Saturday 21 February 2015

కవిత నెం 83:ప్రేమంటే ...

కవిత నెం :83

!! ప్రేమంటే ... !!

ప్రేమంటే రెండక్షరాలతో మొదలయ్యే కావ్యం 

ప్రేమంటే రెండు మనసులలో మెదిలే ''సరిగమ'' ల రాగం  
ప్రేమంటే రెండు హృదయాలతో జరిగే ''సంఘర్షణ '' యాగం 
అందమైన భావం ఇది, ఏడురంగుల ఇంద్రధనుస్సు ఆకారం 

ఒక రూపమంటూ లేనిది, లోకమంతటా సంచరించేది 
భాషంటూ లేనిది ,ప్రతి మనసునీ చదివేస్తూ ఉంటుంది 
కులమతాలకు అతీతమైనది  -మానవతే తన తత్వమైనది 

ప్రతి మదిలో మెదిలే ఏకైక మంత్రం ''ప్రేమ ''
ఊహలకందనిది  , ఊసుల నిక్షేపమిది ''ప్రేమ '' 
కనపడదు కాని, తనపై కవిత్వాలనే వ్రాయిస్తుంది ''ప్రేమ'' 
అందం ,ఆకర్షణలకు లొంగనిది ,అంతరంగ తలపుల సంగమమది 

ఏ హద్దులు లేనిది ,అనంతమై విశ్వమంతటా నిండి ఉంటుంది 
మాటలతో చెప్పలేనిది , అనుభవాత్మక ప్రేరణ ఇది 
అన్ని బంధాలతో  అల్లుకుని ఉంటుంది ''ప్రేమ''
పవిత్రమైన ఆత్మీయతకు అర్ధం ''ప్రేమ ''
స్వార్ధం లేనిది ప్రేమ , స్వచ్చమైనది ప్రేమ 
మరణం లేనిది ప్రేమ , మనసుల సంజీవని ప్రేమ 

నిరీక్షణను గెలుస్తుంది ప్రేమ,  త్యాగానికి ముందుంటుంది ప్రేమ 
అమూల్యమైనది ప్రేమ ,అపూర్వమైనది ప్రేమ 
నీ వెంటే పయనించేది ప్రేమ , నీకు తోడులా వచ్చేది ప్రేమ
ఆశలకు ఊపిరినిచ్చేది ప్రేమ, అందరికీ గొప్పవరం ప్రేమ 

ఎన్ని ప్రేమల సమూహమో కదా... మన మానవ జన్మ 
''ప్రేమ'' లేని ప్రకృతిని ఊహించటం మన తరమా ?
''ప్రేమ'' మనం ప్రేమించే ప్రతి జీవిలో ,ప్రతి వస్తువులో ఉంటుంది 
ఆ ''ప్రేమ'' మనం జీవించినంత కాలం మనతోనే ఉంటుంది 

''ప్రేమ''ను ప్రేమగా చూస్తే ప్రేమించటం తెలుస్తుంది 
''ప్రేమ''తో కాలక్షేపం చేస్తే విషాన్ని చిమ్ముతుంది 
ప్రేమంటే పవిత్రత కాని ... కళ్ళు మూసుకునే కామం కాదు 
ప్రతి దానికి ''ప్రేమ'' పేరు చెప్పి ప్రేమ విలువను  తగ్గించకు 

సాహితీ సేవ చిత్ర కవిత పోటీ -13 కోసం 
//రాజేంద్ర ప్రసాదు //21. 02. 15 //







0 comments:

Post a Comment