Saturday, 20 September 2014

కవిత నెం44(దేవుడా ....... నీవెక్కడా )

కవిత నెం :44 

దేవుడా ....... నీవెక్కడా 
*************************
అందకుండా ఉండువాడా దేవుడా
అందరి నమ్మకం అయ్యినవాడా దేవుడా
ఏడ నీవు దాగున్నావురా దేవుడా
ఏమి నువ్వు చేస్తున్నావురా దేవుడా

గుడిలో కూర్చుంటావు నువ్వు రాయిలా నిల్చుంటావు
గుంపు గుంపులుగా జనాలనే నీ చుట్టూ తిప్పిస్తావు
మహిమ ఉందంటావు నువ్వు  మాయ చేస్తుంటావు
తండోప తండాలుగా దండాలు పెట్టిస్తావు
మంచి కోసం చేయిరాదు దేవుడా
నీ పేరు కోసం పడిచస్తారు దేవుడా
చేసే పనిలో నీతి ఉండదు దేవుడా
వేదాలు మాత్రం అప్పచెప్తారు దేవుడా

మరి
ఏడ నీవు దాగున్నావురా దేవుడా
ఏమి నువ్వు చేస్తున్నావురా దేవుడా


ఆడ ఉన్నావంటవు  నువ్వు  ఈడ ఉన్నానంటవు 
మెట్టు మెట్టు ఎక్కి నువ్వు నిన్నే కొల్వమంటవు 
మొక్కు మొక్క మంటవు  ముడుపు కట్ట మంటవు 
ఎన్ని మొక్కులు మొక్కినా దిక్కు లేకుండా చేస్తావు 
నీకోసమెన్నో గోపురాలు దేవుడా
మా బ్రతుకుల్లో కబ్జాల్లేరా దేవుడా
చిన్న మెతుకైనా దక్కనివ్వవు దేవుడా
మా ఆకలి భాదలు తీరేదెలా దేవుడా

మరి
ఏడ నీవు దాగున్నావురా దేవుడా
ఏమి నువ్వు చేస్తున్నావురా దేవుడా 


ఆత్మ నీవు అంటవు  పరమాత్మ నీవంటవు  
ఆత్మ ప్రదక్షిణలు మమ్మల్ని చేయమంటవు  
నీ రూపాలు వేరంటవు  కాని దేవుడొక్కడే అంటవు  
మనసెట్టి చూస్తే మాలోకూడా నీవు ఉన్నానంటవు  
నీ పేరు చెప్పి మోసాలు ఎన్నో దేవుడా 
మారు రూపంతో వేషాలెన్నో దేవుడా 
అన్నీ ఉన్నా అనాధలమే దేవుడా 
మా ఆర్తులేమి  తీర్చలేవురా  దేవుడా 

మరి
ఏడ నీవు దాగున్నావురా దేవుడా
ఏమి నువ్వు చేస్తున్నావురా దేవుడా 


కదలకుండా నువ్వు ఉంటవు  కానరాకుండా ఉంటవు  
కోరిన కోర్కెలు వింటూ నీవు సేద తీరుతుంటవు 
కర్మ ,క్రియ అంటవు  కర్త నీవై ఉంటవు 
కర్మానుసారమే మా భారం అంటూ గీతోపదేశం ఇస్తావు 
నీలాగా మేము ఉండలేమురా  దేవుడా 
మమ్మల్ని కాస్త జాలి చూపరా దేవుడా 
ఆపదలేమి అవసరం లేదురా దేవుడా 
మా అవసరాలు మాకు తీర్చరా దేవుడా 
మా సంతోషాలు మాకు ఇవ్వరా దేవుడా 



//గరిమెళ్ళ గమనాలు//21. 09. 14//














Related Posts:

  • కవిత నెం : 315 (ధన దాసోహం) కవిత నెం : 315 *ధన దాసోహం * డబ్బుకు లోబడకు ఓ మనిషి నీ సర్వం కోల్పోకు మరమనిషి డాబుకు పోబోకు ఓ మనిషి నీ దారిని మరువకు మరమనిషి డబ్బును ప్రేమించకు ఓ… Read More
  • కవిత నెం :313(తెలుగునేడు ) కవిత నెం :313 *తెలుగునేడు * కవి అన్నా , కవిత్వమన్నా తెలియదు ఒకప్పుడు కవులు ,కవీశ్వరులు కోకొల్లలు ఇప్పుడు రాజుల కాలం నాడు మాత్రమే ఉన్న గుర్తింపు రాను… Read More
  • కవిత నెం : 317 (పసిడి కిరణాలు) కవిత నెం : 317 * పసిడి కిరణాలు * ముద్దు ముద్దు పిల్లలు ముత్యమల్లె ఉందురు ఆ పాల బుగ్గలు లేలేత మొగ్గలు పసి బోసి నవ్వులు పసిడి కాంతి మెరుపులు అమాయకపు చ… Read More
  • కవిత నెం :316(తెలుగు భాష) కవిత నెం :316 * తెలుగు భాష * తేనెలొలుకు భాష మన ''తెలుగు భాష '' అమ్మలాంటి కమ్మనైన భాష మన ''తెలుగు భాష '' సంస్కృతిలో చక్కెరదనంబు నిచ్చు భాష మన ''తెలు… Read More
  • కవిత నెం :318 (కొడుకు ఆవేదన) కవిత నెం :318 * కొడుకు ఆవేదన * అమ్మలకు ఎప్పుడూ కూతుళ్లపైనే అజా ,ఆరా కొడుకులంటే ఎందుకు ఆమెకి కన్నెర్ర కొడుకంటే కసాయివాడా ,కనికరం లేనివాడా ? కూతురంటే… Read More

0 comments:

Post a Comment