెద్దది 
దానిలో మన ఆలోచనలు అనంతం 
అంతా మనమే అనుకుంటూ ఉంటాం 
కాని మనల్ని బొమ్మగా చేసి ఆడుకుంటారు 
జీవితం అంటే ఇంటే ఒక చదరంగం 
ఆడదాం ఓడిద్దాం అని మొదలెడతాం 
గెలుపు వరకు వెళ్తాం ఓడించబడతాం 
గెలిచినా మన గెలుపులో మరొక హస్తం 
ఆనందిస్తాం సంతోషం వస్తే 
బాదపడతాం విచారమనిపిస్తే 
కాని రెండింటినీ ఒకేలా స్వాగతించం 
స్నేహమనుకుంటాం ...బంధం అనుకుంటాం 
అంతా మనవారే అనుకుంటుంటాం 
మనతోటి కలిసి ,మనవెంటే తిరిగి 
మనమంతా ఒకటే అని నమ్మించబడతాం 
మనం జనంలో కలిసి మనం మనలానే మిగులుతాం 

కవిత నెం 190:పేగుబంధానికి విలువెక్కడ ?

కవిత నెం :190

పేగుబంధానికి విలువెక్కడ ?

అమ్మా నాకు చిన్న నలతగా ఉంటే 

నువ్వు కలత చెంది ,కన్నీళ్లు పెట్టుకునేదానివి 

అమ్మా నేను అడగకుండానే 

నాకు ఆకలివేస్తుందని గ్రహించి నా బొజ్జ నింపేదానివి 

చిన్నప్పుడు ఒక నిముషం నువ్వు కనపడకపోతే 

కిందపడి ,వెక్కి వెక్కి ఏడ్చే వాడిని 

నిన్ను విడిచి దూరంగా ఉండాల్సి వస్తే 

బెంగ పెట్టుకుని ,నీ కోసం ఎదురు చూసేవాడిని 

నాకు భయమనిపిస్తే 

నీ ఒళ్లో తలపెట్టి దాక్కుండేవాడిని 

నాకు నిద్దుర రాకపోతే 

నీ జోల పాట వింటూ హాయిగా నిద్రపోయేవాడిని 

నువ్వంటే ఎంతో ఇష్టం కదా నాకు అప్పుడు 

ఎందుకంటే నాకు నువ్వు తప్ప ఎవ్వరూ తెలియదు కదా 

నువ్వెప్పుడూ నాకెదురుగా కనిపించాలనుకునేవాడిని అప్పుడు 

నీ తోడు లేకుంటే నేనేమౌతానో అన్న భయం కాబోలు 

నాకు చెమట పట్టకుండా చూసుకునేదానివి 

నీ రెక్కల కష్టంతో నాకు లోటు రాకుండా చూసుకున్నావు 

నీ గోరు ముద్దలతో ,నీ చేతి కమ్మదనం తెలియచేసావు అప్పుడు 

నీకు ఇష్టమైన వాటిని తినలేక పోతున్నావు ఇప్పుడు 

నాకోసం నీ కడుపు మాడ్చుకునేదానివి 

నాకు కావాల్సింది మాత్రం వెంటపడి మరీ పుచ్చుకునే వాడిని 

నీ కష్టాన్ని లెక్కచేయకుండా సుకుమారంగా నన్ను పెంచావు 

నీకు కష్టమని ఏనాడైనా నా మనసు ఆలోచించిందా చెప్పు 

నీకు నేనంటే చాలా ఇష్టం కదూ అమ్మా 

దానికోసం ,నాకు కష్టమంటూ తెలియకుండా చేసావు 

