Thursday, 27 November 2014

కవిత నెం67(రైలు నడుస్తుంటే)

కవిత నెం :67
రైలు నడుస్తుంటే 
*******************


రైలు నడుస్తుంటే.......
పొగమంచుల నుంచి
దూరపు కొండల మద్య నుంచి
పచ్చని పైరు చేల నుంచి
చల్లని హోరు గాలి నుంచి
పొడిచే సూరీడు వస్తున్నాడు
రైలు బండి వేగంతో
ఎర్రని సూరీడు ఎగురుతున్నాడు
పొడిపొడిగా సూర్యరశ్మిని
రైలు కిటికీలనుంచి
తలుపులనుంచి
మనకు అందిస్తున్నాడు

రైలు నడుస్తుంటే.....
చూస్తే పట్టాలు కొట్టుకుంటాయి
చూస్తే  పట్టాలు పరిగెడుతుంటాయి
రైలు కింద నుంచి భూమి
ఎంతో వేగంతో వెనక్కి వెళుతున్నట్టు ఉంటుంది
కంకర రాళ్ల రూపం కనుమరుగై
గాలిలో కలుస్తున్నట్లు ఉంటుంది

రైలు నడుస్తుంటే..................
పక్కన ఆగివున్న రైలు కూడా
వేగంగా పరిగెడుతున్నట్లు ఉంటుంది
మన రైలు ఆగినప్పుడు
పక్క రైలు కదులుతుంటే
మనదే కదులుతున్నట్లు అనిపిస్తుంది
పక్కన కరెంటు తీగలు ,స్తంభాలు
జివ్వు జివ్వు మంటూ ఎదురవుతూ ఉంటాయి
దూరంగా చూసే ప్రదేశాలు
చాలా చిన్నవిగా కనిపిస్తాయి
భూమి తిరుగుతూ ఉంటుంది
అనే దృశ్యాన్ని కనులార చూస్తునట్టు ఉంటుంది

రైలు నడుస్తుంటే..............
ఒక నదిపై ఉన్న బ్రిడ్జి నుంచి
రైలు గాలిలో నడుస్తుందా అన్నట్టు ఉంటుంది
ఊయలలో ఊగుతున్న భావం మనకు ఒక వైపు
ఏదో గుండె భారం తీరుతున్నట్టు అనే ఆహ్లాదం మరో వైపు
ప్రపంచమంతా మర్చిపోయినట్టు
మనం సరికొత్త గమనంలో ఉన్నట్టు
మన ప్రయాణం మనకే
మరో నయనంలా కనిపిస్తుంది
వినీలాకాశంలో
విహంగాపక్షివై నువ్వే
ఎగురుతున్నట్టు అనిపిస్తుంది

రైలు నడుస్తుంటే...................
ఏవో జ్ఞాపకాలు మనసుని అలా తాకి
గాలి స్పర్శకి అలా జారిపోతూ
మనకి గుర్తు చేస్తూ ఉంటుంది
ఎంతైనా అద్బుతమైనది
రైలు ప్రయాణం
భూలోక సుందర వర్ణంలో
అందమైన భోగి ప్రయాణం
అందరికీ ఇష్టమైన ప్రయాణం
అరుదుగా చేసినా
మంచి అనుభూతి

రైలు ప్రయాణం
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
//గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు //28. 11. 2014//


Related Posts:

  • కవిత నెం 214:జీవిత మజిలి కవిత నెం :214 *జీవిత మజిలి * జీవితం ఒక రంగులరాట్నం కాలం ఒక మంత్రదండం మనిషి ఒక కళాత్మకవస్తువు ఏదో చెయ్యాలని అనుకుంటాం ఏదో దొరికిందని తృప్తి పడతాం బాధ్… Read More
  • కవిత నెం 212:వీడ్కోలు 2015- స్వాగతం 2016 కవిత నెం :212 వీడ్కోలు 2015- స్వాగతం 2016 గతాన్ని విడనాడాలి కాని గత సృతులు కాదు కష్టాల్ని మరువాలి కాని కష్టపడటం కాదు చెడు నుంచి నేర్చుకోవాలి కాని చ… Read More
  • కవిత నెం 208:నేను కవినేనా ? కవిత నెం :208 నేను కవినేనా  నేను కవినేనా  మనసు పెట్టే రాస్తాను  నా కాలానికి పని చెబుతుంటాను  మరి నేను కవినేనా ? అక్షరాలను కలుప… Read More
  • కవిత నెం 215:సోషల్ మీడియా స్నేహ గురి కవిత నెం :215 సోషల్ మీడియా స్నేహ గురి :- ఏది నిజం ఏది కల్పితం  ఎవరో తెలియదు  ఏమి పోస్టు చేస్తున్నారో తెలియదు  అనుభవజ్ఞులు ,మేధ… Read More
  • కవిత నెం 210 :ఒక్కడినే కవిత నెం :210 ఒక్కడినే  నాలో నేనే ఒక్కడినే  నాతో నేనే ఒక్కడినే  నా ముందు నేను  నా వెనుక నేను  నా చుట్టూ నేను  నేనంతా … Read More

0 comments:

Post a Comment