Friday 23 October 2015

కవిత నెం 194:నేటి స్నేహ వైఖరి

కవిత నెం  :194

''నేటి స్నేహ వైఖరి  ''


ప్రతీ మనిషికీ అలవాటు ''స్నేహం ''

ప్రతీ మనిషికీ అవసరం ''స్నేహం ''
స్నేహం పేరుతోనే ఒకరికి ,ఇద్దరవుతుతారు 
ఆ ఇద్దరూ ,ఇరవై ,వందలవుతుంటారు 
అంతా బాగానే ఉంటుంది 
మన అవసరం ,ఆనందం కోసం ''స్నేహం '' అవసరమే 
మన కష్ట -సుఖాలను పంచుకునేది ఒక్క ''స్నేహితుల'' తో మాత్రమే 
ఆ స్నేహం పద్దతిగా ,హుందా తనంగా ఉంటే మంచిదే 
ఆ స్నేహం చిక్కగా ,చక్కగా బలపడితే ఇంకా మంచిదే 
ఇకపోతే కబుర్లు ,కాకరకాయలు అన్నీ పంచుకున్నాక 
ఏమి చెయ్యాలో తెలియక కొత్త మోజు ,జబ్బు పుడుతుంది 
ఒకరిలో ఒకరు లీనమయ్యిపోవటం 
ఒకరిని ,ఇంకొకరు విడిచియుండ లేకపోవటం 
అలా అలా ప్రత్యెక ఇష్టంగా కులం ,రంగు అంటూ ప్రాంతీయ బేదాలతో 
వాళ్ల వరకు మాత్రమే ఆ స్నేహం తిరుగుతూ ఉంటుంది 
అలా అని కొత్త వారిని మాత్రం ఆహ్వానించకుండా ఉండరు 
వారిని కూడా ఆహ్వానించి ఇది మన సమూహం ,కుటుంభం అంటారు 
వారు వీళ్ళ పద్ధతులకి అలవాటుపడితే బాగానే ఉంటుంది 
వారి ,వీరి అభిప్రాయలు కుదరకపోతే మరలా స్నేహం వికటిస్తుంది 
స్నేహం ఒకరికోసం మాత్రమే పుట్టింది కాదు 
మన స్నేహం మన తోటివాళ్లకు మాత్రమే రాసిచ్చింది కాదు 
స్వార్ధం లేని స్నేహాన్ని అందరికీ పరిచయం చెయ్యండి 
ఏ వివక్ష లేని స్నేహాన్ని స్వేచ్చగా ఎగరనివ్వండి 
ఆ స్నేహానికి ఒక గ్రూప్ అంటూ ,
ఆ స్నేహాన్ని ఒకే భాష వారమంటూ , ఒకే జాతివారమంటూ 
ఆ స్నేహాన్ని ఒకే ప్రాంతానికి చెందిన వారమంటూ 
ఆ స్నేహాన్ని ఒకే కులపు రుచి ఎరిగిన వారమంటూ 
ఆ స్నేహానికి దిశ ,దశ చేసే నాయకత్వం ఉంది అంటూ 
ఒకటే పార్టీ అంటూ ,మన వరకే మనము అంటూ 
తోక్కెయ్యకండి  చిగురించే స్నేహాన్ని 
మార్చెయ్యకండి ''స్నేహానికి '' ఉన్న నిర్వచనాన్ని 
మన స్నేహం పవిత్రమై ,సర్వమత సమ్మతమై ప్రవహించాలి 
మన స్నేహం ప్రశాంతమై , కోవెల లాంటి నిలయం కావాలి 
ఏ కల్మషాన్ని ,కాలుష్యాన్ని స్నేహానికి అంటించనీయకు 
కలుపుగోలుతనంతో ''స్నేహం ''లో ముందుకెళ్ళు 
నీవు అందరికీ దగ్గరవుతూ ,మరొకరిని ఒంటరిగా చెయ్యకు 
స్నేహం మనలో నుంచి పుడుతుంది 
స్నేహం మనల్ని చూసి పుడుతుంది 
కాని ఆ స్నేహాన్ని ,స్నేహ గుణాన్ని మనతో అంతం చెయ్యవద్దు 

                                                       - గరిమెళ్ళ గమనాలు 




0 comments:

Post a Comment