నీ ప్రాణం ,నీ ప్రపంచం నేనే కదూ 

మరి ఎందుకమ్మా నా ప్రాణం ,సర్వం అంటూ మరొకరిని ఇచ్చావు 

నాకోసం ఎన్నో అవమానాలు భరించావు 

మరి ఒక్కమాట నువ్వు నన్నంటే  ఎందుకు తట్టుకోలేను 

నేను గొప్పవాడిని కావాలని 

నవ్వు నీ జీవితాన్నే త్యాగం చేసి నాకు వారధిలా నిలచావు 

మరి నా కాళ్ల మీద నేను బ్రతకటం నేర్చాక 

నిన్నెందుకు అమ్మా ప్రేమగా చూసుకోలేకపోతున్నాను 

నేను పెద్దగా చదువులేకపోయినా , జీవితాన్ని చదివించావు 

అందమయినా ప్రపంచం లేకపోయినా ,అవకాశం ఇచ్చావు 

నాకోసం నీకు నువ్వే .... కంటి పాప లా మారావు 

నీ ఓర్పు ,నేర్పులతో ..... నన్నింత వాణ్ణి  చేసావు 

ప్రతీ క్షణం నిన్నే పలకరించేవాడినే 

ఈ కాలంతో ప్రయాణిస్తూ రోజుకోమారు పలకరిస్తున్నాను 

నన్నెంతో భాద్యతగా ,క్రమ శిక్షణ గా పెంచావే 

నిన్ను నా భాద్యత అని ఎందుకు తలంచలేకపోతున్నాను

నీ మాటలు ఒకప్పుడు ముద్దు నాకు 

మరి పదే పదే నువ్వు నాకోసం చెప్తుంటే వినలేకపోతున్నాను ఎందుకు ?

అబద్దం ఆడి ఎరుగను కదా నీ దగ్గర ఒకప్పుడు 

నేను బరువు ,బాధ్యతలు మోసేసరికి నిజాన్ని మాట్లాడలేకపోతున్నా నీ ముందు 

నీ చెంత ఉంటే అదే సంతోషం నాకు అప్పుడు 

నీకు దూరంగా ఎలా ఉండగల్గుతున్నా ఇప్పుడు 

నువ్వంటే ఇష్టమంటూ చెప్పుకోవటం తప్ప 

నిన్ను ఇష్టంగా చూసుకోవటం తెలియదా అమ్మా నాకు  

నీకు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే 

నేనెలా హాయిగా నిదురించగల్గుతున్నాను 

నువ్వంటే నాకెంతో గౌరవం ,ప్రేమ అమ్మా 

నీవు లేకపోతే అవి నాకు దక్కవు అమ్మా 

నీ దీవెన నాకు బలం అమ్మా 

మరి నీవు కోరుకున్నది నేను చేయగల్గుతున్నానా ?

కాలం పరీక్షించవచ్చు అమ్మా 

నన్ను మాత్రం అపార్ధం చేసుకోకమ్మా 

నీ క్షేమమే నాకు సంతోషం 

నీ ఆజ్ఞ యే నాకు శిరోధార్యం 

ఇవి మాటల్లో చెప్పటానికే బాగుంటాయి 

మన నిజ జీవితంలో ఆచరణలో అమ్మ పై ప్రేమ చూపిస్తే ఇంకా బాగుంటాయి 

- గరిమెళ్ళ గమనాలు 




Monday 12 October 2015

కవిత నెం189(ఆదిపత్య పోరు)

