Home »
» కవిత నెం50:మహిషాసురమర్దిని
కవిత నెం :50
మహిషాసురమర్దిని
********************
రంభుడు అనే రాక్షసుణి పుత్రుడు మహిషుడు
బ్రహ్మ వరంతో వరగర్వితుడై లోక కంటకుడయ్యాడు
మదబలముతో దేవేంద్రుని ఓడించి ఇంద్రపదవినొందాడు
మహిషునిపై పుట్టిన క్రోదాగ్ని తేజముగా ఉద్భవించే
ఆ త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై స్త్రీ రూపముగా జన్మించే
శివుని తేజము ముఖముగా ,విష్ణు తేజము భాహువులుగా
బ్రహ్మ తేజము పాదములుగా - దుర్గా దేవిగా అవతరించే
పద్మా సనస్థయైన ఆ తేజో : పుంజరూపిణికి
సర్వదేవతలు సమస్తాయుదాలను సమకూర్చే
లోకాలు అదిరేలా హూంకార ధ్వని చేస్తూ దేవి కదిలే
సింహసనేశ్వరియై గర్జిస్తూ ఘీంకరిస్తూ సాగే
ప్రళయాగ్ని ని చిందిస్తూ ఘోరముగా యుద్ధం చేసే
రౌద్ర రూపం దాల్చి మహిషాసురుణ్ణి సంహరించే
మహిషుని చంపగా తానూ మహిశాసురమర్దినిగా
బెజవాడ ''ఇంద్ర కీలాద్రి'' పై దుర్గా దేవిగా అవతరించే
ఆదిశంకరులు మహిషాసురమర్దిని స్తోత్రముతో
నిత్యం అయిగిరి నందిని గా పూజలు అందుకొనుచుండే
జయ జయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
పాహిమాం పాహిమాం దేవి సర్వ భగవతీ నమోస్తుతే
Related Posts:
కవిత నెం82:నీతో నీవు కాసేపు
కవిత నెం :82
నీతో నీవు కాసేపు
**************************
ఎప్పటికప్పుడు నువ్వే గ్రేట్ గా
చేసిన తప్పులో ఒప్పే నీదిగా
ఎందుకలా ఎదురుద… Read More
కవిత నెం78:సానుభూతి
కవిత నెం :78
సానుభూతి
******************************************
మనం నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు
మరొకరు జాలిగా చూసే చూపు ''సానుభూతి ''
ఒకరి సహాయం మ… Read More
కవిత నెం79:ఏమౌతుంది
కవిత నెం :79 //ఏమౌతుంది //
ఏమౌతుంది ...................
మనసు మూగబోయింది
మాట పొదుపు నేర్చింది
కాలం ముందుకెళ్తుంది
సమయం జారిపోతుంది
ఆశ అల్లుకుప… Read More
కవిత నెం 77:ప్రేమ కోసం - కవితా ''కారం ''
కవిత నెం :77
ప్రేమ కోసం - కవితా ''కారం ''
****************************
నమస్కారం !
నువ్వంటే నాకు ''మమకారం''
కాదు అది ''చమత్కారం''
నీ నవ్వు ఒక '… Read More
కవిత నెం81:ప్రేమిస్తా
కవిత నెం :81
ప్రేమను ప్రేమగా పొందాను ,పొందుతున్నాను
ప్రేమను ప్రేమగా చూడటమంటే తెలుసుకున్నాను
ప్రేమకు అర్ధమే నీవని ,నీవుంటే ఏమీ అవసరంలేదని… Read More
0 comments:
Post a Comment