Saturday, 6 September 2014

కవిత నెం40:బాపు బొమ్మలు

కవిత నెం :40 //బాపు బొమ్మలు//
******************************

ఎంత చూసినా తనివి తీరనిది ''బాపు బొమ్మ ''
ఎన్ని సార్లు వర్ణించినా మనసు నిండనిది మన ''బాపు బొమ్మ ''
ఒక్కో గీతలో ఒక్కో భావం -  ఒక్కో బొమ్మ ఒక్కో ఇతిహాసం ,గ్రంధం 
ఇంద్ర ధనస్సును తీసుకుని కుంచెగా మార్చినట్టు 
ప్రకృతిని లొంగ దీసుకుని ఆ అందాలకు రంగులద్దినట్టు 
సప్త స్వరాల సొగసులను రంగరించినట్టు 
నవ రసాలను పిలిపించి జీవం పోసినట్టు ఉండేదే మన ''బాపు బొమ్మ''
త్యాగ రాజు కీర్తనలా ,తెలుగింటి తొలి ముగ్గులా లక్షణమైనది మన ''బాపు బొమ్మ ''
బాపు బొమ్మలు ప్రాణంతో కదిలే జీవాలు 
బాపు బొమ్మలు సందేశాత్మక సమిధులు 
బాపు బొమ్మలు రసవత్తర కావ్యాలు 
బాపు బొమ్మలు రమణీయత కల్గిన శ్రావ్యాలు 
బాపు బొమ్మలు కళాత్మకత రూపాలు 
బాపు బొమ్మల్లో  దాగి ఉన్నవి అందం ,ఆనందం ,అశ్యరం . 
బాపు బొమ్మలు మాట్లాడతాయి ,కవ్విస్తాయి ,నవ్విస్తాయి ,ఆలోచింపచేస్తాయి 
బాపు బొమ్మలు ఆద్యాత్మికతకు అద్దం పట్టినట్టు ఉంటాయి 
బాపు బొమ్మలు సమాజం పట్ల మన నైతిక భాద్యతను గుర్తు చేస్తాయి 
అమ్మతనం అయినా ,అమ్మాయి తనం అయిన అది ఒక్క  బాపుకి మాత్రమే సొంతం
తెలుగుదనానికి వెలుగును అద్ది , తెలుగు జాతికే వరమైనది మన ''బాపు బొమ్మ ''
బాపు బొమ్మల్లో విద్యుత్తు ఉంటుంది ,విద్వత్తు ఉంటుంది అని శ్రీ రమణ ఊరికే చెప్పలేదు
నిజంగానే అయన బొమ్మలు మది మకుటాన్ని సైతం నిద్ర లేపుతాయి
మనల్ని మంత్ర ముగ్దుల్ని చేస్తాయి, మనోహరంగా వాటికవే సింగారించుకుంటాయి
అందుకే మన బాపు బొమ్మలు ''బాపురే'' అన్నట్టు ఉంటాయి ఈ నాటికి ఏ నాటికి
అందుకే ప్రపంచ చరిత్రలో కూడా నిలిచింది వాటి కీర్తి .











Related Posts:

  • కవిత నెం 102:ఈ క్షణమే నీ సొంతం కవిత నెం :102 *ఈ క్షణమే నీ సొంతం * గడిచే ఈ క్షణమే ఆనందం  ఈ క్షణాన్ని ఆనందించే ఓ నేస్తం  చిరునవ్వు నీ ఆయుధం  చింతల్ని వదిలేయ్ నేస్తం&nb… Read More
  • కవిత నెం103:నిర్ణయం నీ పరం కవిత నెం :103 ఖాళీగా ఉండే సమయం ఆలోచన చేసెను పయనం అదియేరా ఆరంభం నిర్ణయం నీ పరం చేసుకో ఉల్లాసం నీ మనసుని పసిపాపలా చూసుకోరా నీ మనసుని చిన్నపిల్లల&nb… Read More
  • కవిత నెం104:శ్రీ ఆంజనేయం కవిత నెం :104 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం  శ్రీ రామరక్షం శ్రీ సీతాసమేతం  నీవుంటే ప్రియం ప్రియం  నీవు ఉండగా రాదు భయం  నీ నామ బలం&… Read More
  • కవిత నెం 105:శివోహం కవిత నెం :105 ఓం నమ శివాయ నమః  శివోహం హరిహి ఓం  ప్రభోదం ప్రణమాయ నమః  హరిహర మహాదేవ  శంబోశంకర హర హర హర  నీవే ఓంకారం … Read More
  • కవిత నెం 101:నాకలం నడుస్తుంది కవిత నెం :101 నాకలం నడుస్తుంది అభ్యదయ భావాల వైపు నాకలం నడుస్తుంది ఆశల అడుగుల వైపు నాకలం నడుస్తుంది రమణీయ సాహిత్యం వైపు నాకలం నడుస్తుంది స్వరనీయమైన క… Read More

0 comments:

Post a Comment