Saturday, 21 February 2015

కవిత నెం84:నేనంటే

కవిత నెం :84

నేనంటే <<<<<>>>>>>>>>నేనింతే 
****************************
నేనంటే ..... నేనింతే 
నాలో లోపము ఇంతే 
నాలో కోపము ఇంతే 
నాలో స్నేహము ఇంతే 
నాలో వైరము ఇంతే 
నాలో భావాలు ఇంతే 
నాలో భాద ఇంతే 
నాలో ద్వేషం ఉండదంటే 
నన్ను ఈర్షా తాకదంతే 
నాలో స్వార్ధం లేదంటే 
అహం అందరిలోనూ అంతే 
నాలోని అహం కొంచెమంతే 
పొరపాట్లు జరుగుతాయంతే 
నేను తప్పు చేస్తే ఒప్పుకుంటాను ఇట్టే 
నా వ్యక్తిత్వం నా సొంతమంతే 
అప్పుడప్పుడు రాజీ తప్పదంతే 
ఆశ ,కోరిక అందరికీ అంతే 
నేనూ అశ పడుతుంటాను ఇట్టే 
నాలో ధైర్యము అంటే 
అప్పుడప్పుడూ భయమూ వస్తుందంతే 
విజయమంటే ఇష్టము ఇంతే 
ఓడిపోవటంలో ఆనందము ఇంతే 
కపటాలు తెలియవు అంతే  
చొరవతో మాట్లాడటం తెలుసునంతే 
మంచికి ముందుంటాను  అంతే 
చెడుని సహించలేని గుణము ఇంతే 
నాకు ప్రేమ ఎక్కువంతే
నాకున్న పద్దతులు ఇంతే 
నాకు తెలిసిందీ ఇంతే 
నేను మారను అంతే 
నేను మారాల్సింది లేదంతే 
//రాజేంద్ర ప్రసాదు // 22. 02. 15 //

Related Posts:

  • కవిత నెం : 294(వయ్యారిభామ) కవిత నెం : 294 *వయ్యారిభామ  * ఎందుకు వస్తావు ఎందుకు వెళ్తావు నా మనసుని గిల్లుతావు గిల్లి లొల్లి పుట్టిస్తావు ఇంతలో మళ్లీ కానరావు పెదవిపై నవ్… Read More
  • కవిత నెం :323(ప్రియ మధనం) కవిత నెం :323 *ప్రియ మధనం * పిలిస్తే పలుకుతావు పలకరించే పిలుపునివ్వవు అందుకోమని చేయినిస్తావు నీ చేతివేలు చివర్నైనా తాకనివ్వవు ముద్దమందారంలా మెరిసి… Read More
  • కవిత నెం :288(నీ ప్రేమలో నా గమనం) కవిత నెం :288 * నీ ప్రేమలో నా గమనం * నిన్ను చూస్తే నా కలం సాగుతుంది నిన్ను చూసాక నా కవిత పొంగుతుంది నీవున్న చోట ప్రేమ పరిమళిస్తుంది నీతో కలిసి నడిచే… Read More
  • కవిత నెం :306(ప్రేమ సంకెళ్లు) కవిత నెం :306 * ప్రేమ సంకెళ్లు * ప్రతీ ప్రేమ నేడు పంతమే కాదు తన ప్రేమని కూడా బాధ్యతతో నడుస్తుంది తాను రాజీ పడుతూ త్యాగాన్ని తెరలా అడ్డం పెడుతుంద… Read More
  • కవిత నెం 270: నిన్నే ప్రేమిస్తా కవిత నెం :270 *నిన్నే ప్రేమిస్తా ** ప్రేమను ప్రేమగా పొందాను ,పొందుతున్నాను ప్రేమను ప్రేమగా చూడటమంటే తెలుసుకున్నాను ప్రేమకు అర్ధమే నీవని ,నీవ… Read More

0 comments:

Post a Comment