Tuesday, 2 December 2014

కవిత నెం69:నా చెలికత్తె

కవిత నెం :69

నా చెలికత్తె 
**********************

నా జతవు నీవు ,నా చెలికత్తెవు నీవు 
నా తనువు నీవు ,నా తారామణి నీవు 
నా ఎదపై వాలిన ప్రేమతుమ్మెదవు నీవు 
నా హృదయంలో నిదురించే నా చెలివి నీవు 
కలలో నిదురరానీయకుండా చేసే కలలరాణివి నీవు 
వెండిమబ్బుల పల్లకిలో నుంచి వచ్చిన చందమామవు నీవు 
ఆకాశం నుంచి నేలపై జారిన మెరుపువు నీవు 
నా కోసం మిగిలిన ఒకే ఒక్క దేవకన్యవు నీవు 
అందాలలోకంలో విహరించే ప్రపంచసుందరి నీవు 
నా పదిలమైన పిలుపులో స్వరం నీవు 
నా సున్నితమైన శ్వాసకు ఊపిరి నీవు 
నే నెటువెళ్ళినా వెంబడించే నెరజాణవు నీవు 
నా కంటూ ఉన్న ,నా కోసం ఉన్న ప్రేయసి నీవు 
నాలో నీవు - నా చుట్టూ నీవు 
నాతొ నీవు -ప్రేమతో నీవు  
//రాజేంద్ర ప్రసాదు //30. 11 . 14//

Related Posts:

  • కవిత నెం 204:నేటి చుట్టరికాలు కవిత నెం :204 **నేటి చుట్టరికాలు ** పేరుకి ఉంటుంది రక్త సంబంధం  కాని మనసులకి ఉండదు ఏ సంబంధం  కలిసి యుండలేరు  కలిసినా మనస్పూర్తిగా మ… Read More
  • కవిత నెం 209:అసహనం కవిత నెం :209 //అసహనం // చంటి పిల్లవాడికి  తను అడిగింది ఇవ్వకపోతే  వాడు అసహనమే చూపుతాడు  పిల్లలు తమ మాట విననప్పుడు  చెప్పి చెప… Read More
  • కవిత నెం 206:ఫేస్ బుక్ స్నేహాలు కవిత నెం :206 ఫేస్ బుక్ స్నేహాలు ముఖాలు కనపడవు - ముఖ చిత్రాలు ఉంటాయి  మనసు తెలియదు - మాటలెన్నో చెప్తాయి  చిరునామా తెలియదు - కొత్త స్నేహాల… Read More
  • కవిత నెం 211:నిజం అబద్దంల నిజం కవిత నెం :211 నిజం అబద్దంల నిజం   నిజమెప్పుడూ లోపలే దాగుంటుంది  ఎందుకంటే అబద్దం అందంగా ఉంటుంది కాబట్టి  నీకు తెలిసింది కాబట్టి… Read More
  • కవిత నెం 205 :ఆడు మగాడు కవిత నెం : 205 అంతర్జాతీయ మగవారి దినోత్సవం సంధర్భంగా  ******************************************** ((((((((((ఆడు మగాడు ))))))) ________________… Read More

0 comments:

Post a Comment