Wednesday 3 December 2014

కవిత నెం73:బాల్య సొగసులు

కవిత నెం :73

బాల్య సొగసులు  : (శ్రీ పద్మ )
************************************
అమ్మపొత్తిళ్ళలో  ముద్దుగా మురిసిన బాల్యం
నాన్న గారాబంతో గుఱ్ఱపు ఆటలు ఆడిన బాల్యం
చందమామ పాటలతో గోరుముద్దలు తిన్న బాల్యం
గోనెసంచులు కప్పుకుని వానలో చిందులేసిన బాల్యం
కాగితపు పడవలు చేసి కేరింతలు కొట్టిన బాల్యం
బడి కెళ్ళనని  మారం చేస్తూ ,బెట్టు చేసిన బాల్యం 
వేమనపద్యం ,సుమతీ శతకాలు అప్పచెప్పిన బాల్యం 
వెంకటేశ్వర & కో పుస్తకంలో ఎక్కాలను గణించడాలు 
పుట్టమన్నుతో బొమ్మరిల్లు కట్టి ,చేసిన బొమ్మల పెళ్లిళ్లు  
చింత ,వేప చెట్ల కింద ఉయ్యాలల తుళ్ళింతలు 
తామరపువ్వులతో తన్మయత్వం చెందిన క్షణాలు 
పంటపొలాలలో పక్షుల సవ్వడుల పలకరింపులు 
తాటికాయల బండ్లు కట్టి,గుంపులుగా  తోలడాలు 
తుమ్మెదలకు దారంకట్టి తుంటరిగా ఎగురవెయ్యడాలు 
తాటాకులతో సన్నాయిని చేసి ఊదడాలు 
పుల్ల ఐసు ,పీచుమిఠాయి లను  ఆస్వాదించడాలు 
స్వాతంత్ర్య దినమున భరతమాత వేష ధారణలు 
స్వేచ్చాజీవుల వలే స్వతంత్రంగా విహరించిన వైనం 
ప్రతి అనుభూతి మరపురాని ఒక మధుర జ్ఞాపకం 






0 comments:

Post a Comment