Friday, 2 December 2016

కవిత నెం 241 : బంధాలు అనుబంధాలు

కవిత నెం  : 241

బంధాలు అనుబంధాలు అంటే నాకిష్టం 
కొత్తవారినైనా త్వరగా అల్లుకోగలనేమో 
అల్లుకున్న బంధం మామిడి తోరణంలా 
 పచ్చగా  పది కాలాలు పాటు సాగాలని 
నా మనసుకు  ఉంటుంది ఆరాటం 
కానీ ప్రతీ బంధమూ మనది కాదు , మనదై పోదు 
స్నేహాలు కొన్ని , సంతోషాలు కొన్ని 
అవమానాలు కొన్ని , ఆశలకెరటాలు కొన్ని 
ఆత్మీయతలు కొన్ని , అంతరంగాలు కొన్ని 
అభిమానాలు కొన్ని , అంతమయ్యేవి కొన్ని 
అద్భుతాలు కొన్ని , అంతమయ్యేవి కొన్ని 
ఈ బంధాలలో రక్త సంబంధాలు కొన్ని 
ఏ సంబంధం లేకుండా పుట్టేవి కొన్ని 
ఆకర్షణకు గురి కావటం మానవ నైజం 
తేడా వస్తే ఘర్షణ జరిగి సంఘర్షణకు గురి కావటం 
సమాజం లో నిజంగా సంభవించటం అది సహజం 
కొన్ని పరిచయాలు శాశ్వతంగా 
పరిచయం ఉన్నవే మనకు దూరంగా 
దూరమైనవి దగ్గరగా , దగ్గరగా ఉన్నవి దూరంగా 
అంతులేని బంధాల సమూహకార్యాలాపన 
అందమైన మానవ సంభంధాల సమారాధన 
ఎంతోమంది మనచుట్టూ ఉన్నా
మనకంటూ చెప్పుకునే వారు ఎందరున్నా 
అయినవారు మన బంధం కోరుకోకపోయినా 
కానివారు మనస్సుకు  చేరువై బరువుగా మారినా 
గుండెల్ని పిండేసేలాగా బంధాలు మారినా 
తట్టుకోలేని జీవన విధానం మానవ చక్రం 
మనిషి ఎక్కడున్నా , ఏ మూలానున్నా 
తన చుట్టూ ఎదో ఒక బంధం పెనవేసుకునే ఉంటుంది 
బాధ్యతతో వాటికి బానిస కూడా మనిషి 
అస్సలు ఈ బంధాలు ఏమిటి అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి 
కానీ బంధమే లేనిదే మనిషి బ్రతకటం అసాధ్యమే 
అది ఈ సృష్టితో దాగియున్న ఒక బంధం 
అయినా వాళ్ళని లెక్క చెయ్యని బంధాలు కొన్నైతే 
కాని వారితో సంబంధాలు కలుపుకుని బ్రతికేవారు కొందరు 
ఎక్కువగా ఎవ్వరూ పరిచయం అవ్వకపోయినా 
మనవారు ఎవ్వరూ మనల్ని చూడకపోయినా 
పరవాలేదు కాని    ....... ....... 
మనకోసం వచ్చి , మనల్ని మెచ్చి ,
తరువాత వారికి వెగటు వచ్చి 
ఒంటరిగా చేసే వారు మాత్రం లేకుండా ఉంటే చాలు 
అలానే పిచ్చి పిచ్చి సంబంధాలు లేకుంటే చాలు 
సరదాగా , సంతోషంగా ఉన్నన్నాళ్లు తోడుంటే చాలు 


- గరిమెళ్ళ గమనాలు // 02. 12. 2016 //

















Related Posts:

  • కవిత నెం : 297 (మన స్వాతంత్రం) కవిత నెం : 297 *మన స్వాతంత్రం * తరాలు మారినా ,యుగాలు మారినా ఓ భావి భారత పౌరుల్లారా మన దేశంపై పొరుగు దేశాల దండయాత్రలు ఇంకా పుంకాలు పుంకాలుగా మనమేమో… Read More
  • కవిత నెం : 298(కోరిక) కవిత నెం : 298 * కోరిక * మొగ్గలా మొలుస్తుంది పువ్వులా విచ్చుకుంటుంది ఆశలా పుడుతుంది గమ్యం కోసం పరిగెడుతుంది గుండెలోతుల్లో దిగులుగా , మెదడు మలుపుల్లో… Read More
  • కవిత నెం :300//భగ్న ప్రేమ // కవిత నెం :300 //భగ్న ప్రేమ // నిలుచున్నా నీ నీడల్లో నీకోసం నిలుచున్నా నీ తలపుల్లో నీ కోసం మబ్బులలో విహరిస్తున్నా నా జాబిలి కోసం నీరులా ప్రవహిస్తున… Read More
  • కవిత నెం : 299 (జీవం -నిర్జీవం) కవిత నెం : 299 * జీవం -నిర్జీవం * ఒకవైపు ఆనందం ఆకాశం వైపు మరోవైపు విషాదం ఆందోళన వైపు కనులముందు కాంతులే వెదజల్లుతున్న అంధకారం ఆ కాంతి ఛాయలనే కాటేసు… Read More
  • కవిత నెం :293(మనిషి భాగవతం) కవిత నెం :293 *మనిషి భాగవతం  * ఒకరికి తెలిసిందే ధర్మం మరొకరు అనుకునేదే న్యాయం ఇంకొకరు చెప్తారు వేదం మరొకరు చూపిస్తారు బేధం ఒకరికొరకే నీత… Read More

0 comments:

Post a Comment