Monday 29 September 2014

కవిత నెం50:మహిషాసురమర్దిని


కవిత నెం :50
మహిషాసురమర్దిని
********************
 రంభుడు అనే రాక్షసుణి పుత్రుడు మహిషుడు 
 బ్రహ్మ వరంతో వరగర్వితుడై లోక కంటకుడయ్యాడు 
 మదబలముతో దేవేంద్రుని ఓడించి ఇంద్రపదవినొందాడు 
 మహిషునిపై పుట్టిన క్రోదాగ్ని తేజముగా ఉద్భవించే
ఆ త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై స్త్రీ రూపముగా జన్మించే
శివుని తేజము ముఖముగా ,విష్ణు తేజము భాహువులుగా
బ్రహ్మ తేజము పాదములుగా - దుర్గా దేవిగా అవతరించే
పద్మా సనస్థయైన ఆ తేజో : పుంజరూపిణికి
సర్వదేవతలు సమస్తాయుదాలను సమకూర్చే
లోకాలు అదిరేలా హూంకార ధ్వని చేస్తూ దేవి కదిలే 
సింహసనేశ్వరియై గర్జిస్తూ ఘీంకరిస్తూ సాగే 
 ప్రళయాగ్ని ని  చిందిస్తూ ఘోరముగా యుద్ధం చేసే 
రౌద్ర రూపం దాల్చి మహిషాసురుణ్ణి సంహరించే 
మహిషుని చంపగా తానూ మహిశాసురమర్దినిగా 
బెజవాడ ''ఇంద్ర కీలాద్రి'' పై దుర్గా దేవిగా అవతరించే 
ఆదిశంకరులు మహిషాసురమర్దిని స్తోత్రముతో 
నిత్యం అయిగిరి నందిని గా పూజలు అందుకొనుచుండే 
జయ జయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే 
పాహిమాం పాహిమాం దేవి సర్వ భగవతీ నమోస్తుతే 








కవిత నెం49:శక్తి స్వరూపిణి

కవిత నెం :49

శక్తి స్వరూపిణి 
*****************

అంబపరమేశ్వరి  ,అఖిలాండేశ్వరి ,ఆదిపరాశక్తివే 
శ్రీ భువనేశ్వరి , రాజ రాజేశ్వరి ,బాలత్రిపురాసుందరివే 
సర్వలోక రక్షిణి, సర్వ జ్ఞాన ప్రదాయిని మా శక్తి స్వరూపిణివే 
సర్వ సృష్టికే మూలాధారం  నీ శక్తి రూపమే  
ఆయా దేవతల్లో ఆయా శక్తి రూపాల్లో ఇమిడి ఉన్నది నీవేలే 
అభయమునిచ్చి ,ఆకలితీర్చగా అన్నపూర్ణవు నీవేలే 
త్రిమూర్తుల విధులకు నెలవు తల్లీ నీ కరుణే 
బ్రహ్మలో కొలువైవున్న రాజసశక్తి నీవేలే 
భక్తులను లాలించే మాతృస్వరూపం నీవేలే 
రక్కసులను మట్టుపెట్టగా ఉగ్రరూపం నీవేలే 
కోరిన కోర్కెలు నొసగును నీవు మా కొంగు బంగారమే 
సహనముతో స్త్రీ పాలిట నిలచే శక్తి షాలిని నీవేలే 
మా భ్రమణాలను తొలగించే మంత్రం - నీ మందహాసం 
మా కష్ట నష్టాలను దూరం చేసే ఒడి - నీ అనురాగామృతం 
సకల  సంపదలు , సంతాన సౌభాగ్యం నిచ్చే అమృతమూర్తివే 
తల్లీ నీ ఆవిర్భావం సకల మానవ కల్యాణం 
ప్రపంచ మానవ విశ్వ సౌందర్యానికే ప్రతీకలు నీ త్రినేత్రాలు 
ఆద్యాత్మిక శక్తికి సంకేతం అమ్మా నీ త్రిశూలం 
జగత్ యొక్క చలనానికి ప్రతీక నీ ధర్మ చక్రం 
తల్లి ప్రేమకే  నిదర్శనం జగన్మాత స్వరూపం 

//గరిమెళ్ళ గమనాలు// హైదరాబాద్ // 
సాహితీ చిత్ర పోటీ కొరకు - 29. 09. 2014
 

 

