Monday, 15 September 2014

కవిత నెం 42:నీ బ్రతుకు -నీ ఉరుకు

కవిత నెం :42

నీ బ్రతుకు -నీ ఉరుకు  
***********************
ఎవరు  తీర్చగలరు నీ ఇంటి భాదలు
ఎవరు మోయగలరు నీ అశ్రుధారలు
నడుచుచున్న సమాజమే - నడవలేదుగా
కదులుతున్న కాలమే -కలుపలేదుగా
నీ బ్రతుకు నీది , నీ ఉరుకు నీది  //2//
బ్రతకగలవనుకుంటే అడుగు వెయ్యి

అందే అవకాశం - అది ఓ ప్రతి భింభం
నమ్మకం నీవైతే - అది చంద్ర భింభం
ఆగిపోకు అలసిపోయి - జారిపోకు నీరు గారి
గుండె నిండా బలం నింపి - ఊపిరినే విల్లు చేసి
సాగిపో సంద్రమై - నిలచిపో స్థైర్యమై

ఎవ్వరాపగలరు నీ వెలుగు రేఖలు
ఎవ్వరాపగలరు నీ చిరు నవ్వులు


నడిచే నీ పయనం - పారే జలపాతం 
ప్రయత్నం నీవైతే - చేరుతుంది గమ్యం 
ఆటు పోట్లు ఉంటాయి - అలలు అడ్డుపడతాయి 
మనసు నిబ్బరం చేసుకుని - ఆలోచనే ఆయుధంగా మలుచుకుని 
ఉరికే కెరటమై - మారిపో విజయమై 

ఎవ్వరాపగలరు నీ వెలుగు రేఖలు
ఎవ్వరాపగలరు నీ చిరు నవ్వులు

//గరిమెళ్ళ గమనాలు // 15.09.2014 //

Related Posts:

  • కవిత నెం 206:ఫేస్ బుక్ స్నేహాలు కవిత నెం :206 ఫేస్ బుక్ స్నేహాలు ముఖాలు కనపడవు - ముఖ చిత్రాలు ఉంటాయి  మనసు తెలియదు - మాటలెన్నో చెప్తాయి  చిరునామా తెలియదు - కొత్త స్నేహాల… Read More
  • కవిత నెం 209:అసహనం కవిత నెం :209 //అసహనం // చంటి పిల్లవాడికి  తను అడిగింది ఇవ్వకపోతే  వాడు అసహనమే చూపుతాడు  పిల్లలు తమ మాట విననప్పుడు  చెప్పి చెప… Read More
  • కవిత నెం 218:మాటే మంత్రం కవిత నెం :218 * మాటే మంత్రం * మన మాట సంకల్పితంగా వచ్చేది  మన నోటి నుండి జారే ప్రతీ మాటకు మనమే బాధ్యులం  అనాలోచితంగా కొన్ని మాట్లాడితే&nbs… Read More
  • కవిత నెం 211:నిజం అబద్దంల నిజం కవిత నెం :211 నిజం అబద్దంల నిజం   నిజమెప్పుడూ లోపలే దాగుంటుంది  ఎందుకంటే అబద్దం అందంగా ఉంటుంది కాబట్టి  నీకు తెలిసింది కాబట్టి… Read More
  • కవిత నెం 231:ఆర్టీసీ బస్సు కవిత నెం :231 * ఆర్టీసీ బస్సు * ఆర్టీసీ బస్సు ఓ ఆర్టీసీ బస్సు మీది మీదికొస్తావు ఆర్టీసీ బస్సు ఆర్టీసీ బస్సు ఓ ఆర్టీసీ బస్సు రోడ్డు మొత్తం తిరుగుతావ… Read More

0 comments:

Post a Comment