Wednesday 28 October 2015

కవిత నెం 201(అప్పుల తిప్పలు)

కవిత నెం :201

'అప్పుల తిప్పలు ''

అప్పుల తిప్పలు 
ఇవి ఎవ్వరికే చెప్పుడు 

ఆదియందు అందంగా 
రాను రాను భారంగా 

మన ఆలోచనలను ఘోరంగా 
అంతరాత్మలో కలత నిరంతరంగా 

నిద్రవచ్చినా పోనీయ'కుండా 
ఆకలివేసినా తిననీయకుండా 

వెక్కిరిస్తుంటుంది వెటకారంగా 
వేడుక చూస్తుంటుంది వినోదంగా 

జీవితానికి అవసరం డబ్బైతే 
అవసరమైన వేళ అది సర్దుబాటుకాకపోతే 
నేనున్నా అంటూ ''స్నేహమై '' నిన్ను చేరేదే అప్పు 

ఒకప్పుడు అప్పు దొరకటం చాలా కష్టమే 
ఇప్పుడు తలుచుకుంటే చాలు తలుపు తడుతుంది 

అది తీర్చేంత వరకు నిన్ను వెంబడిస్తుంది 
అందరికీ సులువు కాదు అప్పుల్ని తీర్చటం 

అప్పు చేసి తుర్రు మనే వాళ్లు ఉన్న ఈ కాలంలో 
అప్పు చేసి బోరు మని ఆత్మాహుతి చేసుకునే వాళ్లు ఉన్నారు 

క్రమంగా అప్పును మాపుకునే వారు  ఉన్న ఈ కాలంలో 
అక్రమంగా చేసిన అప్పుకు వడ్డీ బాదే వారూ ఉన్నారు 

అందుకే అప్పంటే భయపడి దూరంగా ఉండేవాళ్లు ఉంటే 
అవసరానికి తప్పక అప్పు చేసి ఇరుక్కునే వాళ్లు కొందరు 

ఏదైనా ఇది అమృతమే తీర్చగల్గే సమర్ధత ఉంటే 
మన అసమర్ధతతో భుజాన వేసుకుంటే ఇక విషమే 

మన అవసరం తీరటానికి చెయ్యాలి 'ఋణం '
అప్పుతో చెలగాటమాడితే మన జీవితమే 'రణం '

అప్పు చేసి పప్పు కూడు అన్నమాట ఏమోగాని 
అప్పు చేసి ముప్పు కూడరాదు నిజమేమో 

అప్పుతో తప్పు చెయ్యకు 
అది నిప్పై నిన్ను దహించేస్తుంది 



0 comments:

Post a Comment