కవిత నెం :189

ఆదిపత్య పోరు 

నేనంటే నేను అంటూ 
నేనేలే ముందు అంటూ 
నా పేరే ఉండాలంటూ 
నన్నే అందరూ కీర్తించాలంటూ 
ప్రతి మదిలో దాగుంటుంది గుట్టు 
పైకి  ప్రేమ ,అభిమానం చూపించుకుంటూ 
ఎటువంటి భేషజాలకు చోటులేదంటూ 
''నేనే '' అన్న అహంకారాన్ని పూసుకుంటూ 
''నేనే'' అన్న స్వార్దాన్ని అంటించుకుంటూ 
ఉండలేరుగా ఒకరంటూ ఊరకిట్టూ 
ప్రతీ కులానికి ఉంటుంది ఒక గట్టు 
ప్రతీ ప్రాంతానికి ఉంటుంది ఆనకట్టు 
ప్రతీ మనిషీ వాటితోనే చేస్తుంటాడు కనికట్టు 
ఎందుకో తెలియని ఆకాంక్షను పెంచుకుంటూ 
సమాజంలో పనికిరాని గుర్తింపుని పెంచుకుంటూ 
సభలు ,సమావేశాలు అంటూ ఎన్నో వేషాలు మొదలెట్టు 
రాజకీయంలోనే కాదు జీవితతంత్రాలు తెలిసినట్టు 
ప్రతీ స్నేహంలోనూ చిగురిస్తుంది ''నేను '' అనే చెట్టు 
ప్రతీ రంగంలోని మిగతావారిని అణగదొక్కేట్టు 
మేముసైతం అంటూ ''నేను '' మాత్రానికే చోటు ఉండేట్టు 
ఎందుకీ ''నేను'' అనే ఏకపక్షదోరణి పుట్టేట్టు 
మనిషి ,మరో మనిషినీ మానసికంగా చంపుకు తినేట్టు 
ఇదే ఆదిపత్య పోరు     

- గరిమెళ్ళ గమనాలు 


Wednesday 7 October 2015

కవిత నెం188:గురువారం

కవిత నెం :188

గురువారం 


గురువారం 
గురు బలం ఉన్న వారం 
శ్రీ సాయి కాటాక్షం పొందే వారం 
ఇది లక్ష్మీ వారం 
లక్ష్య సిద్ది కలిగే వారం 
అనుకూలమైన వారం 
ఇది ఆనంద సాయి వారం 
మన గుండె నిండే వారం 
గురు భక్తికే గురువారం 
శ్రేష్టమైన వారం 
ఇది సాయి సన్నిధానం 
మహిమ గల వారం 
మహోన్నతమైన వారం 
అందరికే ప్రియమైన వారం 
నాకెంతో నచ్చే వారం 
అందుకే ఇది గురువారం 


Thursday 1 October 2015

కవిత నెం187:ఎక్కడికి వెళ్తున్నాం మనం

కవిత నెం :187




''ఎక్కడికి వెళ్తున్నాం మనం''

మనం పుట్టక ముందు ప్రకృతి అంటే పులకరించే వాళ్లం  

నేడు మన అవసరాల కోసం కాలుష్య సహవాసం చేస్తున్నాం 
ఒకప్పుడు అన్నం ,ఆవకాయ ముద్దతో ఆకలి విలువ తెలుసుకున్నాం 
ఇప్పుడు ఫీజా ,బర్గర్స్ అంటూ మన శరీరాన్ని చెత్తతో నింపుతున్నాం 
నిజాయితీ ,నిబద్దత అంటూ ఆ చదువులోనే నేర్చుకున్నాం 
మనం బ్రతకటానికి ఏ  బీతి లేకుండా తప్పు దోవలో పోతున్నాం 

మన తల్లిదండ్రుల ప్రేమలో ఎంతో ఎదుగుతూ వస్తున్నాం 

మనవారిని మరచి ,మన దేశం విడచి ఆనాధలుగా ఉంటున్నాం 
బడిలో చదివన వారమే ,పద్దతిగా సంస్కారం నేర్చుకున్నాం 
నేడు కాన్మెంటులంటూ ,ఇంగ్లీష్ బ్యాగ్ లతో సంసృతిని మారుస్తున్నాం 
అందరం కలిసి ఉండటమే ఐకమత్యం అని తలచేవారం 
ఏ మతమంటూ ,కులమంటూ బేధాలు లేకుండా పెరిగిన వాళ్లం  
పక్కవారితో  కూడా మనస్పూర్తిగా మాట్లాడలేక దాక్కుంటున్నాం 

