Thursday, 18 September 2014

కవిత నెం43:మనసుకి మనో వేదన

కవిత నెం : 43

మనసుకి మనో వేదన 
***********************

చిన్నారి చిన్నా - చింత వద్దమ్మా 
బంగారు కన్నా - భవిత నీదమ్మా 
ఆశలన్నీ ఆవిరయినా - ఆశయం మారిపోదు 
మచ్చ ఉన్నా చంద్రుడయినా వెలుగును ఇవ్వకపోడు 

భాద అనే బంధం లేనిదే 
''ఆనందం '' ఎలాగనే 
కష్టమనే తోడు లేనిదే 
సుఖమెలా పుడుతుందే 
కష్టాలు -కన్నీళ్లు కలకాలం కాపురముండవే 
ఆ సమయములోన నీ దైర్యం కి ఊపిరిపోయాలే
కలత అన్నది మనసు పెన్నిది 
మనసుకది హాయి తెస్తుంది 


గతం అనే ప్రస్తుతంలో 
''భవిష్యత్తు '' ఉంటుంది 
క్షణము క్షణము కలిసే చోట 
''నిరీక్షణ '' ఉంటుంది 
నిరీక్షణలో ఆ కాలం ''ఆశ'' ను రేపుతుందే 
ఆ ఆశతోటే జీవిత గమ్యం మొదలవుతుందే 
ఓర్పు అన్నది నేర్పు నిస్తుంది 
మనసుకది ఓదార్పు అవుతుంది  



//గరిమెళ్ళ గమనాలు //18.09. 14 //

Related Posts:

  • కవిత నెం41(ఆకాశం) కవిత నెం :41// ఆకాశం // ఆకాశం ............................. చిన్న పిల్లలకైనా ,పెద్ద వాళ్ళకైనా ఆకాశమంటే ఆహ్లాదకరమైన ఓ ఆట విడుపు భాదలో ఉన్నా , ఆనందం… Read More
  • కవిత నెం109 (థాంక్స్) కవిత నెం :109 //థాంక్స్// తప్పేమీ కాదు ఒక చిన్న ''థాంక్స్'' నువ్వు చెప్తే  నీ తలేమిపోదు ఒక చిన్న ''థాంక్స్'' నువ్వు చెప్తే  ''థాంక్స్''… Read More
  • కవిత నెం29(నీ ఓటే ఒక ఆయుధం) కవిత నెం :29 ***నీ ఓటే ఒక ఆయుధం*** చతికిలపడ్డ సమైక్యత ను నిద్ర లేపటానికి అలసిపోయిన ప్రజాస్వామ్యాన్ని కదపటానికి నీ ఓటే ఒక ఆయుధం  //2// నీ గుండ… Read More
  • కవిత నెం44(దేవుడా ....... నీవెక్కడా ) కవిత నెం :44  దేవుడా ....... నీవెక్కడా  ************************* అందకుండా ఉండువాడా దేవుడా అందరి నమ్మకం అయ్యినవాడా దేవుడా ఏడ నీవు దాగున్నావ… Read More
  • కవిత నెం37(తొలకరి జల్లు) కవిత నెం : 37 తొలకరి జల్లుల తిమ్మిరితనం  మేలుకుంటుంది తుంటరితనం ఆడుకుంటుంది చిలిపితనం  అలుపెరుగదు అల్లరితనం  చిన్నపిల్లలకు కేరింతతనం… Read More

0 comments:

Post a Comment