Saturday 27 September 2014

కవిత నెం48:నేను మనిషినా


కవిత నెం :48
నేను మనిషినా
జవాబుచెప్పగలను కాని ప్రశ్నించలేను
ప్రేమించగలను కాని ద్వేషించలేను
బ్రతిమాలగలను కాని కోపించలేను
సహాయం చేయగలను కాని అర్దించలేను
మాట్లాడగలను కాని పోట్లాడలేను
ప్రాదేయపడగలను కాని పోరాడలేను
ఓదార్చగలను కాని ఓర్చుకోలేను
ఆచరించగలను కాని ఆజ్ఞాపించలేను
బలవంతుండనే కాని మదవంతుడని కాను
న్యాయమున్నవాడినే కాని అన్యాయం చెయ్యలేను
స్వార్దమున్నవాడినే కాని స్వలాభం కోరుకోను
కష్టించగలను కాని సుఖించలేను
జాలి చూపగలను కాని జాలి తట్టుకోలేను
విలువలు తెలిసినవాడిని కాని విలువను పొగొట్టుకోలేను
గౌరవించగలను కాని అగౌరవపరచలేను
ప్రార్దించగలను కాని ధూషించలేను
పనిమంతుండనే కాని పనికిమాలినోన్ని కాను
తెలివిఉన్నవాడినే కాని అది ఉపయోగించుకోలేను
బ్రతికించగలను కాని బ్రతుకలేను
మరి నేను మనిషినా ? మనిషినేనా ??
//గరిమెళ్ళ గమనాలు//27.09.14//

Friday 26 September 2014

కవిత నెం47:వరకట్నం

కవిత నెం : 47//వరకట్నం //

వరకట్నం ........ 
ఇది వధువు తల్లిదండ్రులకు ఆత్మస్థైర్యమైతే 
వరుడికి మాత్రం అంటుకున్న దురహంకారం 
జీవం పోసిన ఆ దేవుడే ''కట్నం '' అనే మరణాన్ని కూడా ఇచ్చాడు 
ఇది ఆడపిల్ల బ్రతుకుపాలిట నిలచిన ఒక పాపం 
ఆడపిల్ల అంటేనే భయపడే స్థితిని తెచ్చింది ఈ ''కట్నం ''
అబ్బాయిలకు మాత్రం ఇది వరం లాంటి ఒక ఆయుధం 
చట్టాలు ఎన్ని తెచ్చినా చలించదు ఈ సమాజం 
రెండు జీవితాలను కలపాలంటే ఈ కట్నమే ప్రధానం 
ఆడపిల్లరా అది ఆట బొమ్మ కాదురా 
''వరకట్నం '' అనే తూకంతో అమ్మాయి మనసు కొలువకురా 
కన్నవారి హృదయాలకు తను ఒక ప్రాణం రా 
నిన్ను నమ్మి వచ్చింది నువ్వే తన ప్రాణం రా 
నీ కోసం విడిచిపెట్టి తన కుటుంబాన్ని ,ఆత్మాబిమానాన్ని 
పసి పాప రా తాను , కసి తీరా వేధించకురా 
తాళి నీవు కట్టావురా ,ఉరి తాడులా దాన్ని మార్చకురా 
ఆడపిల్ల అంటేనే మహాలక్ష్మీ స్వరూపంరా 
ఆ మహాతల్లి చాలదా ఇంకా లక్ష్మీ అంటూ కాంక్ష ఏలరా 
వరకట్నం అనే ''ఊబి '' లోకి దిగకండిరా 
వరం లాంటి జీవితాన్ని నాశనం చేసుకోకండిరా 

Monday 22 September 2014

కవిత నెం 46:భాద పడే భావం

కవిత నెం :46

భాద పడే భావం 
***********************

ఏం బాధరో ఇది పొంగుతున్నది 
ఏం బాధరో ఇది ఉబుకుతున్నది 
ఏం బాధరో ఇది ఆగకున్నది 
ఏం బాధరో గుండె పిండుతున్నది 

