Thursday 1 October 2015

కవిత నెం187:ఎక్కడికి వెళ్తున్నాం మనం

కవిత నెం :187




''ఎక్కడికి వెళ్తున్నాం మనం''

మనం పుట్టక ముందు ప్రకృతి అంటే పులకరించే వాళ్లం  

నేడు మన అవసరాల కోసం కాలుష్య సహవాసం చేస్తున్నాం 
ఒకప్పుడు అన్నం ,ఆవకాయ ముద్దతో ఆకలి విలువ తెలుసుకున్నాం 
ఇప్పుడు ఫీజా ,బర్గర్స్ అంటూ మన శరీరాన్ని చెత్తతో నింపుతున్నాం 
నిజాయితీ ,నిబద్దత అంటూ ఆ చదువులోనే నేర్చుకున్నాం 
మనం బ్రతకటానికి ఏ  బీతి లేకుండా తప్పు దోవలో పోతున్నాం 

మన తల్లిదండ్రుల ప్రేమలో ఎంతో ఎదుగుతూ వస్తున్నాం 

మనవారిని మరచి ,మన దేశం విడచి ఆనాధలుగా ఉంటున్నాం 
బడిలో చదివన వారమే ,పద్దతిగా సంస్కారం నేర్చుకున్నాం 
నేడు కాన్మెంటులంటూ ,ఇంగ్లీష్ బ్యాగ్ లతో సంసృతిని మారుస్తున్నాం 
అందరం కలిసి ఉండటమే ఐకమత్యం అని తలచేవారం 
ఏ మతమంటూ ,కులమంటూ బేధాలు లేకుండా పెరిగిన వాళ్లం  
పక్కవారితో  కూడా మనస్పూర్తిగా మాట్లాడలేక దాక్కుంటున్నాం 

కులమంటూ ,కుళ్లుకుంటూ కుమ్ములాటకు పోతున్నాం 

కల్మషం లేని హృదయంతో పవిత్రంగా స్వాగతించుకునేవాళ్లం 
చిన్న పెద్దా అంటూ గౌరవం మరచి ,దుర్భాషలాడుతున్నాం 
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేగా చదువుకున్నాం 
మరి మనం  ఎదుగుతున్నకొద్దీ ,మిగతా వారని హేళన చేస్తున్నాం 
భారతీయులంటే సోదరి ,సోదరా భావంతోనే కదా అభిమానించాం 
రాగింగ్ అంటూ ,నీచ సంస్కృతి తో వెర్రితనంతో బ్రతుకున్నాం 

రైతు దేశానికి వెన్నెముక అంటూ గర్వంగా చెప్పుకుంటున్నాం 

రియల్ ఎస్టేట్స్ అంటూ మన పంట భూములని మనమే చంపుతున్నాం 
సాఫ్ట్ వేర్స్ ,డాక్టర్స్ ,ఇంజనీర్స్ అంటూ భారానికి మించిన  చదువులు 
వాటికోసం ,భారానికి మించిన అప్పులతో ఈడ్చుతున్న బ్రతుకులు 
ఎవరి పంట వాళ్లు  తినే రోజులలో హాయిగా నిదురపోయేవాళ్ళం 
రాజీకీయ రాబందుల రాజ్యంతో నేడు ఆత్మహత్యలో నిదురపోతున్నాం 

మన దేశ స్వాతంత్రం ,స్వేచ్చ కోసం పోరాటాలు చూసియున్నాం 

మరి ఆ స్వేచ్చ సొంతమవ్వగా ,మన ఓటుతో  తాకట్టు ఎందుకు పెడుతున్నాం? 
అన్ని రంగాల వారికి ,ఆన్ని ప్రాంతాల వారికి వారధి భారతదేశం 
ఎన్ని ఉన్నా ,ఎంత సంపద ఉన్నా కాలేదా  పేదరిక నిర్మూలన దేశం ?
అందరం కలిసి చేసుకునే పండగలు ఎన్నో ఉన్న మన హిందూ సంప్రదాయంలో 
పార్టీలు ,పబ్ లూ  అంటూ వాటి వెంట అనవసర పరుగు లెందులకు ?

ఎంతో మంది ప్రతివ్రతలు పుట్టిన చరిత్ర కల మన భారతదేశం లో 

ఆడవారిని భానిసగా చేస్తూ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే వ్యభిచారగ్రుహాలెందులకు ?
పంచె  ,చీర విడచి విదేశీ వస్త్రాలంటూ ,వేలాడే దుస్తులకై మోజెందుకు ?
ప్రపంచ నలు మూలల ,మన దేశ సంసృతి ని ఖ్యాతిగా చెప్పుకుంటుంటే 
మనం మాత్రం మోడరన్ అంటూ ,మన ఆచారలని మార్చేస్తున్నాం 

ఎంతో అభివృద్ధి పదంలో మన దేశం ముందు కెల్తుంటే 

లేనివాడు ,ఉన్న వాడు ఇద్దరూ సమానంగా ఎదగలేక పోతున్నారెందుకు ?
మనం మారుతున్నాం ,మన దేశ సంస్కృతిని మారుస్తున్నాం 
కాని మన దేశం గర్వపడేలా ఎప్పుడు మనం మారటం 
మనలో మార్పు కోసం మరో సంఘ సంస్కర్త రాడు 
మనలో చైతన్యం కోసం మరో విప్లవం కూడా పుట్టుకు రాదు 
ఎదురుచూపులు మాని మన కర్తవ్యం మన చేద్దాం 
ఎప్పటికీ మనం భారతీయుడులానే జీవిద్దాం 

- గరిమెళ్ళ గమనాలు 






0 comments:

Post a Comment