కులమంటూ ,కుళ్లుకుంటూ కుమ్ములాటకు పోతున్నాం 

కల్మషం లేని హృదయంతో పవిత్రంగా స్వాగతించుకునేవాళ్లం 
చిన్న పెద్దా అంటూ గౌరవం మరచి ,దుర్భాషలాడుతున్నాం 
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేగా చదువుకున్నాం 
మరి మనం  ఎదుగుతున్నకొద్దీ ,మిగతా వారని హేళన చేస్తున్నాం 
భారతీయులంటే సోదరి ,సోదరా భావంతోనే కదా అభిమానించాం 
రాగింగ్ అంటూ ,నీచ సంస్కృతి తో వెర్రితనంతో బ్రతుకున్నాం 

రైతు దేశానికి వెన్నెముక అంటూ గర్వంగా చెప్పుకుంటున్నాం 

రియల్ ఎస్టేట్స్ అంటూ మన పంట భూములని మనమే చంపుతున్నాం 
సాఫ్ట్ వేర్స్ ,డాక్టర్స్ ,ఇంజనీర్స్ అంటూ భారానికి మించిన  చదువులు 
వాటికోసం ,భారానికి మించిన అప్పులతో ఈడ్చుతున్న బ్రతుకులు 
ఎవరి పంట వాళ్లు  తినే రోజులలో హాయిగా నిదురపోయేవాళ్ళం 
రాజీకీయ రాబందుల రాజ్యంతో నేడు ఆత్మహత్యలో నిదురపోతున్నాం 

మన దేశ స్వాతంత్రం ,స్వేచ్చ కోసం పోరాటాలు చూసియున్నాం 

మరి ఆ స్వేచ్చ సొంతమవ్వగా ,మన ఓటుతో  తాకట్టు ఎందుకు పెడుతున్నాం? 
అన్ని రంగాల వారికి ,ఆన్ని ప్రాంతాల వారికి వారధి భారతదేశం 
ఎన్ని ఉన్నా ,ఎంత సంపద ఉన్నా కాలేదా  పేదరిక నిర్మూలన దేశం ?
అందరం కలిసి చేసుకునే పండగలు ఎన్నో ఉన్న మన హిందూ సంప్రదాయంలో 
పార్టీలు ,పబ్ లూ  అంటూ వాటి వెంట అనవసర పరుగు లెందులకు ?

ఎంతో మంది ప్రతివ్రతలు పుట్టిన చరిత్ర కల మన భారతదేశం లో 

ఆడవారిని భానిసగా చేస్తూ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే వ్యభిచారగ్రుహాలెందులకు ?
పంచె  ,చీర విడచి విదేశీ వస్త్రాలంటూ ,వేలాడే దుస్తులకై మోజెందుకు ?
ప్రపంచ నలు మూలల ,మన దేశ సంసృతి ని ఖ్యాతిగా చెప్పుకుంటుంటే 
మనం మాత్రం మోడరన్ అంటూ ,మన ఆచారలని మార్చేస్తున్నాం 

ఎంతో అభివృద్ధి పదంలో మన దేశం ముందు కెల్తుంటే 

లేనివాడు ,ఉన్న వాడు ఇద్దరూ సమానంగా ఎదగలేక పోతున్నారెందుకు ?
మనం మారుతున్నాం ,మన దేశ సంస్కృతిని మారుస్తున్నాం 
కాని మన దేశం గర్వపడేలా ఎప్పుడు మనం మారటం 
మనలో మార్పు కోసం మరో సంఘ సంస్కర్త రాడు 
మనలో చైతన్యం కోసం మరో విప్లవం కూడా పుట్టుకు రాదు 
ఎదురుచూపులు మాని మన కర్తవ్యం మన చేద్దాం 
ఎప్పటికీ మనం భారతీయుడులానే జీవిద్దాం 

- గరిమెళ్ళ గమనాలు