కళ్ళ నుంచి నీరు గార్చి 
కలతనేమో మనసుకిచ్చి 
ఒళ్ళంతా తడిపేసి 
చెమటలాగా చిందులేసి 

చిత్రవదనే చూపిస్తది 
విరిగిపోని వేదననే మిగులుస్తది 

కోపాన్ని భయటపెట్టి 
అసహనం చేతికిచ్చి 
ఏడ్వటమే మార్గమంటది 

వెర్రితనం  జతచేసి 
విచక్షణ చెరిపేసి 
వెక్కి వెక్కి దు:ఖాన్నే రగిలిస్తది 

అందమయిన మనసును 
మందంగా మార్చేసి 
మొండితనంతో మొరాయిస్తది 

ఎందరెన్ని చెప్పినా 
ఎంత ఓదార్చినా 
రచ్చ చేయటమే ఆపకుంటది 
  అందరినీ దూరంచేసి 
ఒంటరిని పరిచయం చేసి 
నీ నెత్తి మీద కుండ లాగా కూర్చుంటది 

నీ మాట మాత్రమే అది వింటది 
ఆనందమే తనకు దూరమంటది 

భాద అంతా భయటికి పోయినాక 
రాయి లాంటి మనసునే హాయి చేస్తది 

//గరిమెళ్ళ గమనాలు//22. 09. 2014//

Sunday 21 September 2014

కవిత నెం 45:బుడుగు

కవిత నెం : 45 //బుడుగు //

బుడుగోడు వచ్చాడు బుడుగు 
వాడు మన బాపు గారి ''బుడుగు''
వాడు మన రమణి గారి ''బుడుగు ''
అల్లరి చేస్తాడు ''బుడుగు''  మనల్ని నవ్వించేస్తాడు ''బుడుగు ''
హంగామా చేస్తాడు ''బుడుగు '' వాడు హాస్యానికే పెద్ద గొడుగు  
బుడి బుడి నడకల ''బుడుగు '' వాడో చిచ్చర పిడుగు 
గమ్మత్తు గుంటాడు ''బుడుగు'' అలా కాకుంటే నన్ను అడుగు 
హాపు నిక్కరోడు ,గళ్ళా చొక్కా వోడు 
జానేడంతా లేడు  పెద్ద జ్ఞానం తెలిసినోడు 
ప్రశ్న వేసాడంటే ''బుడుగు'' అవాక్కు అవుతావు నువ్వు 
కధలెన్నో చెప్తాడు ''బుడుగు '' కళలు పండిస్తాడు ''బుడుగు''
తుంటరి పిల్లాడు ''బుడుగు'' తుపాకి తూటాలోడు ''బుడుగు ''
బాష తెలియనోడు ''బుడుగు'' మంచి యేస తెలిసినోడు ''బుడుగు ''
మంచి బుద్ది ఉన్నోడు ''బుడుగు'' భలే బుద్ది మంతుడే ''బుడుగు ''
చుట్టంలా వస్తాడు ''బుడుగు '' చెమత్కార చట్టాలోడు మన ''బుడుగు ''
బొమ్మలా వచ్చాడు ''బుడుగు '' బందమై నిలిచాడు ''బుడుగు ''
ఇప్పటికీ ఎప్పటికీ బుడుగోడి కబుర్లు రావాలి మనం వినాలి 


Saturday 20 September 2014

కవిత నెం44(దేవుడా ....... నీవెక్కడా )

కవిత నెం :44 

దేవుడా ....... నీవెక్కడా 
*************************
అందకుండా ఉండువాడా దేవుడా
అందరి నమ్మకం అయ్యినవాడా దేవుడా
ఏడ నీవు దాగున్నావురా దేవుడా
ఏమి నువ్వు చేస్తున్నావురా దేవుడా

గుడిలో కూర్చుంటావు నువ్వు రాయిలా నిల్చుంటావు
గుంపు గుంపులుగా జనాలనే నీ చుట్టూ తిప్పిస్తావు
మహిమ ఉందంటావు నువ్వు  మాయ చేస్తుంటావు
తండోప తండాలుగా దండాలు పెట్టిస్తావు
మంచి కోసం చేయిరాదు దేవుడా
నీ పేరు కోసం పడిచస్తారు దేవుడా
చేసే పనిలో నీతి ఉండదు దేవుడా
వేదాలు మాత్రం అప్పచెప్తారు దేవుడా

