Friday, 9 December 2016

కవిత నెం 247 :అంతర్యుద్ధం మనసుతో

కవిత  నెం  : 247

*** అంతర్యుద్ధం మనసుతో ******

ఏంటో పిచ్చి పిచ్చిగా ఉంది
కుదురుగా ఉండదు కదా ఈ మనసు
పైకి ప్రశాంతంగా ఉన్నా లోపల అలజడి
అన్నీ ఉన్నా ఎదో లోటును వెంట తీసుకువస్తుంది
ఉన్నట్టుండి కొత్తగా ఎదో చెయ్యమని తంతూఉంటుంది
నాకు నేను నచ్చుతూనే ఉంటాను కాని
నాపై నాకే తెలియని ఖచ్చి పుట్టిస్తుంది
మనసు భావాల దొంతరలు బుర్రను తొలిచేస్తున్నాయి
కలంతో సేద్యం చేసి అక్షరాల్ని రూపొందించమంటున్నాయి
మరి మంచిదేగా అనుకుంటారేమో అక్కడే ఉంది చిక్కు
ఒక ఆలోచనకి ఏదైనా విరామం ఉంటుంది , ఒక పద్దతి ఉంటుంది
పద్ధతీ - పాడు లేని ఆలోచనలు కవిత్వమా అంటే ఒప్పుకోవు
ఇరగబడి రాసేద్దామంటే కుదురుగా అవి కూకోవూ
ఏమిటి చెప్మా అంటే నా జుట్టు మొత్తం అక్షరాలుగా అలికిడి
ఎప్పుడూ లేని నాలో ఏ తలనొప్పి లేని ఈ తలపోటు ఏంటో !
హుషారుగానే ఉన్నా , ఆరోగ్యంగానే ఉన్నా అందులో తేడా లేదు
కోటి భావాల కేరింతలు ఒకటే సారి నాపై దాడి చేస్తున్నట్టుగా
అక్షరాలు కొట్లాడుకుంటూ నాలోనే కాపురం చేస్తున్నట్టుగా
ఇది దేనికి సంకేతం , దీనినే కపిత్వం అంటారో - ఆ భావం అనుకోమంటారో
ఎప్పుడూ రాస్తూ ఉన్నా కొత్తగా ఇప్పుడే రాస్తున్నట్లుగా
పుడుతున్నానా నాకు నేనే మళ్లీ ఒక కవిలా ........ కపిలా ........
అద్భుతంగా ఉంది నాకు ఈ వింత అనుభూతి
పంచుకోటానికి మనసు నాతో ఇంకోలా జతకూడి
మీకు సోదిలా ఉన్నా .... నాకు ఒక వ్యాధిలా ఉంది
కానీ కీడు చేసే వ్యాధి  కాదు అని గట్టిగా ఒక నమ్మకం
ఇప్పటికిప్పుడే కొన్ని పేజీలు రాసేయాలని ఉంది
సమయం చిన్నది , తొందరది కదా నాతో దాగుడుమూటలు ఆట మొదలెట్టింది
క్షణం .... ఒక క్షణం .... మరో క్షణం .... మరో మరో క్షణం వెరసి నా గమనం
నా కలంతో పోరాటమో .. అక్షరకూర్పు లో నా ఆరాటమో తెలియదు కాని
భలే భలేగుంది ... బాగుంది ఈ బాధ .... ఒక కార్యం క్రమం లోకి చేరువేళ
చూస్తూ ఉండిపోతాను ... నా మనసు చెప్పేది వింటూ పోతాను మరి
అది గమ్యం అవుతుందో ఈ కాలంతో చేరే మార్పులలో నా కలం గమనం అవుతుందో


// గరిమెళ్ళ గమనాలు // 09. 12. 2016//










Related Posts:

  • కవిత నెం :296(* ఎందుకు గాబరా *) కవిత నెం :296 * ఎందుకు గాబరా * ఒకరికోసం నీ గమ్యం ఆగకూడదు ఒకరికోసం నీ మార్గం నిర్దేశింపబడకూడదు ఎవరు  నువ్వో ఈ భూమిపైకి రాకముందు ఎవరు నువ్వు అనే… Read More
  • కవిత నెం :340(నీ జ్ఞాపకంలో - నేనున్నా నాన్న ) కవిత నెం :340 కవితా శీర్షిక : నీ జ్ఞాపకంలో - నేనున్నా నాన్న  నువ్వంటే ఇష్టం నాన్న నీ రూపంటే ఇష్టం నాన్న నీ ఊహ తెలియకుండా ఎదిగా నాన్న న… Read More
  • కవిత నెం :302(మాతృత్వపు ధార) కవిత నెం :302 *మాతృత్వపు ధార * తాను తల్లి కాబోతున్న అనే వార్త వినగానే తన్మయత్వంతో పులకించిపోతుంది ఆ తల్లి హృదయం ఎన్నో ఆశలు కళ్లలో దాచుకుని ఎన్నో ఊ… Read More
  • కవిత నెం269: నిశీధిలో నేను కవిత నెం :269 * నిశీధిలో నేను * నిశీధిలో నేను  దిక్కులు  చూస్తున్నాను  ఆరుబయట మంచం మీద  చల్లని గాలి మెల్లగా చేరి … Read More
  • కవిత నెం263:మేలుకో నవతేజమా కవిత నెం :263 *మేలుకో నవతేజమా * సమాజాం పిలుస్తుంది రా కదలిరా నవ సమాజం పిలుస్తుంది రా కదలిరా గుర్రు పెట్టి నిద్రబోతే ఏముందిరా కలం పట్టి గళం పాడే చోట… Read More

0 comments:

Post a Comment