Monday 8 December 2014

కవిత నెం74(ప్రాస కనికట్టు )

కవిత నెం :74

 ప్రాస కనికట్టు 
**************************** 

మంచికొక లైక్ కొట్టు 
చెడునైతే చెదరగొట్టు 
చిరునవ్వు కివ్వు తొలిమెట్టు 
హాస్యాన్ని పంచిపెట్టు 
న్యాయానికి జై కొట్టు 
అన్యాయంకెయ్యి ఆనకట్టు 
స్వార్ధాన్ని మట్టుపెట్టు 
పరమార్ధాన్ని కనిపెట్టు 
సత్యాన్ని నిలబెట్టు 
అబద్దాన్ని కట్టిపెట్టు 
మానవతకు ముద్దుపెట్టు
ఉన్మాదం పనిపట్టు
స్నేహానికి చెయ్యిపట్టు
శత్రువులను విడిచిపెట్టు 
కోపాన్ని అదుపుపెట్టు 
ప్రశాంతతను పిలిచిపెట్టు
భయాన్ని దాచిపెట్టు 
ధైర్యానికి పదునుపెట్టు 
దేవుడికి దండంపెట్టు
పెద్దలకు నమస్తేకొట్టు 
గర్వాన్ని అణచిపెట్టు 
గౌరవాన్ని అమలుపెట్టు 
నిద్రొస్తే గుర్రుపెట్టు 
అమ్మప్రేమను గుర్తు పట్టు 
కష్టాన్ని  కష్టపెట్టు 
అది సుఖాలకు ఆయువుపట్టు
ప్రేమను ప్రేమించిపెట్టు 
విలువలను కాపాడిపెట్టు 
బందాలకు  చూపించకు బెట్టు 
బద్దకాన్ని బద్దలుకొట్టు
నిర్లక్ష్యాన్ని నేలకేసికొట్టు  
గొడవలకు గోడకట్టు
సమైక్యతకు నడుంకట్టు 
లక్ష్యం మీద మనసుపెట్టు 
విజయం నీదే ఒట్టు 
కుల మతాలకు కొబ్బరికాయ కొట్టు 
భరతమాతకు వందనంపెట్టు 
జీవితానికి రాజీకట్టు 
సంతోషాలకు వెల్కమ్ కొట్టు 

//రాజేంద్ర ప్రసాదు // 09. 12. 14 //








    

0 comments:

Post a Comment