Monday, 22 September 2014

కవిత నెం 46:భాద పడే భావం

కవిత నెం :46

భాద పడే భావం 
***********************

ఏం బాధరో ఇది పొంగుతున్నది 
ఏం బాధరో ఇది ఉబుకుతున్నది 
ఏం బాధరో ఇది ఆగకున్నది 
ఏం బాధరో గుండె పిండుతున్నది 

కళ్ళ నుంచి నీరు గార్చి 
కలతనేమో మనసుకిచ్చి 
ఒళ్ళంతా తడిపేసి 
చెమటలాగా చిందులేసి 

చిత్రవదనే చూపిస్తది 
విరిగిపోని వేదననే మిగులుస్తది 

కోపాన్ని భయటపెట్టి 
అసహనం చేతికిచ్చి 
ఏడ్వటమే మార్గమంటది 

వెర్రితనం  జతచేసి 
విచక్షణ చెరిపేసి 
వెక్కి వెక్కి దు:ఖాన్నే రగిలిస్తది 

అందమయిన మనసును 
మందంగా మార్చేసి 
మొండితనంతో మొరాయిస్తది 

ఎందరెన్ని చెప్పినా 
ఎంత ఓదార్చినా 
రచ్చ చేయటమే ఆపకుంటది 
  అందరినీ దూరంచేసి 
ఒంటరిని పరిచయం చేసి 
నీ నెత్తి మీద కుండ లాగా కూర్చుంటది 

నీ మాట మాత్రమే అది వింటది 
ఆనందమే తనకు దూరమంటది 

భాద అంతా భయటికి పోయినాక 
రాయి లాంటి మనసునే హాయి చేస్తది 

//గరిమెళ్ళ గమనాలు//22. 09. 2014//

Related Posts:

  • కవిత నెం146:బంధాలు కవిత నెం :146 ఏమిటి ఈ బంధాలు  ఏమిటి ఈ బావుకతలశ్రావ్యాలు  ఏమిటి ఈ నేస్తాలు  ఏమిటి ఈ పరిచయాలు  ఏమిటి ఈ ఆనంద క్షణాలు  ఏమ… Read More
  • కవిత నెం145:నన్ను మార్చిన నీవు కవిత నెం :145 *నన్ను మార్చిన నీవు * కదలని బండరాయిలా ఉన్నా ఇన్నాళ్ళు  నన్ను కదిలే శిల్పాని గా చేసావు  గాలికి ఊగని గోడగా  నిలుచున్నా … Read More
  • కవిత నెం143:ప్రియుడు కవిత నెం :143 ప్రేయసి రావే నా ఊర్వసి రావే అనే పాటకు ప్రియురాలి హృదయం స్పందిస్తుందా ? ప్రియుడితో ప్రేమాయణం సాగించేటప్పుడు తన కంటి చూపుతో వాడ… Read More
  • కవిత నెం147:ఎవరు నీవు కవిత నెం :147 *ఎవరు నీవు * నిన్ను నేను విడువగలనా నీ చెలిమిని నేను మరువగలనా నా బాధలో ఆనందం నీవు  నా కష్టంలో సుఖం నీవు  నా మనసులో హాయి న… Read More
  • కవిత నెం144:చెలీ నీవెక్కడ కవిత నెం :144 *చెలీ నీవెక్కడ * రోజూ గడుస్తున్నదే  పొద్దు వాలుచున్నదే  చెలీ నీ జాడ ఏడున్నదే మబ్బు పట్టుతున్నదే  చినుకు పడుతూ ఉన… Read More

0 comments:

Post a Comment