Monday 9 February 2015

కవిత నెం 80(మరణం)

కవిత నెం :80

నేడు సంభవిస్తున్న మరణాలను చూసి 
మనసు వేదన చెంది మరణాన్ని ప్రశ్నిస్తున్న వేళ నా ఈ ''మరణం '' పై కవిత 
//////మరణం //////////
మరణం మరణం మరణం 
నీకు ఉండదా ఏ తరుణం
చల్లగా నీవు వస్తావో 
నిశ్శబ్దం సృష్టిస్తావో 
ఎప్పుడు ఏ మూల ఉంటావో 
ఏడ ఏడ దాగుంటావో

ఎవ్వరు నీకు బంధువు కాదు 
ఎవ్వరు నీకు శత్రువు కాదు 
మరి ఏమని నువ్వు ఎదురొస్తావు
ఎందుకిలా శాసిస్తావు
కాలమైన నీ జోడి కాదు 
నీ జడి దెబ్బకు సాటి లేదు 

ఒక్కసారిగా సాగే చక్రం 

ఉన్నపాటున ఆగునా ?
దిక్కులన్నీ నడిచే క్రమమున 
ఏ దిక్కులేకన ఈ దండన ?


నువ్వంటే భయమా ,భారమా ? 
బ్రతికుండగా భయాలోంధన
అంధకారమే అన్యుడిలాగా
హలాహలన్నే చిమ్మునా 
కాంతిహీనమై మారి దేహము
వినీలమయ్యి పోవునా 

చర చర చర ధ్వనులే మ్రోగి
జర జర విద్వంసం చేయునా?
ఎక్కడి గుండెలు అక్కడే ఆగి 
మృత్యు కేల అవలంభించునా ?

కనికరమే లేని ఓ పాషమా
ఏ పాపమంటూ నీకు లేనే లేదా ?
కాష్మాండం కరుడ గృహల్లో 
కమ్మగా నీ నిద్ర వచ్చునా ? 

ఏమిటి నీ ఈ రణం  
ఏమిటి నీ ఈ మౌనం

మరణమా మరణమా మరణమా    
//రాజేంద్ర ప్రసాదు //10. 02. 15//

0 comments:

Post a Comment