Sunday 25 October 2015

కవిత నెం195:మరో జన్మంటూ ఉంటే

కవిత నెం :195

మరో జన్మంటూ ఉంటే 

మరో జన్మంటూ నాకు ఉంటే 
నేనిలాగే మనిషిలానే జన్మించాలి 
ఈ జన్మలో ఉన్నవాళ్ళు నాకు మరో జన్మలోనూ కావాలి 
నేను కోల్పోయిన వాళ్ళను మరో జన్మలో చూడగలగాలి 
అమ్మప్రేమ ఇలానే నాకు తోడుండాలి 
రాజును కానక్కరలేదు కాని సంపన్నుడిని కావాలి 
రాజ్యాన్ని పాలించనక్కరలేదు ఉన్నతంగా జీవించాలి 
మహోన్నతుడిని కానాక్కరలేదు  మానవత్వం ఉంటే చాలు 
చిరంజీవిని కానక్కరలేదు చిరునవ్వుతో బ్రతికితే చాలు 
సొంత ప్రయోజనాలకు లోబడని నిస్వార్డుడిని అయితే చాలు 
పరాక్రమవంతుడుని కానక్కరలేదు గుండె దైర్యం ఉంటే చాలు 
పిరికితనం అసలే వద్దు భయం తెలియనివాడిగా ఉంటే చాలు
మరీ సుఖాలను చూడనక్కరలేదు కష్టాలు ముంచకుండా ఉంటే చాలు 
భాద కలగకూడదని అనటంలా సమస్యలను అదిగమించగల్గితే చాలు  
మరీ అందంగా పుట్టక్కరలేదు మనసు నిర్మలంగా ఉంటే చాలు 
మేధావిని కానక్కరలేదు ప్రపంచ జ్ఞానం తెలిస్తే చాలు 
పండితుడిని కానక్కరలేదు అన్ని కళల్లో నైపుణ్యత ఉంటే చాలు 
ఒకరికి ద్రోహం చేయకుండా ,మంచి స్నేహం పొందగల్గితే చాలు 
అతిగా శ్రమపడకుండా కంటికి కునుకు ఉంటే చాలు 
ఒకరికోసం ఎదురుచూడకుండా నా పనులు నేను చేసుకుంటే చాలు 
మంచి ,చెడు ఆలోచించకుండా ఒకరికి సాయం చెయ్యగల్గితె చాలు 
సమాజాన్ని ఉద్దరించనవసరంలా నలుగురికి మేలు చెయ్యగల్గితే చాలు 
కోరుకున్నది జరుగకపోయినా నిరాశ వెంటాడకుంటే చాలు 
శత్రువులు లేకుండా అందరికీ మంచి మిత్రుడినయితే చాలు 
నా కంటూ ,నన్ను అభిమానించే వాళ్లు నా కోసం ఉంటే చాలు 
మరీ సన్యాసి లా మారక్కరలేదు దేవుడంటే భక్తి ఉంటే చాలు 
నా వ్యక్తిత్వం నాలానే ఉండాలి మరొకరిని గౌరవించగల్గితే చాలు 
మేడలు ,మిద్దెలు ఉండనవసరం లేదు నాకంటూ ఒక ఇల్లు ,పొలం  ఉంటే చాలు 
ఎటువంటి భాదరబందీలు లేకుండా నా జీవితం కొనసాగితే చాలు 
ఒక హిందువుగా ,ఒక కవిగా బ్రతికినంత కాలం చాలు 







1 comments: