Saturday 13 September 2014

కవిత నెం41(ఆకాశం)

కవిత నెం :41// ఆకాశం //

ఆకాశం .............................

చిన్న పిల్లలకైనా ,పెద్ద వాళ్ళకైనా

ఆకాశమంటే ఆహ్లాదకరమైన ఓ ఆట విడుపు

భాదలో ఉన్నా , ఆనందంలో ఉన్నా

ఆకాశం వైపు ఓ అర క్షణం చూస్తే చాలు
వినపడుతుంది నీ మనసు పిలుపు

అందనంత దూరాన ఉంటూ

అందమైన అద్భుతాలను చూపిస్తూ ఉంటుంది

విశ్వమంతటా వ్యాపించియున్న వస్త్రం

నీలి వర్ణంతో కప్పబడియున్న ఆవరణం
అంతరిక్షానికి భూమికి మధ్య ఉన్న భూగోళిక కవచం

అవధులు లేని అనంతమైన శూన్యం

కనిపించే అబద్ధం - పలుకలేని నిజం
పగిలిపోయిన నిలువుటద్దం - ప్రతి ధ్వనించే నిశ్శబ్దం

వెన్నలను ,చీకటిలను కలిగియున్నది ఆకాశ జీవితం

మేఘమైనా ,చినుకునైనా అది ఆకాశ వర్షితం

అంతర్జాల పరిశోధనలకు నిలయం ఆకాశం

అంతరంగ భావాల కవితా నైపుటం ఆకాశం

మది సంబరం అంబరాన్ని తాకిన వేళ అంటారు

ఆ ''నింగి '' సాక్షిగా  అంటూ ప్రమాణాలు చేస్తారు 
ఆకాశం ఏనాటిదో అంటూ అనురాగాన్ని పోలుస్తారు 
దివి  నుండి భువికి దిగిన తారవో అంటూ సౌందర్యాన్ని చెప్తారు
ఏ టెక్నాలజీ లేని వేళలో ''ఆకాశ రామన్న '' లతోనే కదా సమాచారాలు  

చందమామ కధలు అయినా - ఇంద్ర ధనుస్సు సొగసులు అయినా 

అమ్మాయి అందమయినా - అమ్మ ప్రేమ బంధమయినా 
ఆకాశం అనే ''కోణం '' నుంచి చూపబడినవే 

నిర్మలమయిన ప్రేమకి చిహ్నం ''ఆకాశం ''

నిరాడంబరమయిన స్వచ్చత ''ఆకాశం ''
ఏ బంధం ఆపలేని స్వేచ్చ ''ఆకాశం ''
కాలంతర సుదూర ప్రయాణం ''ఆకాశం ''
ప్రకృతి ప్రసాదించిన పంచ భూతం ఈ ''ఆకాశం'' 

ఆకాశం గురించి విశదీకరించి చెప్పాలంటే 

ఆ ప్రయత్నం ''ఆకాశమంత '' లా చేస్తే గాని చెప్పలేము 










0 comments:

Post a Comment