Saturday, 14 February 2015

కవిత నెం81:ప్రేమిస్తా

కవిత నెం :81

ప్రేమను ప్రేమగా పొందాను ,పొందుతున్నాను 
ప్రేమను ప్రేమగా చూడటమంటే తెలుసుకున్నాను 
ప్రేమకు అర్ధమే నీవని ,నీవుంటే ఏమీ అవసరంలేదని 
ప్రేమలోన దాగున్న ప్రేమను నాకోసం పంచావు 
ప్రేమతో నన్ను ప్రేమిస్తూ నా ప్రాణమై నిలిచావు
ప్రేమాక్షర భీజాలను నాలో నాటావు 
ప్రేమాక్షయ పాత్ర లాగా నిరంతర ప్రేమను ఇస్తున్నావు 
నిన్ను ప్రేమిస్తూ ,నాలోన నీపై ప్రేమను ప్రేమిస్తూ 
''ప్రేమ '' మంత్రం జపిస్తూ ప్రేమికుడిలా పయనిస్తూ 
నీ ప్రేమ హస్తంతో ప్రేమమయం లో విహరిస్తూ 
ప్రేమతో నిండిన హృదయాలతో జీవిస్తున్నాము 
ప్రేమంటే కలవరం అనుకున్నా కాని 
నువ్వొచ్చాక తెలిసింది నీ ప్రేమ పొందటం ఒక వరం అని 
అందుకే నిన్ను ప్రేమిస్తున్నాను 
ప్రేమిస్తాను ..... ప్రేమిస్తూనే ఉంటాను




Related Posts:

  • కవిత నెం160:పొగ -సెగ కవిత నెం : 160 పొగ -సెగ  కంటికి కనపడే ఆవిరి లాంటి రెండక్షరాల రూపం ప్రపంచాన్నే తన గుప్పిటపెట్టుకున్న వ్యసనదాహం యువతరాన్నిఉర్రూతలూగించే ఒక మైకం … Read More
  • కవిత నెం 158:నాన్న నువ్వంటే ఇష్టం కవిత నెం :155 నాన్న నువ్వంటే ఇష్టం  నువ్వంటే ఇష్టం నాన్న  నీ రూపం నా  ఊహలకు మాత్రమే పరిమితమైనా  నువ్వంటే ఇష్టం నాన్న  నీ వే… Read More
  • కవిత నెం156:నా అభీష్టం కవిత నెం : 156 నేను మాటలే కాని చేతలకి చొరవ చూపే వాడిని కాను  నేస్తం నా జీవితపయనం ఇక  కాబోదు  నా సన్నిహితం  నా ప్రాణ … Read More
  • కవిత నెం155:అంతరంగసరాగాలు కవిత నెం : 155 ఎన్నో పరిచయాలు వాటితో ఎన్నెన్నో ప్రయాణాలు  మెలివేసుకునే స్నేహ సాంగత్యాలు , ఆ స్వర రాగం లోనుంచి పుట్టే హావ భావాలు, అంతరంగ… Read More
  • కవిత నెం 157:మండే సూరీడు కవిత నెం : 157 మండే సూరీడు  భగభగమంటూ ,ఎర్రటినిప్పై మండుతూఉంటాడు  సెగలనుకక్కుతూ,  ప్రపంచానికే వెలుతురునిస్తాడు  ఉదయంలా వచ్చి , ఉ… Read More

0 comments:

Post a Comment