Monday, 5 December 2016

కవిత నెం 245 :నా మది అలా - నా మాట ఇలా

కవిత నెం : 245
*నా మది అలా - నా మాట ఇలా *

గుండె గోదారిలా
నువ్వు కావేరిలా
మనసు మయూరిలా
కదిలే భూగోళంలా

నీ నవ్వు కోయిలా
నీ నడక హంసలా
నువ్వు కోవెలలా
నేను జాబిలిలా

నువ్వు చిరుగాలిలా
నేను సెలయేరులా
నువ్వు తుళ్లింతలా
నేను కవ్వింతలా

చెరగని కలలా
కురిసే  వర్షంలా
విరిసే కుసుమంలా
మురిసే ముత్యంలా


వెన్నంటే నీడలా
నా చెలిమి నీడలా
నాకుండే తోడులా
నాకన్నీ నీవులా


మరువని గుర్తులా
విడువని సొత్తులా
నా ఎద సంపెంగలా
నా హిమ బింధువులా


కడలిలో అలలా
నువ్వు చెరువులా
గువ్వా గోరింక లా
మన జత కేరింతలా


తొలివలపులా
పసి తలపులా
చిరు గెలుపులా
గొప్ప మలుపులా


ఆ కొండ కోనలా
ఆ వాగు వంకలా
ఆ మావి చిగురులా
ప్రకృతి ప్రేమలా


నీకు నేను శ్వాషలా
నా కంటి భాషలా
ఒకరు ఒకరు రెండులా
నువ్వు నేనూ ప్రేమలా

- గరిమెళ్ళ గమనాలు // 05. 12. 2016















Related Posts:

  • కవిత నెం159:వేశ్య ఎవరు ? కవిత నెం :159 వేశ్య ఎవరు ? ఏ  బ్రహ్మకలం నుండి జారిన పదం ఇది  ఏ పరబ్రహ్మ సృష్టించిన జన్మ ఇది  ఎవ్వరు ఈమెనిలా మార్చివేసినది  ఏ ద… Read More
  • కవిత నెం117:వెక్కిరింపు కవిత నెం :117 *వెక్కిరింపు * చందమామను చూసి సూర్యుడు వెక్కిరిస్తాడా  నువ్వెంత చల్లగా ,హాయిగా ,అందంగా ఉంటావని  ఆకాశాన్ని చూసి నెల వెక్కిర… Read More
  • కవిత నెం 190:పేగుబంధానికి విలువెక్కడ ? కవిత నెం :190 పేగుబంధానికి విలువెక్కడ ? అమ్మా నాకు చిన్న నలతగా ఉంటే  నువ్వు కలత చెంది ,కన్నీళ్లు పెట్టుకునేదానివి  అమ్మా నేను అడగకుండానే… Read More
  • కవిత నెం187:ఎక్కడికి వెళ్తున్నాం మనం కవిత నెం :187 ''ఎక్కడికి వెళ్తున్నాం మనం'' మనం పుట్టక ముందు ప్రకృతి అంటే పులకరించే వాళ్లం   నేడు మన అవసరాల కోసం కాలుష్య సహవాసం చేస… Read More
  • కవిత నెం 95:ఓ సంద్రమా కవిత నెం :95//ఓ సంద్రమా // * ఓ సంద్రమా !* రచన : 14 , హైదరాబాద్ ఓ సంద్రమా ! నీ సున్నిత సాన్నిహిత్యం సుమదురమైనది నీ తిమ్మిరి తుంటరి ఝూమ్కారం … Read More

0 comments:

Post a Comment