మరి
ఏడ నీవు దాగున్నావురా దేవుడా
ఏమి నువ్వు చేస్తున్నావురా దేవుడా


ఆడ ఉన్నావంటవు  నువ్వు  ఈడ ఉన్నానంటవు 
మెట్టు మెట్టు ఎక్కి నువ్వు నిన్నే కొల్వమంటవు 
మొక్కు మొక్క మంటవు  ముడుపు కట్ట మంటవు 
ఎన్ని మొక్కులు మొక్కినా దిక్కు లేకుండా చేస్తావు 
నీకోసమెన్నో గోపురాలు దేవుడా
మా బ్రతుకుల్లో కబ్జాల్లేరా దేవుడా
చిన్న మెతుకైనా దక్కనివ్వవు దేవుడా
మా ఆకలి భాదలు తీరేదెలా దేవుడా

మరి
ఏడ నీవు దాగున్నావురా దేవుడా
ఏమి నువ్వు చేస్తున్నావురా దేవుడా 


ఆత్మ నీవు అంటవు  పరమాత్మ నీవంటవు  
ఆత్మ ప్రదక్షిణలు మమ్మల్ని చేయమంటవు  
నీ రూపాలు వేరంటవు  కాని దేవుడొక్కడే అంటవు  
మనసెట్టి చూస్తే మాలోకూడా నీవు ఉన్నానంటవు  
నీ పేరు చెప్పి మోసాలు ఎన్నో దేవుడా 
మారు రూపంతో వేషాలెన్నో దేవుడా 
అన్నీ ఉన్నా అనాధలమే దేవుడా 
మా ఆర్తులేమి  తీర్చలేవురా  దేవుడా 

మరి
ఏడ నీవు దాగున్నావురా దేవుడా
ఏమి నువ్వు చేస్తున్నావురా దేవుడా 


కదలకుండా నువ్వు ఉంటవు  కానరాకుండా ఉంటవు  
కోరిన కోర్కెలు వింటూ నీవు సేద తీరుతుంటవు 
కర్మ ,క్రియ అంటవు  కర్త నీవై ఉంటవు 
కర్మానుసారమే మా భారం అంటూ గీతోపదేశం ఇస్తావు 
నీలాగా మేము ఉండలేమురా  దేవుడా 
మమ్మల్ని కాస్త జాలి చూపరా దేవుడా 
ఆపదలేమి అవసరం లేదురా దేవుడా 
మా అవసరాలు మాకు తీర్చరా దేవుడా 
మా సంతోషాలు మాకు ఇవ్వరా దేవుడా 



//గరిమెళ్ళ గమనాలు//21. 09. 14//














Thursday 18 September 2014

కవిత నెం43:మనసుకి మనో వేదన

కవిత నెం : 43

మనసుకి మనో వేదన 
***********************

చిన్నారి చిన్నా - చింత వద్దమ్మా 
బంగారు కన్నా - భవిత నీదమ్మా 
ఆశలన్నీ ఆవిరయినా - ఆశయం మారిపోదు 
మచ్చ ఉన్నా చంద్రుడయినా వెలుగును ఇవ్వకపోడు 

భాద అనే బంధం లేనిదే 
''ఆనందం '' ఎలాగనే 
కష్టమనే తోడు లేనిదే 
సుఖమెలా పుడుతుందే 
కష్టాలు -కన్నీళ్లు కలకాలం కాపురముండవే 
ఆ సమయములోన నీ దైర్యం కి ఊపిరిపోయాలే
కలత అన్నది మనసు పెన్నిది 
మనసుకది హాయి తెస్తుంది 


గతం అనే ప్రస్తుతంలో 
''భవిష్యత్తు '' ఉంటుంది 
క్షణము క్షణము కలిసే చోట 
''నిరీక్షణ '' ఉంటుంది 
నిరీక్షణలో ఆ కాలం ''ఆశ'' ను రేపుతుందే 
ఆ ఆశతోటే జీవిత గమ్యం మొదలవుతుందే 
ఓర్పు అన్నది నేర్పు నిస్తుంది 
మనసుకది ఓదార్పు అవుతుంది  



//గరిమెళ్ళ గమనాలు //18.09. 14 //

Monday 15 September 2014

కవిత నెం 42:నీ బ్రతుకు -నీ ఉరుకు

కవిత నెం :42

నీ బ్రతుకు -నీ ఉరుకు  
***********************
ఎవరు  తీర్చగలరు నీ ఇంటి భాదలు
ఎవరు మోయగలరు నీ అశ్రుధారలు
నడుచుచున్న సమాజమే - నడవలేదుగా
కదులుతున్న కాలమే -కలుపలేదుగా
నీ బ్రతుకు నీది , నీ ఉరుకు నీది  //2//
బ్రతకగలవనుకుంటే అడుగు వెయ్యి

