Tuesday, 27 October 2015

కవిత నెం 200:గుండె చప్పుడు

కవిత నెం :200

గుండె చప్పుడు 

నాలో నేనే నీలా 
నీలో నీవే నాలా 
ఒక్కసారిగా ఒక్కటై 
ప్రతిస్పందన మొదలై 
మనలో మనమే చేరగా 

ఏమంటారు దానినే 
గుండె చప్పుడు ... గుండె చప్పుడు 

నీ ఆలోచనలో నేనే ఉండగా 
నా ఆలోచనలో నీవే నిండగా 
నా కనులలో వెలుగు నీవేగా 
నీ శ్వాషలో ఊపిరి నేనుగా 

ఒకరికి ఒకరం 
ఒక్కసారిగా ఇద్దరం 


అంటారేమో దీనినే 
గుండె చప్పుడు ... గుండె చప్పుడు 

నీ వెళ్లే చోటనే నేనే రానా 
నే నడిచే బాటలో అడుగివి నీవుగా 
వింటున్నా నీ పేరే ఒక సంగీతంలా 
నీ పిలుపే నాకు ఒక ఆలాపంలా 

ఒకరిలో ఒకరం 
అర్ధసగమై ఇద్దరం 


అంటారేమో దీనినే 
గుండె చప్పుడు ... గుండె చప్పుడు 


నా మనసులో మాటే నీదిగా 
నీ మనసున్న చోటే నాదిగా 
నీ చేతిలో ఉండే రేఖలా 
నా నుదిటిన ఉండే గీతలా 

ఒకరై మనం 
ఒకరికోసం ఒకరం 


అంటారేమో దీనినే 
గుండె చప్పుడు ... గుండె చప్పుడు 




Related Posts:

  • కవిత నెం96:మల్లె పువ్వు కవిత నెం :96 //మల్లె పువ్వు // *మల్లె పువ్వు * రచన : 13 ,హైదరాబాద్ ఇది మనసుని దోచే పువ్వు ఇది మనసుకి హత్తుకునే పువ్వు ఇది మన ఊసుల్ని కదిలిం… Read More
  • కవిత నెం 99:హాయైనా జీవితం కవిత నెం :99 హాయైనా జీవితం అందరికీ అద్బుతం జీవించటం అవసరం జననం మరణం normal  అందివచ్చే ఆనందం దరిచేరగా చెంతవుండే కన్నీరు తడి అవునుగా కష్టాల… Read More
  • కవిత నెం94:చదువు కవిత నెం :94 చదువు  రచన : 19 , హైదరాబాద్  అ, ఆ, ఇ, ఈ ల చదువు  అమ్మ , నాన్నల పదాలకే చదువు  ఆరు బయట చదువులు  వీడ… Read More
  • కవిత నెం97:ఒక మైలు రాయిని నేను కవిత నెం :97 ఒక మైలు రాయిని నేను ****************** ఒక మైలు రాయిని నేను  నా  ప్రయాణంలో కాని కదిలే మైలు రాయిని నేను నా ఎదురుబాటలో ఇ… Read More
  • కవిత నెం98:ఓ జీసస్ - నీకు హ్యాపీ క్రిస్మస్ కవిత నెం :98 @ఓ జీసస్ - నీకు హ్యాపీ క్రిస్మస్ @ ఓ జీసస్ - నీకు హ్యాపీ క్రిస్మస్ శుబోదయమున ఆరాధన నుంచి సాయం సమయమున ప్రార్దన దాకా హాయిగా అనుభవిం… Read More

0 comments:

Post a Comment