కవిత నెం :49
శక్తి స్వరూపిణి
*****************
అంబపరమేశ్వరి ,అఖిలాండేశ్వరి ,ఆదిపరాశక్తివే
శ్రీ భువనేశ్వరి , రాజ రాజేశ్వరి ,బాలత్రిపురాసుందరివే
సర్వలోక రక్షిణి, సర్వ జ్ఞాన ప్రదాయిని మా శక్తి స్వరూపిణివే
సర్వ సృష్టికే మూలాధారం నీ శక్తి రూపమే
ఆయా దేవతల్లో ఆయా శక్తి రూపాల్లో ఇమిడి ఉన్నది నీవేలే
అభయమునిచ్చి ,ఆకలితీర్చగా అన్నపూర్ణవు నీవేలే
త్రిమూర్తుల విధులకు నెలవు తల్లీ నీ కరుణే
బ్రహ్మలో కొలువైవున్న రాజసశక్తి నీవేలే
భక్తులను లాలించే మాతృస్వరూపం నీవేలే
రక్కసులను మట్టుపెట్టగా ఉగ్రరూపం నీవేలే
కోరిన కోర్కెలు నొసగును నీవు మా కొంగు బంగారమే
సహనముతో స్త్రీ పాలిట నిలచే శక్తి షాలిని నీవేలే
మా భ్రమణాలను తొలగించే మంత్రం - నీ మందహాసం
మా కష్ట నష్టాలను దూరం చేసే ఒడి - నీ అనురాగామృతం
సకల సంపదలు , సంతాన సౌభాగ్యం నిచ్చే అమృతమూర్తివే
తల్లీ నీ ఆవిర్భావం సకల మానవ కల్యాణం
ప్రపంచ మానవ విశ్వ సౌందర్యానికే ప్రతీకలు నీ త్రినేత్రాలు
ఆద్యాత్మిక శక్తికి సంకేతం అమ్మా నీ త్రిశూలం
జగత్ యొక్క చలనానికి ప్రతీక నీ ధర్మ చక్రం
తల్లి ప్రేమకే నిదర్శనం జగన్మాత స్వరూపం
//గరిమెళ్ళ గమనాలు// హైదరాబాద్ //
సాహితీ చిత్ర పోటీ కొరకు - 29. 09. 2014

0 comments:
Post a Comment