అందే అవకాశం - అది ఓ ప్రతి భింభం
నమ్మకం నీవైతే - అది చంద్ర భింభం
ఆగిపోకు అలసిపోయి - జారిపోకు నీరు గారి
గుండె నిండా బలం నింపి - ఊపిరినే విల్లు చేసి
సాగిపో సంద్రమై - నిలచిపో స్థైర్యమై

ఎవ్వరాపగలరు నీ వెలుగు రేఖలు
ఎవ్వరాపగలరు నీ చిరు నవ్వులు


నడిచే నీ పయనం - పారే జలపాతం 
ప్రయత్నం నీవైతే - చేరుతుంది గమ్యం 
ఆటు పోట్లు ఉంటాయి - అలలు అడ్డుపడతాయి 
మనసు నిబ్బరం చేసుకుని - ఆలోచనే ఆయుధంగా మలుచుకుని 
ఉరికే కెరటమై - మారిపో విజయమై 

ఎవ్వరాపగలరు నీ వెలుగు రేఖలు
ఎవ్వరాపగలరు నీ చిరు నవ్వులు

//గరిమెళ్ళ గమనాలు // 15.09.2014 //

Saturday 13 September 2014

కవిత నెం41(ఆకాశం)

కవిత నెం :41// ఆకాశం //

ఆకాశం .............................

చిన్న పిల్లలకైనా ,పెద్ద వాళ్ళకైనా

ఆకాశమంటే ఆహ్లాదకరమైన ఓ ఆట విడుపు

భాదలో ఉన్నా , ఆనందంలో ఉన్నా

ఆకాశం వైపు ఓ అర క్షణం చూస్తే చాలు
వినపడుతుంది నీ మనసు పిలుపు

అందనంత దూరాన ఉంటూ

అందమైన అద్భుతాలను చూపిస్తూ ఉంటుంది

విశ్వమంతటా వ్యాపించియున్న వస్త్రం

నీలి వర్ణంతో కప్పబడియున్న ఆవరణం
అంతరిక్షానికి భూమికి మధ్య ఉన్న భూగోళిక కవచం

అవధులు లేని అనంతమైన శూన్యం

కనిపించే అబద్ధం - పలుకలేని నిజం
పగిలిపోయిన నిలువుటద్దం - ప్రతి ధ్వనించే నిశ్శబ్దం

వెన్నలను ,చీకటిలను కలిగియున్నది ఆకాశ జీవితం

మేఘమైనా ,చినుకునైనా అది ఆకాశ వర్షితం

అంతర్జాల పరిశోధనలకు నిలయం ఆకాశం

అంతరంగ భావాల కవితా నైపుటం ఆకాశం

మది సంబరం అంబరాన్ని తాకిన వేళ అంటారు

ఆ ''నింగి '' సాక్షిగా  అంటూ ప్రమాణాలు చేస్తారు 
ఆకాశం ఏనాటిదో అంటూ అనురాగాన్ని పోలుస్తారు 
దివి  నుండి భువికి దిగిన తారవో అంటూ సౌందర్యాన్ని చెప్తారు
ఏ టెక్నాలజీ లేని వేళలో ''ఆకాశ రామన్న '' లతోనే కదా సమాచారాలు  

చందమామ కధలు అయినా - ఇంద్ర ధనుస్సు సొగసులు అయినా 

అమ్మాయి అందమయినా - అమ్మ ప్రేమ బంధమయినా 
ఆకాశం అనే ''కోణం '' నుంచి చూపబడినవే 

నిర్మలమయిన ప్రేమకి చిహ్నం ''ఆకాశం ''

నిరాడంబరమయిన స్వచ్చత ''ఆకాశం ''
ఏ బంధం ఆపలేని స్వేచ్చ ''ఆకాశం ''
కాలంతర సుదూర ప్రయాణం ''ఆకాశం ''
ప్రకృతి ప్రసాదించిన పంచ భూతం ఈ ''ఆకాశం'' 

