Monday 1 December 2014

కవిత నెం68:నీవుంటే చాలు .. నీకై నేనుంటాను

కవిత నెం :68

నీవుంటే చాలు .. నీకై నేనుంటాను 
***************************
నిన్ను తలుచుకుంటే చాలు 
ప్రేమ సుగంధాలు వీస్తున్నాయి 
నీవు నా చెంత ఉన్నావన్న ఊహ చాలు 
నాలో ప్రణయ ప్రకంపనలు బయలు దేరతాయి 
నీ చెలిమి అందింది నా కది చాలు 
జన్మజన్మాంతము జీవించే ఆయుష్షునిస్తుంది 
నీ నయన  లోగిళ్ళు నా వెంట ఉంటే చాలు 
నీ వలపు కౌగిళ్ళలో నన్ను బందించటానికి 
నీ అధరామృత స్పర్శ చాలు 
నాలో ప్రేమధారలు పొంగి పొరలుటానికి 
నీపై నేను కావ్యాలు కురిపించలేను 
కాని కమనీయమైన ప్రేమ మాధుర్యాన్ని పంచగలను 
నీ చిత్రాన్ని రావివర్మలా నే గీయలేను 
కాని రమణీయమైన నీ రూపాన్ని నా మదిలో ముద్రించుకోగలను 
నా ప్రేమను నిరూపించటానికి మునిలా తపస్సు చేయలేను 
కాని నా నోట నీ పేరును పదే పదే కలవరించగలను 
నీ సొగసుల అందాలకు తాజ్ మహల్  కట్టలేను 
కాని నీ సొగసు కుసుమాలకు దాసుణ్ణి నేను 
నీవు లేని ఎడబాటుని భరించలేను 
నీవున్న క్షణంతో కాలయాపన చేయలేను 
అందమైన అబద్దాన్ని చెప్పి మెప్పించలేను 
కాని నా ప్రేమ నిజమని నిజాయితీగా చెప్పగలను 
నీ కోసం నిరీక్షణ చేయగలను 
కాని నీ జ్ఞాపకాలకు మాత్రం కాదు 
నీడలా నీ వెంటరాగలను 
నా తోడుగా నీకు నిండు నూరేళ్ళు తోడుగా ఉంటాను 

//రాజేంద్ర ప్రసాదు //01. 12. 14//

0 comments:

Post a Comment