ఆకాశం గురించి విశదీకరించి చెప్పాలంటే 

ఆ ప్రయత్నం ''ఆకాశమంత '' లా చేస్తే గాని చెప్పలేము 










Saturday 6 September 2014

కవిత నెం40:బాపు బొమ్మలు

కవిత నెం :40 //బాపు బొమ్మలు//
******************************

ఎంత చూసినా తనివి తీరనిది ''బాపు బొమ్మ ''
ఎన్ని సార్లు వర్ణించినా మనసు నిండనిది మన ''బాపు బొమ్మ ''
ఒక్కో గీతలో ఒక్కో భావం -  ఒక్కో బొమ్మ ఒక్కో ఇతిహాసం ,గ్రంధం 
ఇంద్ర ధనస్సును తీసుకుని కుంచెగా మార్చినట్టు 
ప్రకృతిని లొంగ దీసుకుని ఆ అందాలకు రంగులద్దినట్టు 
సప్త స్వరాల సొగసులను రంగరించినట్టు 
నవ రసాలను పిలిపించి జీవం పోసినట్టు ఉండేదే మన ''బాపు బొమ్మ''
త్యాగ రాజు కీర్తనలా ,తెలుగింటి తొలి ముగ్గులా లక్షణమైనది మన ''బాపు బొమ్మ ''
బాపు బొమ్మలు ప్రాణంతో కదిలే జీవాలు 
బాపు బొమ్మలు సందేశాత్మక సమిధులు 
బాపు బొమ్మలు రసవత్తర కావ్యాలు 
బాపు బొమ్మలు రమణీయత కల్గిన శ్రావ్యాలు 
బాపు బొమ్మలు కళాత్మకత రూపాలు 
బాపు బొమ్మల్లో  దాగి ఉన్నవి అందం ,ఆనందం ,అశ్యరం . 
బాపు బొమ్మలు మాట్లాడతాయి ,కవ్విస్తాయి ,నవ్విస్తాయి ,ఆలోచింపచేస్తాయి 
బాపు బొమ్మలు ఆద్యాత్మికతకు అద్దం పట్టినట్టు ఉంటాయి 
బాపు బొమ్మలు సమాజం పట్ల మన నైతిక భాద్యతను గుర్తు చేస్తాయి 
అమ్మతనం అయినా ,అమ్మాయి తనం అయిన అది ఒక్క  బాపుకి మాత్రమే సొంతం
తెలుగుదనానికి వెలుగును అద్ది , తెలుగు జాతికే వరమైనది మన ''బాపు బొమ్మ ''
బాపు బొమ్మల్లో విద్యుత్తు ఉంటుంది ,విద్వత్తు ఉంటుంది అని శ్రీ రమణ ఊరికే చెప్పలేదు
నిజంగానే అయన బొమ్మలు మది మకుటాన్ని సైతం నిద్ర లేపుతాయి
మనల్ని మంత్ర ముగ్దుల్ని చేస్తాయి, మనోహరంగా వాటికవే సింగారించుకుంటాయి
అందుకే మన బాపు బొమ్మలు ''బాపురే'' అన్నట్టు ఉంటాయి ఈ నాటికి ఏ నాటికి
అందుకే ప్రపంచ చరిత్రలో కూడా నిలిచింది వాటి కీర్తి .











Wednesday 3 September 2014

కవిత నెం39:మారండి

కవిత నెం :39

మనుషుల్లారా మారండి
మనుషులమని గుర్తించండి

మనకు మనమే బంధువులం
మనకు మనమే స్నేహితులం

మనకు మనమే ఆత్మీయులం
మనకు మనమే శత్రువులం

మానవ జన్మ ఒక వరం
అది పూర్వ జన్మ సుకృతం

ఈ జీవితం కాదు శాశ్వతం
ఎందుకు వృధా ప్రయాసం

ఆలోచన చెయ్యగలిగేది మన మనసు
ఏదేమైనా చెయ్యగలిగేది మన మేధస్సు

స్వార్ధ చింతనలో ఏముంది స్వప్రయోజనం
కోరికలకు ఏముంటుంది ఒక పరిమితం

స్వార్ధములోనుంచి పుట్టేది నీ నాశనం
కోరికలు గుర్రాలైతే పోతుంది విచక్షణం

పంచ భూతాలూ చాలవా మన జీవనానికి
మేడలు మిద్దెలు తో ఎం చెయ్యటానికి

జననం మరణం అన్నవి మాత్రం వాస్తవం
మధ్యలో జరిగేది అంతా ఒక నాటకం

మంచి చెడు అన్నవి రెండు తారతమ్యాలు ఉంటే
చెడుతో చేసే పనికే ఎందుకవుతారు భానిస
మంచితో మొదలయ్యే అడుగే మనకు కాదా ఆసరా